S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/28/2018 - 02:16

కౌటాల , ఏప్రిల్ 27: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (ట) మండలం లోడ్‌పల్లి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి పెళ్లి వ్యాన్ , ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న 15 మంది మహారాష్ట్ర వాసులు గాయాల పాలయ్యారు.

04/28/2018 - 02:13

తూప్రాన్, ఏప్రిల్ 27: జాతీయ రహదారి ప్రక్కన గల పశువుల దొడ్ల నుండి పశువులు దొంగతనానికి పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పి రాంగోపాల్‌రావు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరించారు.

04/28/2018 - 02:11

సంగారెడ్డి టౌన్, ఏప్రిల్ 27: ఉమ్మడి మెదక్ జిల్లా వీ6 స్ట్ఫా రిపోర్టర్ డి. ప్రసన్న శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిద్ధిపేట జిల్లా కొడకండ్ల గ్రామ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో ప్రసన్న మృతి చెందా డు. మే 6న తన తమ్ముడి వివాహం ఉండటంతో పెండ్లి పత్రికలు పంచేందుకు కారులో వెళ్తుండగా డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

04/28/2018 - 02:01

శాంతినగర్, ఏప్రిల్ 27: వడ్డేపల్లి మండల పరిధిలోని జక్కిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మహేందర్(22) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన నాగవేణి(19) అనే యువతిని ప్రేమించి పెళ్లిదాకా వచ్చి విఫలం కావడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్‌ఐ మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

04/28/2018 - 01:20

పిడుగురాళ్ల, ఏప్రిల్ 27: చోరీ జరిగిందని ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించిన సంఘటన శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... మిర్యాలగూడకు చెందిన మహాలక్ష్మి పిడుగురాళ్లలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వివాహ అనంతరం పట్టణంలోని తన తండ్రి ఇంటికి వెళ్లారు.

04/28/2018 - 01:19

అచ్చంపేట, ఏప్రిల్ 27: కోళ్లను దొంగిలించాడన్న కేసు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు శుక్రవారం కొండూరులోని తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన వివరాలను కుటుంబ సభ్యులు ఇలా వివరించారు... గ్రామానికి చెందిన పులి తిరుపతిరాజు, పులి వీరరాజు, గురవారావుకు చెందిన పది కోళ్లు అదృశ్యమైనట్లు 15 రోజుల క్రితం అచ్చంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు.

04/28/2018 - 00:39

సంగం, ఏప్రిల్ 27:హత్యాయత్నం కేసులో సంగం మండలానికి చెందిన ఇద్దరు వీఅర్వోలను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వేణు తెలిపిన వివరాల మేరకు ఉడ్‌హౌస్‌పేట గ్రామానికి చెందిన తిరుపతిరావు, సుష్మ ఇద్దరు దంపతులు. సుష్మ మండలంలోని తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. తరుణవాయి గ్రామానికి చెందిన వీఆర్వో రామక్రిష్ణారెడ్డికి సుష్మతో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతుంది.

04/28/2018 - 00:05

బొబ్బిలి, ఏప్రిల్ 27: పట్టణంలోని గ్రోత్‌సెంటర్‌లో ఉన్న అరోరా ఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమలో పనిచేస్తున్న జి శంకరరావు(28) పనిచేస్తు ప్రమాదశాత్తు పరిశ్రమ పై నుంచి కిందపడి మృతిచెందాడు. ఈమేరకు గురువారం రాత్రి అరోరా ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలో బాయిలర్ పైకి శంకరరావు ఎక్కాడు. అక్కడ వేడిని తట్టుకోలేక పై నుంచి పడి అక్కడే మృతిచెందాడు.

04/28/2018 - 00:04

తెర్లాం, ఏప్రిల్ 27: మండలం రాజయ్యపేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని తెర్లాం హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు.

04/28/2018 - 00:03

తెర్లాం, ఏప్రిల్ 27: మండలంలో రెండు గ్రామాల్లో ఒకేసారి దొంగతనాలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఏ ఎస్ ఐ అర్జునరావు అందించిన వివరాల ప్రకారం మండలం వెలగవలస, రంగప్పవలస గ్రామాల్లో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు.

Pages