S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/08/2019 - 01:39

మెహిదీపట్నం, నవంబర్ 7:డబ్బులు ఇవ్వకపోవడంతో హత్యా ప్రయాత్నం చేసిన ముగ్గురిలో ఇద్దరిని రిమాండ్‌కు తరలించారు. వివరాలను పశ్చిమ మండల డీసీపీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. గోల్కొండకు చెందిన సయ్యద్ సాజిద్ రేషాంబాగ్‌లో సెలూన్ షాపు నిర్వహిస్తున్నాడు.

11/08/2019 - 01:38

సికింద్రాబాద్, నవంబర్ 7: ముగ్గురు చైన్ స్నాచర్లను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, వారి నుంచి ఎనిమిది గ్రాముల బంగారం, ద్విచక్ర వాహనం, మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

11/08/2019 - 01:07

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యాం నిర్మాణం వల్ల తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు జరిగే నష్టంపై విచారించేందుకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ) గురువారం నలుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక అందిస్తుంది.

11/08/2019 - 00:59

హైదరాబాద్, నవంబర్ 7: ఆర్టీసీ సమ్మెకు సంబంధించి గురువారం వాదనలు జరిగిన సందర్భంగా హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. 11వ తేదీలోగా చర్చలు జరపాలని ఆదేశించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ సింగ్ ఐఏఎస్‌లపై అసహనం వ్యక్తం చేశారు. అధికారుల సమర్పించిన నివేదికల్లోని అంశాలపై మండిపడ్డారు. సుదీర్ఘ వాదనల అనంతరం విచారణ 11వ తేదీకి వాయిదా వేశారు.

11/08/2019 - 00:56

హైదరాబాద్, నవంబర్ 7: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతరం షెడ్యూలు -9లోని సంస్థలు, కార్పొరేషన్లలో ఏపీఎస్‌ఆర్టీసీ విభజన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు హైకోర్టులో జరిగిన విచారణలో పేర్కొంది. కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపించారు.

11/08/2019 - 00:25

న్యూఢిల్లీ, నవంబర్ 7: కోయంబత్తూర్‌లో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య కేసులో నిందితుడి రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. నిందితుడి మరణశిక్ష తీర్పు అంశంలో ఎలాంటి పిటిషన్‌లను స్వీకరించేది లేదని కోర్టు పునరుద్ఘాటించింది. మెజారిటీ నిర్ణయం మేరకు రివ్యూ పిటిషన్‌ను స్వీకరించలేమని స్పష్టం చేసింది.

11/08/2019 - 00:07

న్యూఢిల్లీ, నవంబర్ 7: అధికారులు అల్లర్లు జరిగేంత వరకు ఆంక్షలు విధించకుండా వేచిచూడాలా? అని సుప్రీంకోర్టు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ను ప్రశ్నించింది.

11/07/2019 - 05:10

కాకినాడ, నవంబర్ 6: పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరి అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఒక చిరుద్యోగి మూడు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టారు. వీటి మార్కెట్ విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని సమాచారం. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం జరిపిన సోదాల్లో పలు స్థిరాస్తులు, భారీగా బంగారు ఆభరణాలు, నగదు గుర్తించారు. వివరాలిలావున్నాయి...

11/07/2019 - 02:40

విజయవాడ (క్రైం), నవంబర్ 6: విజయవాడ నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్ మురళీ గౌడ్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం నిర్వహించిన దాడుల్లో కోటి రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆక్రమాస్తుల ఫిర్యాదులపై రాష్ట్రంలోని తిరుపతి, విజయవాడతోపాటు హైదరాబాద్, బెంగళూరులో ఈ తనిఖీలు చేపట్టారు.

11/07/2019 - 01:59

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో ముద్దాయిగా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బుధవారం ఢిల్లీ హైకోర్టుకు హాజరై, తనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Pages