S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/07/2019 - 04:44

న్యూఢిల్లీ, మే 6: లైంగిక వేధింపుల ఆరోపణల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కి క్లీన్ చిట్ లభించింది. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిలో ఎలాంటీ పస లేదని త్రిసభ్య ఇన్‌హౌస్ దర్యాప్తు ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 14 రోజుల్లో ఈ కమిటీ తన విచారణను పూర్తి చేసింది.

05/07/2019 - 04:00

చిత్తూరు, మే 6 : చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్‌కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లోని లాకర్ తాళాలు పగులకొట్టి అందులోని రూ 19.20 లక్షల విలువజేసే 80 సవర్ల (640గ్రాములు) బంగారు ఆభరణాలతో పాటు, రూ 1.50 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు.

05/07/2019 - 02:55

ఉప్పల్, మే 6: నగర శివారులో దొంగలు మళ్లీ విజృంభించారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు ఇంట్లో దాచిన రూ.4.70 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం, పది తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ భవానీనగర్‌లో నివసిస్తున్న రాజు కుటుంబ సమేతంగా జగద్గిరిగుట్టలోని బందువుల ఫంక్షన్‌కు ఆదివారం రాత్రి వెళ్లారు.

05/07/2019 - 02:54

తాండూరు, మే 6: గత నెల 30న పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన మెడలోని బంగారు నాను గుర్తు తెలియని దొంగలు తస్కరించారని ఒక మహిళ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ అమృతమ్మ సోమవారం తాండూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన మెడలోని బంగారు నాను ఇంట్లోనే ఉందని తాను ఆ రోజు మరచిపోయి బంగారు నాను దొంతనం అయినట్లు ఫిర్యాదు చేశానని పోలీసులకు తెలిపింది.

05/07/2019 - 02:54

దిల్‌సుఖ్‌నగర్, మే 6: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న వ్యక్తి, అందుకు సహకరించిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం జడ్చర్ల మండలం గొల్లపల్లి ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్(25) వృత్తిరీత్యా అరబిందో ల్యాబ్‌లో ల్యాబ్ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

05/07/2019 - 02:53

జీడిమెట్ల, మే 6: ఒకప్పుడు ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాహనాలు...ఆపదలో ఉండి 108కు ఫోన్ చేస్తే కూయ్యి కూయ్యి అంటూ గల్లీలోకి వచ్చి రోగులకు ప్రథమ చికిత్స అందించి నగరంలోని ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడిన ఆ అంబులెన్స్‌లు నేడు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కాలం చెల్లిన 108 అంబులెన్స్‌లు సుమారు 60 వరకూ నిరుపయోగంగా పడి ఉన్నాయి.

05/06/2019 - 22:03

న్యూఢిల్లీ, మే 6: రాఫెల్ యుద్ధ విమానాల కేసుతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆపాదించిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలపై ఈనెల 10న విచారణ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రాఫెల్ కుంభకోణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనని వ్యాఖ్యలను రాహుల్ గాంధీ చేయడంతో దీనిని సుప్రీం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే.

05/06/2019 - 22:02

న్యూఢిల్లీ, మే 6: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియామవళి (ఎంసీసీ)ని ఉల్లంఘించలేదంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ (సిఇసీ) క్లీన్ చిట్ ఇచ్చినట్లయితే, ఆ రికార్డులను తమ ముందు ఉంచాలని సుప్రీం కోర్టు పిటీషనర్‌ను ఆదేశించింది.

05/06/2019 - 04:39

సోమందేపల్లి, మే 5 : అనంతపురం జిల్లాలో ఆదివారం ఓ కారు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమందేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఐదుగురు పశువుల వ్యాపారులు కారులో అనంతపురం నగరంలో జరిగే పశువుల సంతకు వచ్చారు. ఇక్కడ పని ముగించుకుని తిరిగి స్వస్థలం బయల్దేరారు.

05/06/2019 - 04:10

డిండి, మే 5: నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ బావివద్ద ముకురాల రాములమ్మ(50) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు రాములమ్మ భర్త నిరంజన్‌గౌడ్ తమ్ముని కొడుకు శేఖర్ కత్తితో రాములమ్మ తలపై, మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుపడిన నిరంజన్‌గౌడ్ చేతికి తీవ్ర గాయమవ్వడంతో దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.

Pages