S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/09/2019 - 00:56

నెల్లూరు, నవంబర్ 8: నెల్లూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి బాలిరెడ్డి సుధాభారతికి నెల్లూరులోని 2వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు 6 నెలలు జైలు శిక్షను విధించింది. ఆమెతో పాటూ భర్త వీఎస్ మురళీకృష్ణారెడ్డికి కూడా 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.

11/09/2019 - 00:22

విజయవాడ (క్రైం), నవంబర్ 8: పోలవరం పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. నవయుగ సంస్థ పిటిషన్‌పై విచారించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పోలవరం ప్రాజెక్టు అథారిటీ వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొంటూ అథారిటీకి నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది.

11/09/2019 - 00:12

బంగారుపాళ్యం, నవంబర్ 8: చిత్తూరు జిల్లా పలమనేరు - చిత్తూరు రహదారిలో మోగిలి ఘాట్ రోడ్డు లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. ప్రమాదంలో మృతి చెందిన 8 మంది చిత్తూరు సమీపంలోని తెల్లగుండ్ల పల్లిలో తమ బంధువుల దహనక్రియలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

11/09/2019 - 00:09

హైదరాబాద్, నవంబర్ 8: తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన చలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి లేదని తెలంగాణ రాష్ట్ర పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (శాంతి భద్రతలు) జితేందర్ స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు అటంకం కలిగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

11/08/2019 - 23:59

చింతపల్లి, నవంబర్ 8: మానసిక స్థితి సరిగ్గాలేని ఒక వ్యక్తి అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించడంతో దొంగగా భావించి దారుణంగా కొట్టి చంపిన సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని టీకే మల్లేపల్లి శుక్రవారం చోటు చేసుకుంది.

11/08/2019 - 23:58

మహదేవ్‌పూర్, నవంబర్ 8: వారికెలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థికపరమైన సమస్యలూ లేవు. ఆస్తిపాస్తులకు కొదువ లేదు. ఇద్దరు భార్యాభర్తలదీ అన్యోన్య జీవితం. నలుగురు సంతానాన్ని ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పెద్ద చేసి పెళ్లిళ్లు కూడా చేశారు. చివరి దశలో వారికి అండగా నిలబడాల్సిన కన్నవారే వారిని నిర్లక్ష్యం చేయడం సూటిపోటి మాటలనడం, అవమానకరంగా మాట్లాడడాన్ని ఆ వృద్ధ దంపతులు జీర్ణించుకోలేకపోయారు.

11/08/2019 - 23:56

గజ్వేల్, నవంబర్ 8: ‘టిక్‌టాక్’ యాప్ ద్వారా పరిచయమైన యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. దీంతో యువకులు పోలీస్‌స్టేషన్‌లో ఊచలు లెక్కబెడుతుండగా, యువతులను ఉజ్వల్ హోంకు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

11/08/2019 - 23:10

జమ్మూ, నవంబర్ 8: కాశ్మీర్‌లో ఎదురుకాల్పుల్లో భారత్‌కు చెందిన మరో సైనికుడు మృతి చెందాడు. నియంత్రణ రేఖను దాటి చొరబాట్లకు యత్నిస్తున్న ఉగ్రవాదుల అలికిడిని గమనించి భద్రతా దళాలు కాల్పులకు దిగాయి. పరస్పర కాల్పుల్లో సెపో రాసుల్ నైరు సులగేకర్ అనే సైనికుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో పూంచ్ జిల్లా కిష్ట్ర గతి సెక్టార్‌లో చోటుచేసుకొంది.

11/08/2019 - 22:58

హైదరాబాద్, నవంబర్ 8: దేశ వ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2017 సంవత్సరంతో పోల్చితే 2018లో హింసాత్మక సంఘటనలు 8.3 శాతం, మరణాలు 8.7 శాతం తగ్గాయి. హింసాత్మక సంఘటనలు 908 నుంచి 833కు తగ్గాయి. అదే విధంగా మరణాలను విశే్లషిస్తే 263 నుంచి 240కు తగ్గాయి.

11/08/2019 - 22:57

హైదరాబాద్, నవంబర్ 8: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లోనూ, ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యాసంస్థల్లో ర్యాగింగ్ బూతం జడలువిప్పుకున్నా ఉన్నత విద్యాశాఖ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అదేదో సంబంధిత విద్యాసంస్థలకు పరిమితమైనట్టు మండలి అధికారులు వౌనం వహించగా, కేవలం సర్క్యులర్లను జారీచేసి విద్యాశాఖ చేతులు దులుపుకుంది.

Pages