S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/01/2019 - 23:07

విశాఖపట్నం, నవంబర్ 1: భూ కబ్జాల నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఆరంభమైంది. విశాఖలోని వుడా చిల్డ్రన్ థియేటర్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు స్వీకరణ నిర్వహించారు. ఈ నెల 7 వరకు కొనసాగనుంది.

11/01/2019 - 23:02

విజయవాడ (క్రైం), అక్టోబర్ 1: విశాఖ జిల్లా మధురవాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యలయంలో తనిఖీల వ్యవహారంలో ఏసీబీ అధికారుల మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నామని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులపై వచ్చిన ఫిర్యాదులపై జాయింట్ డైరెక్టర్ మోహన్‌రావును విచారణాధికారిగా నియమించినట్లు చెప్పారు.

11/01/2019 - 22:49

కరీంనగర్, నవంబర్ 1: డ్రైవఠ్ బాబు మ‘రణమే’ ఆర్టీసీ కార్మిక సమస్యల నేపథ్యంలో ఆఖరిది కావాలని, కేసీఆర్ సర్కారు చర్చలకు దిగి రావాలని అప్పటి వరకు అంత్యక్రియలు జరిపేది లేదంటూ పెద్దఎత్తున కరీంనగర్‌లో నిరసనలు వ్యక్తం కావడం తీవ్ర ఉద్రిక్తతతకు దారితీసింది. మూడు రోజుల క్రితం ఆర్టీసీ జేఏసీ సమరభేరి సభలో డ్రైవర్ బాబు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

11/01/2019 - 22:44

మహబూబాబాద్, నవంబర్ 1: డెంగ్యూ వ్యాధి మహబూబాబాద్ జిల్లాలో ప్రబలుతున్నది. ఈ వ్యాధి ఇద్దరిని కబళించింది. గార్ల మండల పరిధిలోని కొత్తతండాలో 14 సంవత్సరాల బాలిక, మూడుతండాలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటనలు శుక్రవారం చోటు చేసుకున్నాయి.

11/01/2019 - 22:42

నాగర్‌కర్నూల్/బిజినేపల్లి, నవంబర్ 1: ఇంచుమించు నెలరోజులుగా ఆర్టీసీ సమ్మె చేస్తునా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం, కుటుంబ పోషణకు భార్య, పిల్లలు కూలిపనులకు వెళ్తుండటంతో తీవ్ర మనస్తాపంతో ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

11/01/2019 - 06:06

హైదరాబాద్: కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఫిర్యాదు చేశారు. తనకు 15 ఎకరాల 25 గుంటల భూమి ఉన్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సీఈఓ ఫిర్యాదు చేశారు.

11/01/2019 - 05:59

హైదరాబాద్, అక్టోబర్ 31: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, అప్పటికే వివిధ మున్సిపాల్టీల్లో ఎన్నికలపై హైకోర్టులోని వేర్వేరుగా దాఖలైన పిటిషన్లలో స్టే మంజూరు చేయడంతో వాటిని తొలగించాలని ప్రభుత్వం హైకోర్టును మరోమారు ఆశ్రయించింది. రాష్ట్రంలోని వివిధ మున్సిపాల్టీలకు సంబంధించి 89 పిటిషన్లను అత్యవసరంగా కొట్టి వేయాలని ప్రభుత్వం తన తాజా పిటిషన్‌లో పేర్కొంది.

11/01/2019 - 06:03

గుంటూరు: ‘చెడు తిరుగుళ్లు’ వద్దని వారించినందుకు హైదరాబాద్‌లో ప్రియుడితో కలిసి కన్న తల్లిని హతమార్చిన కీర్తిరెడ్డి ఘటనను మరువకముందే గుంటూరులో అలాంటిదే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి రాయడం లేదనే కక్షతో కన్నతల్లినే హతమార్చిన భార్గవి ఉదంతమిది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

11/01/2019 - 05:28

హైదరాబాద్, అక్టోబర్ 31: ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ దేవికారాణి డొల్ల కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తేజా ఫార్మా కంపెనీ యజమాని రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి పేరుతో రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది.

11/01/2019 - 05:23

బాపట్ల, అక్టోబర్ 31: ఒకవైపు నిర్మాణ పనులు లేక సరుకు అమ్ముడుపోని పరిస్థితులు, మరోవైపు అప్పుల బాధ భరించలేక ఓ సిమెంట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో జరిగింది. పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మానేపూడి ప్రసాద్(45) సిమెంటు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగం కుదేలవడంతో సిమెంట్ అమ్మకాలు తగ్గాయి.

Pages