S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/18/2016 - 22:43

రెండేళ్లుగా దుబాయ్‌లో నిర్వహిస్తున్న గల్ఫ్ ఆంధ్రా మ్యూజికల్ అవార్డ్స్ ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 12న భారీ స్థాయిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం కర్టెన్‌రైజర్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

01/18/2016 - 22:34

ప్రముఖ నటుడు నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యా త్రిపాఠీ ముఖ్యపాత్రల్లో కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతోంది.

01/18/2016 - 02:56

తెలుగుభామ అంజలి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదుంది. ఈ అచ్చతెలుగమ్మాయి సంక్రాంతి పండుగ జరుపుకోకుండా ఎలా వుంటుంది? అందుకే, పండగ రోజున ‘పెరంబు’ అనే తమిళ చిత్రం షూటింగ్‌లో వున్నా, అక్కడే ఆ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఆమె సంతోషంగా సంక్రాంతి జరుపుకుంది. తను స్వయంగా పొంగలి తయారుచేసి వాళ్లకి రుచి చూపించింది.

01/18/2016 - 02:54

సినిమా రంగంలో అయినా రాజకీయ రంగంలో అయినా తమ జీవిత కథలు పుస్తకాలుగా రావాలని కోరుకునేవారు ఉంటారు. కొందరైతే తన జీవిత కథను తానే రాసుకుంటారు కూడా. చిత్ర పరిశ్రమకి సంబంధించి కొంతమంది కథానాయకులు.. నాయికల జీవిత చరిత్రలు పుస్తక రూపంలో వచ్చాయి. మరికొంతమంది ఆత్మకథను రాసుకోవడానికి సంసిద్ధమవుతున్నారు. అలాంటి నాయికల జాబితాలో కంగనారనౌత్ కూడా చేరబోతోంది.

01/18/2016 - 02:51

రాజ్‌తరుణ్, అర్తన జంటగా శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి రూపొందించిన చిత్రం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది.

01/18/2016 - 01:14

జాతీయ నటుడు కమల్ తన డ్రీమ్ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించడంకోసం రంగంలోకి దిగుతున్నాడు. గతంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయిన ‘మరుదనాయగం’ సినిమాను తిరిగి పూర్తి చేయనున్నాడు. దాదాపు 18 సంవత్సరాల క్రితం కమల్ ‘మరుదనాయగం’ అనే చారిత్రక చిత్రానికి శ్రీకారం చుట్టాడు. కథ.. కథనాలు రెడీ చేసుకుని, తనే టైటిల్ రోల్‌ను పోషిస్తూ దర్శకత్వం వహించాడు.

01/18/2016 - 00:49

ధన్‌రాజ్, దీక్షాపంత్, వౌనిక ప్రధాన తారాగణంగా ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో శ్రీమతి కళ్యాణిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘బంతిపూల జానకి’. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ విడుదల చేశారు.

01/18/2016 - 00:45

సినిమా హిట్ అయిందంటే చాలు ఆ దర్శకుడికి వెల్లువలా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని అందుకుంటున్నాడు నూతన దర్శకుడు కల్యాణ్‌కృష్ణ. నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్నినాయన’తో దర్శకుడిగా పరిచయం అయిన ఇతగాడితో నాగార్జున మరో సినిమా చేయబోతున్నాడు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కథ..కథనంలో వైవిధ్యం... నాగార్జున గెటప్ కొత్తగా ఉన్నాయనే టాక్ వచ్చింది.

01/18/2016 - 00:42

అలనాటి బాలీవుడ్ నటుడు కబీర్‌బేడీ 70 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లికొడుకయ్యాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తున్న స్నేహితురాలు పర్వీన్ దుసాంజీని (42) ఆయన వివాహం చేసుకున్నారు. ఇది ఆయనకు నాలుగో వివాహం. ప్రఖ్యాత ఒడిస్సీ డాన్సర్ ప్రొతిమను మొదట ఆయన వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన పిల్లలే పూజ, సిద్దార్థ్. వీరు బాలీవుడ్‌లో రాణించారు.

01/18/2016 - 00:38

ముంబైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక మారథాన్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 50వేలమంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అందాలనటి కత్రినాకైఫ్, ఆమె ట్రెయినర్ యాస్మిన్ కరాచీవాల, ప్రముఖ నటులు ఆర్.మాధవన్, గుల్షన్‌గ్రోవర్, అబ్రహం సహా పలువురు హాజరయ్యారు. మంచి ఆరోగ్యం, చక్కటి ఫిట్‌నెస్ ఉండాలంటూ చైతన్యం కలిగించేందుకు ఏటా ఈ మారథాన్ నిర్వహిస్తారు.

Pages