S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/19/2019 - 00:49

గుంటూరు, అక్టోబర్ 18: రాష్ట్ర రవాణ శాఖకు గుంటూరులోని కోడెల శివరామ్‌కు చెందిన గౌతమ్ హీరో షోరూం కోటి రూపాయల జరిమానా శుక్రవారం చెల్లించింది. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా, తాత్కాలిక రిజిస్ట్రేషన్ లేకుండా దాదాపు 576 వాహనాలను షోరూం యాజమాన్యం గతంలో విక్రయించింది. ఈమేరకు అప్పట్లో ఫిర్యాదు అందడంతో రాష్ట్ర రవాణ శాఖ అధికారులు కేసు నమోదు చేసి షోరూం లైసెన్సును రద్దుచేశారు.

10/19/2019 - 00:36

నేరేడుచర్ల, అక్టోబర్ 18: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లెపల్లి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఇన్నోవా వాహనంలో తరలిస్తున్న రూ.11.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

10/19/2019 - 00:23

తిరుపతి, అక్టోబర్ 18: తిరుపతి నగరంలో నాడు అన్నమయ్య స్వామివారికి చేస్తున్న సేవకు మెచ్చి ఆయన కుటుంబ పోషణ కోసం విజయనగరం సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయులు ఇచ్చిన 188.32 ఎకరాల భూమిపై తమకు హక్కులు ఉన్నాయని హైకోర్టు న్యాయవాది, అన్నమయ్య 9వ తరానికి చెందిన తాళ్లపాక కుప్ప రాఘవన్ స్పష్టం చేశారు. ఆ భూములు తమవేనని పేర్కొన్నారు. టీటీడీ ఇనాం భూముల వ్యవహారంలో కోర్టును సైతం తప్పుదోవ పట్టించిందని అన్నారు.

10/19/2019 - 00:02

తిరుపతి, అక్టోబర్ 18: కల్కి భగవాన్ ఆశ్రమంలో గత మూడు రోజులుగా కల్కి ఆశ్రమాలతో పాటు దాని అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో భారీఎత్తున విదేశీ వస్తువులు, వజ్రాలు, కేజీలకొద్దీ బంగారం, ఇతర విలువైన కీలకపత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

10/19/2019 - 00:01

విజయవాడ, అక్టోబర్ 18: అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లకు చెల్లించేందుకు వీలుగా 264 కోట్ల రూపాయల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం పాలనా ఆమోదం తెలిపింది. 10వేల రూపాయలు, అంతకు తక్కువ మొత్తం డిపాజిట్ చేసినవారికి చెల్లించేందుకు వీలుగా ఈ నిధులు కేటాయించింది.

10/18/2019 - 23:41

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై హై కోర్టు మరోసారి తీవ్రంగా స్పందించింది. సంస్థ నాయకులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. శనివారం ఉదయం 10.30 గంటలకు చర్చలు ప్రారంభించాలని ఆదేశించింది. చర్చలను మూడు రోజుల్లో ముగించాలని, సారాంశం ఏమిటో తమకు తెలపాలని ఆదేశిస్తూ కేసును 28వ తేదీకి వాయిదా వేసింది.

10/18/2019 - 23:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆయన కుమారుడు కార్తీ, కొందరు ప్రభుత్వ అధికారులు సహా మొత్తం 14 మందిపై సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది.

10/18/2019 - 23:31

నడిగూడెం, అక్టోబర్ 18: పెళ్లి వేడుకలకు వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల గ్రామం శివారులోని నాగార్జున సాగర్ ఎడమకాలువలోకి శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో స్కార్పియో వాహనం దూసుకెళ్లి నీట మునగడంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు.

10/18/2019 - 23:20

కాకినాడ, అక్టోబర్ 18: తూర్పు గోదావరి జిల్లాలో మరో భారీ బాణసంచా ప్రమాదం సంభవించింది. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని జి వేమవరంలోని శివపార్వతి బాణసంచా తయారీ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం సంభవించిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగావుంది. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

10/18/2019 - 23:18

గుంటూరు, అక్టోబర్ 18: రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులను ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యుజే నేతలు డీజీపీ సవాంగ్‌ను కలిసి జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Pages