S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/11/2019 - 01:40

ఉప్పల్, నవంబర్ 10: కారులో గంజాయి ప్యాకెట్లను రవాణా చేస్తున్న ఇద్దరిని ఉప్పల్ ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు అరెస్టు చేసి వారి వద్ద రూ.1.32లక్షల విలువైన 22కేజీల ఎండు గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

11/11/2019 - 01:04

ఆత్మకూరు, నవంబర్ 10 : వ్యవసాయమే జీవనోపాధి చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్న అన్నదాత అప్పుల భారంతో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆత్మకూరు మండల పరిధిలోని పెద్దనంతాపురం గ్రామానికి చెందిన రైతు గుంటక అనంతరెడ్డి(65) ఉదయం తన సొంత పొలం వెళ్లి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి బంధువులు తెలిపారు.

11/11/2019 - 00:48

నల్లకుంట (హైదరాబాద్), నవంబర్ 10: వివాహ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి నలుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం..

11/11/2019 - 00:32

శ్రీకాకుళం: కార్తీకమాసం రెండవ ఆదివారం కళింగపట్నం-మత్స్యలేశం మధ్య పిక్నిక్‌కు వెళ్లిన విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒక మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళం నగరం నుంచి సరదాగా గడిపేందుకు కళింగపట్నం పిక్నిక్‌కు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు వెళ్లారు. గార మండలం కళింగపట్నం బీచ్‌లో సాయంత్రం 4గంటల సమయంలో స్నానాలకు దిగారు.

11/10/2019 - 06:10

పెనుమూరు, నవంబర్ 9: మోగిలిఘాట్ రోడ్డు ప్రమాదం మరువక ముందే చిత్తూరు జిల్లాలో మరో విషాధ సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి పెనుమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు ఇద్దరు బిడ్డలు దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రాజఇండ్లు వద్ద లారీని ద్విచక్రవాహనం ఓరవ్ టేక్ చేయబోయే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ చక్రాల కింద పడి తండ్రి, కుమారుడు, కుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు.

11/10/2019 - 02:08

పమిడిముక్కల, నవంబర్ 9: మండల పరిధిలోని కృష్ణాపురం-ఐలూరు మార్గంలో దళిత శ్మశాన వాటిక వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని ఎస్‌ఐ జి శ్రీనివాస్ తెలిపారు. ఐలూరు వైపు వెళుతున్న షైనీ బైక్, కృష్ణాపురం వైపు వస్తున్న టీవీఎస్ మోపెడ్ శ్మశానవాటిక మలుపు వద్ద ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు కిందపడగా వారికి తీవ్ర గాయాలయ్యాయి.

11/10/2019 - 01:17

అయోధ్యపై ఇది సయోధ్య శకం..
భారతీయ సామరస్య జీవనంలో నవోదయం.. దశాబ్దాల అయోధ్య వివాదానికి తెర పడింది.. ‘అయోధ్య’ రాముడి జన్మస్థలమేనని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం నిగ్గు తేల్చింది. ఆ స్థలాన్ని హిందువులకే కేటాయించింది. ప్రత్యామ్నాయంగా ముస్లింలకు ఐదెరకాల భూమిని అందించింది.

11/10/2019 - 06:00

విజయవాడ (క్రైం): ఏపీ రాజభవన్‌లో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడిన వ్యక్తులను విజయవాడ సీసీఎస్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో పోట్రోకాల్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న సుశీల్ అనే వ్యక్తి సుమతి కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా మోసానికి పాల్పడినట్లు కేసుకు సంబంధించి దర్యాప్తులో కీలక అంశంగా పోలీసు అధికారులు నిర్ధారించారు.

11/09/2019 - 01:02

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అతిక్రమించి సాగు, రవాణాకు పాల్పడితే వారి జీవితం జైలుకే పరిమితమయ్యేలా చర్యలు తప్పవని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మత్తుపదార్థాల అక్రమ రవాణాపై దక్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్నాతాధికారులతో శుక్రవారం వర్క్‌షాపు నిర్వహించారు.

11/09/2019 - 01:02

మదనపల్లె, నవంబర్ 8: పెళ్ళికి వచ్చిన ఆరేళ్ళ చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి, ఆపై పైశాచికంగా హత్యచేసిన విషాధసంఘటన శుక్రవారం చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్ళు పంచాయతీ గౌనివారిపల్లి సమీపంలోని ఓ కల్యాణమండపం సమీపంలో చోటుచేసుకుంది. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి...

Pages