S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/25/2019 - 23:29

తిరుపతి, అక్టోబర్ 25: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలోని అన్నమయ్య నడకదారి అటవీ ప్రాంతంలో ఓ భక్తుడు ఉరివేసుకొని మృతిచెంది ఉండటాన్ని భక్తులు గుర్తించి అధికారులకు తెలిపారు. సమాచారం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. మృతుడు తమిళనాడుకు చెందిన సుందరరాజన్‌గా గుర్తించారు.

10/25/2019 - 23:24

త్రిపురాంతకం, అక్టోబర్ 25: శ్రీశైలంకు తూర్పు ముఖద్వారమైన త్రిపురాంతకంలో వెలసిన శ్రీత్రిపురాంతకేశ్వర బాలాత్రిపురసుందరీ దేవి అమ్మవారి ఆలయాల్లో గురువారం రాత్రి పంచలోహ విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. శ్రీత్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో పశ్చిమద్వారం నుంచి తాళాలు పగులకొట్టి దొంగలు లోనికి ప్రవేశించి పార్వతీదేవి అమ్మవారి పంచలోహ విగ్రహం, నటరాజ స్వామి విగ్రహాన్ని చోరీచేశారు.

10/25/2019 - 05:12

గుంటూరు, అక్టోబర్ 24: రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేని బాణసంచా దుకాణాలు, అక్రమంగా నిల్వచేసిన గోడౌన్లపై పోలీసు అధికారులు గురువారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 244 బాణసంచా తయారీ కేంద్రాలు, అక్రమంగా నిల్వచేసిన గోడౌన్లను సీజ్‌చేసి 105 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు.

10/25/2019 - 05:10

వరదయ్యపాళెం, అక్టోబర్ 24: చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం శ్రీసిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సుమారు కోటి రూపాయలు విలువ చేసే 90 ఎర్రచందనం దుంగలను శ్రీసిటీ పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీల్లో భాగంగా రాచకండ్రిగ చెక్‌పోస్ట్ వద్ద ఏపీ 27 యు 9257 నెంబర్ గల లారీలో ఎర్రచందనం ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నట్లు శ్రీసిటీ ఎస్‌ఐ సుబ్బారెడ్డి తెలిపారు.

10/25/2019 - 05:06

మండపేట, అక్టోబర్ 24: కష్టపడి పైకొచ్చి, ఆర్థికంగా స్థిరపడుతున్న తరుణంలో భార్య డెంగ్యూ వ్యాధితో చనిపోవడంతో మానసికంగా కుంగిపోయిన ఒక భర్త మూడేళ్ల కుమార్తెను హత్యచేసి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చనిపోవడంతో తాను ఎంత వేదన అనుభవిస్తున్నదీ సుదీర్ఘ లేఖలో పేర్కొనడం విశేషం. తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో గురువారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి...

10/25/2019 - 01:50

కడప లీగల్, అక్టోబర్ 24: చెక్కు బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను అరెస్టుచేసిన పోలీసులు గురువారం కడప కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనను బెయిల్‌పై విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగరం ద్వారకానగర్‌కు చెందిన పారిశ్రామికవేత్త బి.మహేష్‌కుమార్ సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు 2014లో రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడు. తీసుకున్న అప్పుకు సంబంధించి గణేష్ రూ.8 లక్షలకు చెక్కు ఇచ్చారు.

10/25/2019 - 01:33

విజయవాడ (క్రైం), అక్టోబర్ 24: రోడ్డు ప్రమాదానికి కారణమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు ఏడాది జైలుశిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ ఆ రో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గు రువారం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూష న్ కథనం ప్రకారం కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గంలో బొప్పన ఆ యిల్ మిల్స్ వద్ద 2014 ఏప్రిల్ 4న ప్రై వేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది.

10/25/2019 - 00:31

హైదరాబాద్, అక్టోబర్ 24: రాష్ట్రంలో వ్యాపిస్తున్న విష జ్వరాలపై సుప్రీం కోర్టు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘బాధితులకు మీ జేబుల్లో నుంచే డబ్బు ఇవ్వండి’ అంటూ ఉన్నతాధికారులను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విష జ్వరాల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషీ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

10/24/2019 - 23:42

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఐఎన్‌ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి పీ. చందంబరాన్ని జ్యుడీషియల్ కష్టడీకి తరలిస్తూ స్పెషల్ జడ్జి అజయ్ కుమార్ కుహార్ గురువారం ఆదేశాలు జారీ చేస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు వీలుగా ఈనెల 30వ తేదీ వరకూ చిదంబరం జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారని తెలిపారు.

10/25/2019 - 04:42

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తక్షణమే ఆదాయంలో భాగంగా ప్రభుత్వానికి ‘స్థూల ఆదాయంలో సర్దుబాటు చేయాల్సిన మొత్తం’ (ఏజీఆర్) 90వేల కోట్లు చెల్లించాలని టెలికం కంపెనీలను సుప్రీం ఆదేశించింది.

Pages