S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/14/2015 - 05:11

శ్రీ సాయి సినిమాస్ పతాకంపై సత్యనారాయణ సజ్జనపు దర్శకత్వంలో సాయి నాగుల్‌మీరా నిర్మిస్తున్న చిత్రం ‘అనుబంధం’ (శాటిలైట్‌తో). ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీశ్రీ శివరామచైతన్యం విచ్చేసి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యనారాయణ మాట్లాడుతూ నేటి యువతరంలోని అనుబంధాలను శాటిలైట్‌తో వాటి సంబంధాలను కొత్తదనంతో చూపించే వైవిధ్యభరిత చిత్రమే ఇదని తెలిపారు.

12/14/2015 - 05:09

మహేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పర్సరమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వరరావు రూపొందిస్తున్న ‘షీ’ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తిచేశారు.

12/12/2015 - 21:19

ఇద్దరు ముద్దుగుమ్మలమధ్య నిశ్శబ్ద యుద్ధం ఏ స్థాయికి వెళుతుందో ఈ చిన్న ఉదాహరణ చెబుతుంది. హీరోయిన్ల మధ్య పోటీ వుండడం పరిశ్రమలో సహజమే. కానీ, ఎదుటి హీరోయిన్ ఎలాంటి పాత్రలో నటిస్తే తాను కూడా అలాంటి పాత్రల్లోనే కన్పించాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా ప్రస్తుతం సమంత, శ్రుతిహాసన్ పోటీ పడుతున్నారు.

12/12/2015 - 21:18

ఇపుడు బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా ఆసియాలోనే అత్యంత శృంగార మహిళగా విజయం సాధించింది. లండన్ నగరానికి చెందిన ‘ఈస్ట్రన్ ఐ’ అనే మ్యాగజైన్ ఏటా నిర్వహించే ఈ పోటీలో మరోసారి ప్రియాంక సత్తా చాటింది. గత నాలుగేళ్ల పోటీలలో ప్రియాంక చోప్రా మూడుసార్లు విజేతగా నిలవడం, అందంలో ఆమెకి ఆమే సాటి అని నిరూపించినట్టయింది.

12/12/2015 - 21:15

రాశి అంటే అందరికీ ఇష్టమే. ముగ్ధమోహన రూపంతో కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళల్లో అందరినీ ఆకట్టుకునే నటనతో, అందంతో మంచి మార్కులను కొట్టేసింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో తన సత్తాను చూపింది. రాశి వుంటే చాలు సిన్మా హిట్ అన్న రేంజ్‌కి చేరింది. ఆ తరువాత అనుకోకుండా శరీరం సహకరించకపోవడంతో హీరోయిన్ల రేస్‌లోనుండి తప్పుకుంది. పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది.

12/12/2015 - 21:12

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్ ఫిలింస్ పతాకాలపై జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకర్‌రెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక చిత్రమ్’. డిసెంబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందంటోంది ఆ చిత్రయూనిట్. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.

12/12/2015 - 21:11

శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలింస్ పతాకంపై అన్నపూర్ట స్టూడియోస్ సమర్పణలో సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ టాకీపార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మించారు.

12/12/2015 - 20:56

అప్పుడెప్పుడో జంధ్యాల రూపొందించిన ‘అహనా పెళ్లంట’ చిత్రంలో అరగుండు పాత్రలో నటించిన బ్రహ్మానందం ఆ తరువాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. పాత్రల మీద పాత్రలు నటించుకుంటూ వెళ్లాడు. అందులో హాస్యముందా లేదా అని ప్రేక్షకులు కూడా చూడలేదు. ఆయన ఎలా నటించినా తెలుగు ప్రేక్షకులు నవ్వుల పువ్వులను వెదజల్లారు. అయితే, ఇపుడు సీన్ మారింది.

12/12/2015 - 20:51

శ్రీ ఓం డి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అజ్మీర్ చందు దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న..నేను..వర్ష’. ఆదర్శ్‌బాబు, పావని జంటగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

12/12/2015 - 20:50

‘చిరంజీవితో సినిమా తప్పక చేస్తా...అయితే 150వది కాకపోతే ఇంకోటి’ అని అంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. పూరి స్టైల్‌లో సినిమా అంటే ప్రేక్షకులకు కూడా ఆసక్తి. ఆయన లేటెస్టుగా రూపొందిస్తున్న చిత్రం లోఫర్. మెగా హీరో వరుణ్‌తేజ్, దిశా పటాని జంటగా ఇందులో నటించిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌లో పవన్‌కల్యాణ్ అభిమానుల వైఖరిని ఆయన తప్పుబట్టారు. అది పవన్‌కు చెడ్డపేరు తెస్తుందని హెచ్చరించారు.

Pages