S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/10/2018 - 00:39

న్యూఢిల్లీ, జూలై 9: సభ్య సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన 23ఏళ్ల మెడికో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య పైశాచిక కృత్యంలో దోషలకు ఉరిశిక్ష ఖరారైంది. ఇప్పటికే మరణ శిక్ష ఎదుర్కొంటున్న నలుగురిలో ముగ్గురు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. మరణ శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలంటూ దోషులు చేసిన వాదనలో ఎలాంటి పస లేదని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

07/09/2018 - 04:01

చీడికాడ: ప్రమాదవశాత్తూ నెలబావిలోపడిన కూతురుని రక్షించబోయి తల్లి మరో కూతురు మృత్యవాత పడ్డ సంఘటన శనివారం రాత్రి విశాఖపట్నం జిల్లా, చీడికాడ మండలంలోని చుక్కపల్లి గ్రామంలో సంభవించింది. చుక్కపల్లికి చెందిన చామంతుల భవాని(40) శనివారం సాయంత్రం తన ఇద్దరు పిల్లలైన జయంతి(12), వరలక్ష్మి(8)తో పొలంలోకి వెళ్ళింది.

07/09/2018 - 03:41

తాడికొండ, జులై 8: ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని నమ్మబలికాడు. తన కామదాహం తీర్చుకున్నాడు. వంచనకు గురైన యువతి గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకోమంటే తను ఏ పాపమూ ఎరుగనని బుకాయించిన నయవంచకునిపై గుంటూరు జిల్లా తాడికొండ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.

07/09/2018 - 02:58

న్యూఢిల్లీ: సంఘంలో కోరలు చాచి చిన్నపిల్లలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్న డ్రగ్ భూతాన్ని తరిమివేయడానికి తాము గతంలో ఇచ్చిన తీర్పు మేరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

07/08/2018 - 23:16

చీరాల, జూలై 8: వాడరేవు తీరానికి వచ్చిన ముగ్గురు స్నేహితుల విహారం విషాదంతో ముగిసింది. తోటి స్నేహితుడు నీళ్లలో మునిగి పోతుండడంతో అతనిని రక్షించాలంటూ కేకలు వేసినా ప్రయోజనం కరువైంది. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన స్నేహితుడు కళ్లముందే సముద్రంలో కొట్టుకుపోతుంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితి.

07/08/2018 - 23:11

తడ, జూలై 8: తడ బజారు కూడలిలో డివైడర్‌పై నడిచివస్తూ ప్రమాదవశాత్తు లారీ కిందపడి తమిళనాడు ప్రాంతంలోని తిరువళ్లూరులో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నేతాజి (45) అనే వ్యక్తి దుర్మరణం పాలైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

07/08/2018 - 23:08

తిరుపతి, జూలై 8: కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, రాంనగర్ జిల్లా, కనకపురం బస్ట్ఫా వద్ద ఎల్.మధు అనే స్మగ్లర్‌ను చిత్తూరు జిల్లా గాజులమండ్యం పోలీసులు శనివారం ఉదయం అరెస్టు చేసినట్లు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి వెల్లడించారు.

07/08/2018 - 22:53

ధర్మవరం, జూలై 8 : మండలంలోని కుణుతూరు గ్రామంలో ఆదివారం మట్టిపెళ్లలు విరిగిపడి ఉపాధికి వెళ్ళే కూలీ ఖాశీంపీరా (43) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తన ఇంటి నిర్మాణం నిమిత్తం కోసం ఇసుక తెచ్చుకునేందుకు కుమారుడితో కలిసి గ్రామ సమీపంలోని వంకలోకి వెళ్ళారు. ఇసుకను తోడుతుండగా ఉన్నపళంగా పైనుండి మట్టిపెళ్లలు ఖాశీంపీరా మీదకు విరిగిపడ్డాయి.

07/08/2018 - 22:51

అనంతపురం అర్బన్, జూలై 8: రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించి వాహనాలను నడుపుతున్న వాహనదారులపై గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో 7,619 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

07/08/2018 - 04:23

మలికిపురం, జూలై 7: మలికిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిమెళ్లంకలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతిచెందారు.

Pages