S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/01/2016 - 20:54

రాజకీయాల్లో ఉన్న నేను ప్రధాని మోదీగురించి ప్రజలకు అంతగా తెలీని విషయాలతో ఓ సినిమా తీయాలనుకు న్నా. ఈలోగా ‘టెర్రర్’ సినిమాకోసం పనిచేయాల్సి వచ్చింది’ అన్నారు ఆ చిత్ర నిర్మాత షేక్‌మస్తాన్. ‘సమాజానికి మనం ఏమి ఇచ్చాం అనేది ముఖ్యం కాదు. సమాజానికి మనం ఏం చేశాం అనేదే ముఖ్యం అని ఆలోచిస్తానని, ‘టెర్రర్’ చిత్రంతో అలా సంఘానికి ఉపయోగపడే విధంగా సందేశాన్ని అందించానని ఆయన అన్నారు.

03/01/2016 - 20:53

సినిమా అంతా గుంటూరులోనే జరుగుతుంది. ఓ రకంగా కలలా ఉంటుంది. ఓ అంశం ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్‌గాకూడా ఉంటుంది. ఇదంతా సినిమాటిక్‌గానే ప్రేక్షకుల్ని ఆహ్లాదపరుస్తుంది. అందుకే గుంటూర్ టాకీస్ అనే పేరును పెట్టాం అని సినిమా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.రాజ్‌కుమార్ రూపొందిస్తున్న ‘గుంటూర్ టాకీస్’ చిత్రంలో సిద్ధు కథానాయకుడిగా నటించారు.

02/28/2016 - 18:57

కిరణ్, సుమి, గిడ్డేష్, సమీర ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్. ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ అందిస్తున్న చిత్రం ‘వజ్రాలవేట’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. మాస్ అడ్వెంచరస్ హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహానంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలులలో చిత్రీకరణ చేశామని, నిర్మాత శ్రీనివాస్ తెలిపారు.

02/28/2016 - 18:54

పి.వి.పి. సినిమా పతాకంపై నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా వంశీ పైడిపల్లి దర్శక్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. దీనికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ, మ్యూజికల్ హిట్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాటా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

02/28/2016 - 18:51

‘ఈ చిత్రం భయపెట్టినట్టుగా భవిష్యత్‌లో మరే చిత్రమూ భయపెట్టలేదేమో, దీని తర్వాత మరో హారర్ సినిమా నేను చేయకపోవచ్చ’ని అంటోంది నయనతార. మయూరి చిత్రంతో హారర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె నటిస్తున్న ఓ హారర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

02/28/2016 - 18:50

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ దిశా పఠానీ. వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో సెటిలవ్వచ్చని కలలుగన్న ఈ భామకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. దాంతో ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ప్రయత్నాలు మాత్రం సాగిస్తూనే వుంది.

02/28/2016 - 18:48

జీవా, హన్సిక జంటగా రామ్‌ప్రకాష్ రాయప్ప దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రాన్ని తెలుగులోకి పోకిరిరాజా పేరుతో విడుదల చేస్తున్నారు. సాయిగీతా ఆర్ట్స్ పతాకంపై మలిరెడ్డి వీరవెంకటసత్యనారాయణ, వి.హనీప్రమోద్, శ్రీను నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు వివరాలు తెలిపారు. జీవా హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. ప్రముఖ నటుడు సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.

02/28/2016 - 18:47

ఆది, నమితాప్రమోద్ జంటగా వీరభద్రం దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీ హౌస్ బ్యానర్లపై రూపొందుతున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ మార్చి 1న రాజమండ్రిలో ప్రారంభం కానున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ,‘ఓ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్ మాస్టర్ సారధ్యంలో చిత్రీకరించాం. మార్చి 1నుండి 20వరకు రాజమండ్రిలో మరో షెడ్యూల్‌ను జరుపుతున్నాం’ అని తెలిపారు.

02/28/2016 - 18:45

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘తులసిదళం’. కిషోర్ కంఠమనేని సమర్పణలో కలర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నారు. నిశ్చల్, వందనాగుప్త జంటగా నటించిన ఈ చిత్రంలో ఆర్.పి.పట్నాయక్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ, ‘హారర్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. ప్రతి ప్రేమ కథలోనూ ఓ సమస్య ఉంటుంది.

02/28/2016 - 18:44

సంచలన దర్శకుడు శంకర్ తాజాగా రూపొందిస్తున్న రోబో2.0 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రజనీ సరసన అందాల భామ అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రోబో’కు సీక్వెల్‌గా రూపొందే ఈ సినిమాలో అమీజాక్సన్ కూడా రోబో పాత్రలో కనిపిస్తుందనే వార్తలు వచ్చాయి.

Pages