S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/03/2019 - 02:24

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ప్రాంగణం శనివారం పోలీసులకు, లాయర్లకు మధ్య తీవ్ర ఘర్షణలకు కేంద్రమైంది. ఈ ఘర్షణల్లో 9 పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో తమ సహచరులిద్దరు గాయపడ్డారని లాయర్లు చేసిన ఆరోపణలను అధికారులు తిరస్కరించారు. అసలు తాము కాల్పులే జరపలేదని స్పష్టం చేశారు.

11/03/2019 - 02:20

వరంగల్: అక్రమంగా గంజాయి రవాణకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను శనివారం వరంగల్ కమిషనరేట్ టాస్క్ఫోర్స్, హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి 32 లక్షల విలువ గల 320 కిలోల గంజాయితో పాటు రెండు కార్లు, రెండు కత్తులు, రెండు సెల్‌ఫోన్లు టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11/02/2019 - 01:08

లక్నో, నవంబర్ 1: విష వాయువు పీల్చడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్, సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో మురుగు నీటి ట్యాంక్ మరమ్మత్తులు చేస్తున్న సమయంలో వెలువడిన విష వాయువును పీల్చిన ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. సుల్తాన్‌పూర్ జిల్లా, దోస్త్‌పూర్ గ్రామంలోని కట్‌ఘర పట్టి గ్రామంలో ఈ ఘటన జరిగిందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హిమాంశు కుమార్ తెలిపారు.

11/02/2019 - 01:07

శ్రీనగర్, నవంబర్ 1: శ్రీనగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఆంక్షలు విధించారు. శుక్రవారం సామూహిక ప్రార్థనల తరువాత హింసాత్మక ప్రదర్శనలు జరుగుతాయనే భయంతో శాంతి భద్రతల నిర్వహణ కోసం ముందు జాగ్రత్త చర్యగా ఈ నిషేధాజ్ఞలు విధించారు. రాజ్యాంగంలోని అధికరణం 370ని రద్దు చేసిన తరువాత వరుసగా 89వ రోజు శుక్రవారం కూడా కాశ్మీర్‌లో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.

11/02/2019 - 01:06

కోహిమా, నవంబర్ 1: నాగాలాండ్‌ను దశాబ్దాలుగా పీడిస్తున్న తీవ్రవాద సమస్యను పరిష్కరించడానికి జరుపుతున్న చర్చల్లో పురోగతి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నెయిఫియు రియో తెలిపారు. ఇంకా చర్చలు ముగియాల్సి ఉందని, తరువాత భాగస్వాములందరితో సంప్రదింపులు జరిపిన తరువాత ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందని కేంద్రం ప్రకటించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్చలతో సానుకూల ఫలితం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

11/02/2019 - 01:06

గౌహతి, నవంబర్ 1: రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్‌కు ఉన్న స్వయం ప్రతిపత్తి హోదాను తొలగించడం ద్వారా భరత జాతికి ఉన్న నిజమైన ఐక్యతను చాటినట్లు అయ్యిందని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. లోగడ 370-అధికరణ అమలులో ఉండడం వల్ల కాశ్మీర్‌కు, దేశ ప్రజలకు మధ్య అడ్డుగోడ ఉండేదన్నారు.

11/01/2019 - 23:52

శ్రీనగర్‌లో తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ శుక్రవారం పెరిగిన గస్తీ

11/01/2019 - 23:48

హైదరాబాద్, నవంబర్ 1: ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై హైకోర్టులో శుక్రవారం నాడు విచారణ కొనసాగింది. ప్రభుత్వం తరఫున ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ సమర్పించిన అఫిడవిట్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నివేదిక అసమగ్రంగా, తప్పుడు లెక్కలతో ఉందని, న్యాయస్థానానికి సైతం సరైన రీతిలో వాస్తవాలు చెప్పకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేసింది.

11/01/2019 - 23:46

హైదరాబాద్, నవంబర్ 1: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై అక్టోబర్ 18నే వాదనలు ముగించిన సీబీఐ కోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

11/01/2019 - 23:45

హైదరాబాద్, నవంబర్ 1: మందుల కొనుగోలు కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో అడుగు ముందడుగు వేశారు. ఈ కుంభకోణంలో తేజ ఫార్మసీ ఎండీ శ్రీనివాసరెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు. అతనికి ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించింది. ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 17కు చేరుకుంది. శ్రీనివాసరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో పలు కీలక దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు.

Pages