S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/24/2019 - 22:36

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: జమ్మూకాశ్మీర్‌లో ఇంకెంతకాలం ఆంక్షలు, నిషేధాజ్ఞలు కొనసాగుతాయని రాష్ట్ర పాలనాధికారులను సుప్రీంకోర్టు నిలదీసింది. చివరికి ఇంటర్‌నెట్ సదుపాయం ఎప్పుడు కల్పిస్తారో కూడా తెలియకుండా రోజులు గడుస్తున్నాయని వ్యాఖ్యానించింది.

10/24/2019 - 05:13

ఖైరతాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేష్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈనెల 4న బండ్ల గణేష్ తన అనుచరులతో వైసీపీ నేత, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) ఇంటిలో హంగామా సృష్టించాడు. జూబ్లీహిల్స్ పోలీసులను పీవీపీ ఆశ్రయించగా గణేష్‌పై కేసు నమోదు అయింది.

10/24/2019 - 05:02

గూడెంకొత్తవీధి, అక్టోబర్ 23: విశాఖ మన్యంలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో మాజీ మావోయిస్టు సభ్యుడిని మావోయిస్టులు హతమార్చారు. విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలు లంబయ్య అలియాస్ దివుడు(45)ని మావోయిస్టు కాల్చిచంపారు. గతంలో మావోయిస్టు పార్టీలో లంబయ్య పనిచేస్తూ 2011లో పోలీసులకు పట్టుబడ్డాడు. నాలుగు సంవత్సరాల పాటు జైలులో ఉండి 2013లో బెయిల్‌పై విడుదలయ్యాడు.

10/24/2019 - 04:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణపల నేపథ్యంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై సీబీఐ అధికారులు బుధవారం కేసు నమోదు చేశారు. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతోందన్న విషయం 2016లో రికార్డు చేసిన ఓ వీడియోలో స్పష్టమైంది. అప్పట్లో జార్ఖండ్ రాష్టప్రతి పాలన కింద ఉండగా, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి రప్పించడానికి రావత్ ప్రయత్నించారు.

10/24/2019 - 01:49

హైదరాబాద్, అక్టోబర్ 23: కుళ్లిన కూరగాయలు..ఫ్రిజ్‌లో ఆహారం నిల్వ..పత్తాలేని సిల్ట్ చాంబర్లతో అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఏడు హాస్టళ్లలోని కిచెన్‌లను జీహెచ్‌ఎంసీ అధికారులు బుధవారం సీజ్ చేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌లలోని పలు హాస్టళ్లలో జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ మెడికల్ ఆఫీసర్ డా.్భర్గవ నారాయణ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

10/24/2019 - 01:41

రాజేంద్రనగర్, అక్టోబర్ 23: పోలీసుస్టేషన్‌ను ఆనుకొని ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దొంగలు చొరబడి విలువైన వస్తువులు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలీసుస్టేషన్‌కు ఆనుకొని ఉంది. ఆర్టీసీ సమ్మెతో అక్టోబర్ 20 వరకు పాఠశాలకు సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. పాఠశాలకు చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు.

10/24/2019 - 01:05

హైదరాబాద్, అక్టోబర్ 23: తెలంగాణలో డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, ఇతర విషజ్వరాలతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నా స్పందించరా? అంటూ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత నిర్లక్ష్యమా? అని నిలదీసింది. విషజ్వరాల నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదా? స్పందించరా?

10/23/2019 - 22:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 23: మనీ ల్యాండరింగ్ కేసులో కర్నాటక కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఢిల్లీ హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 26 లక్షల రూపాయల పూచీకత్తు ఇవ్వాలని, ఇద్దరు సాక్షులను చూపించాలని, దేశం విడిచి వెళ్ళరాదని తెలిపింది.

10/23/2019 - 22:38

జైపూర్, అక్టోబర్ 23: సైబర్ నేరగాళ్ళ ఉచ్చులోపడి ఓ ఐఏఎస్ అధికారిణి ఆరు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనకు వచ్చిన ఓ నకిలీ ఫోన్‌కాల్‌కు అధికారిణి దొరిపోయారు. ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) నకిలీ మొబైల్ కాల్‌కి స్పందించిన ఆమె తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 6.10 లక్షల రూపాయలు నష్టపోయారు.

10/23/2019 - 05:42

హైదరాబాద్, అక్టోబర్ 22: ఆర్టీసీ అద్దె బస్సులకు టెండర్లను పిలవడాన్ని సవాలు చేస్తూ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశాయి. 1035 బస్సులను అద్దెకు తీసుకోడం కోసం టెండర్లను ఆహ్వానిస్తూ ఆర్టీసీ యాజమాన్యం జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

Pages