S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/13/2016 - 03:30

తండ్రీ కొడుకులమధ్య వుండే సెంటిమెంట్‌తో
ఇప్పటివరకూ చాలా చిత్రాలు వచ్చాయి. కానీ వాటికి ఈ సినిమాకూ చాలా తేడా వుంటుంది. ముఖ్యంగా ఎమోషన్ విషయంలో ప్రేక్షకుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యే అంశమిది. తండ్రికోసం ఓ కొడుకు ఏం చేశాడు అనే అంశంగా సాగుతుంది. నిజానికి ఎన్టీఆర్‌కు ముందు వేరే కథ చెప్పాను. ఆ తరువాత మా నాన్న మృతి చెందడంతో బాగా ఎమోషన్‌గా ఫీలయ్యాను. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే ఇది.

01/13/2016 - 03:26

‘పనిపట్ల కమిట్‌మెంట్‌తో ఉంటాను. నా సంతోషం నాకు ముఖ్యం. నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు’ అంటోంది అందాల భామ సురభి. ‘బీరువా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ‘రఘువరన్ బి.టెక్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. శర్వానంద్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది సురభి. మేర్లపాక గాంధి దర్శకత్వంలో యు.వి.

01/13/2016 - 03:24

టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్‌కళ్యాణ్ ‘నాన్నకు ప్రేమతో’ నిర్మాత భోగవల్లి ప్రసాద్‌పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో కేసు వేయడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘అత్తారింటికి దారేది’ చిత్రం రూపొందింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఆ చిత్రం సంచలన విజయం సాధించి తెలుగులోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

01/13/2016 - 03:22

అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘సరైనోడు?’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారు. దాంతోపాటు పాటలను ఫిబ్రవరి 14న విడుదల చేసి మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

01/13/2016 - 03:18

తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు తెరలేపిన వెంకటేష్, ప్రస్తుతం సోలో హీరోగా వరుస సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆయన మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బాబు బంగారం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతోపాటు ఆయన మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు.

01/12/2016 - 02:46

తెలుగు, తమిళ భాషల్లో చాలా చిత్రాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా
సరైన సక్సెస్‌ని అందుకోలేకపోయింది గ్లామర్ భామ తాప్సి. అవకాశాలైతే జోరుగా అందుకుంటున్న ఈ భామకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. ఇప్పటికే బాలీవుడ్‌లో రెండు మూడు చిత్రాల్లో నటించిన తాప్సి తాజాగా

01/12/2016 - 02:43

‘మొదట బాలకృష్ణగారితో సినిమా అనగానే చాలా టెన్షన్ పడ్డాను. అంత పెద్ద స్టార్ హీరోతో పనిచేయడం అంటేనే చాలా టెన్షన్‌తో కూడుకున్న పని. కానీ, ఆయనతో పనిచేసినప్పుడు మాత్రం చాలా సపోర్టు అందించారు’ అని అంటోంది హీరోయిన్ అంజలి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘గీతాంజలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో నటించి ఆకట్టుకుంది.

01/12/2016 - 02:41

ప్రపంచ చలన చిత్రరంగంలో ఆస్కార్ తరువాత అంతటి కీర్తిప్రతిష్టలున్న పురస్కారం ‘గోల్డెన్‌గ్లోబ్’ అవార్డు. 2015గాను ఏకంగా మూడు అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన చిత్రంగా ‘ది రెవెనెంట్’ నిలిచింది. కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రబృందం ఆనందడోలికల్లో తేలిపోయింది.

01/12/2016 - 02:38

ఇటీవలే వచ్చిన ‘నేను..శైలజ’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కీర్తి సురేష్. తెలుగులో ఆమెకు ఇది మొదటి సినిమా. ఈ సినిమా తరువాత ఇపుడు కీర్తి సురేష్‌కు టాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మెగా హీరో సరసన ఆమె నటింబోతోందని తెలుస్తోంది.

01/12/2016 - 02:36

అజయ్ భరత్, అర్జున్, వెంకటేష్, సుస్మిత, బిందు, బార్బి ప్రధాన తారాగణంగా భరత్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై ఫిరోజ్ రాజా దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం రూపొందించిన చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

Pages