S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/23/2019 - 05:33

హైదరాబాద్, అక్టోబర్ 22: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాష్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. అతని పోలీసు కస్టడీ అంశంపై హైకోర్టు మూడు రోజులు స్టే విధించింది. తదుపరి విచారణను గురువారం చేపట్టనుంది. అయితే ఈ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు పదే పదే ఎందుకు కస్టడీ కోరుతున్నారని ప్రశ్నించింది. జీవితకాలం జైలులోనే ఉంచాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది.

10/23/2019 - 05:20

సారంగాపూర్, అక్టోబర్ 22: వేల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు.. లక్షల రూపాయల కార్లలో తిరుగుతున్నారు.. గరీబోన్ని సార్.. నన్ను విడిచిపెట్టండి అని ప్రాధేయపడ్డా వినకుండా లంచం ఇవ్వాల్సిందేనంటూ తెగేసి డిమాండ్ చేసిన అటవీ శాఖ అధికారులను ఒక సామాన్య యువకుడు ఏసీబీ అధికారులకు పట్టించాడు.

10/23/2019 - 05:07

నిజామాబాద్, అక్టోబర్ 22: మరో పది రోజుల్లో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో దొంగలు చొరబడి, పెద్ద మొత్తంలో సొత్తును అపహరించుకుపోయారు. యువతి పెళ్లి కోసం దాచి ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి నగలు, 15 వేల నగదుతో పాటు విలువైన పట్టు వస్త్రాలు, ఇతర సామగ్రితో ఉడాయించారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

10/23/2019 - 04:41

అమరావతి, అక్టోబర్ 22: రాష్ట్ర వ్యాప్తంగా దివాకర్ ట్రావెల్స్‌పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ ట్రావెల్స్ సంస్థ యజమానులు మోటారు వాహనాల చట్టాలు, ఇతర నిబంధనలను ఉల్లంఘించి బస్సులను నడుపుతున్నారని, రహదారి భద్రతను అతిక్రమించి ప్రభుత్వం, ప్రయాణికులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు రవాణాశాఖ కమిషనర్ సీతారామాంజనేయులు మంగళవారం మీడియాకు తెలిపారు.

10/23/2019 - 04:40

హైదరాబాద్, అక్టోబర్ 22: ఘరానా మోసగాడు శ్రీనివాసరావును హైదరాబాద్ నగర పోలీసులు అరెస్టు చేశారు. పత్రికల్లో అబద్ధపు ప్రకటనలతో ప్రజలను మోసం చేసి 150 మంది నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలోని తొండంగి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు ఎంటెక్ చదివాడు. అతనిపై దాదాపు 20 కేసులు నమోదయ్యాయి.

10/23/2019 - 04:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: సోషల్ మీడియాతో ఆధార్ అనుసంథానికి సంబంధించి వివిధ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ సుప్రీం కోర్టు మంగళవారం తనకు బదిలీ చేసుకుంది. అదేవిధంగా సామాజిక మాధ్యమం దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి సంబంధించి నివేదికను వచ్చే ఏడాది జనవరిలో అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

10/23/2019 - 01:14

హయత్‌నగర్, శామీర్‌పేట, అక్టోబర్ 22 : మరో 20రోజుల్లో ఆ ఇంట్లో పెళ్లి భాజా మోగాల్సి ఉంది. దైవ దర్శనం కోసం మంగళవారం ఉదయం తండ్రి, కుమారుడు ద్విచక్ర వాహనంపై కొమరవెళ్లికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. చంపాపేట్ డివిజన్ రెడ్డి బస్తిలో ప్రేమ్‌దాస్(60), కుమారుడు ముఖేష్(30) నివాసం ఉంటున్నారు.

10/23/2019 - 01:14

బేగంపేట, అక్టోబర్ 22: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇందిరమ్మనగర్ రసూల్‌పురాలో నివాసముంటే సయ్యద్ నజీర్(32) సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

10/23/2019 - 01:13

సైదాబాద్, అక్టోబర్ 22: ఫోన్ సౌకర్యం వినియెగించుకునే విషయంలో హెడ్‌వార్డర్‌తో వాగ్వివాదానికి దిగిన ఖైదీ అతనిపై దాడికి పాల్పడ్డాడు. డబీర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతనం కేసులో వరంగల్ జైలులో మూడు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న గోలి రాజేష్ అక్కడ అనుచిత ప్రవర్తన కారణంగా పనిష్‌మెంట్ కింద ఈ సంవత్సరం జనవరిలో చంచల్‌గూడ జైలుకు తరలించబడ్డాడు.

10/23/2019 - 04:14

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరానికి స్వల్ప ఊరట లభించింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్ మంజూరైంది. బెయిల్ దక్కినా ఆయన విడుదలయ్యే పరిస్థితి లేదు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ కేసులో చిదంబరం కస్టడీలో ఉన్నారు.

Pages