S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/09/2016 - 21:26

ఆర్.కె.నాయుడు హీరోగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దయానందరెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మలేసియా, హైదరాబాద్ ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈ వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

04/09/2016 - 21:22

సాయి ధరమ్‌తేజ్, లారిసా బోనేసి జంటగా సునీల్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర మూవీ మేకర్స్ పతాకంపై సి.రోహన్‌కుమార్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్ర విశేషాలు తెలపడానికి యూనిట్ విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు.

04/08/2016 - 21:29

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో హాలీవుడ్ అందాలతార ఐశ్వర్యారాయ్ తళుక్కున మెరిసింది. ప్రఖ్యాత వాచీల తయారీ సంస్థ ‘లాంజీన్స్’ శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె రెడ్‌కార్పెట్‌పై అందమైన దుస్తులతో క్యాట్‌వాక్ చేసి అభిమానులను అలరించింది. సిడ్నీలో పేరుగాంచిన రేసింగ్ కార్నివాల్‌కు ఆమె హాజరవనుంది. కాగా ఐష్‌ను చూసేందుకు పెద్దసంఖ్యలో అభిమానులు వచ్చారు. వారితో కలసి ఆమె సెల్ఫీలకు ఫోజిచ్చింది.

04/08/2016 - 21:25

శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథ ఆధారంగా తన తండ్రి ఎన్టీఆర్ ఓ సినిమా రూపొందిచాలనుకున్నారని, కానీ వీలుపడలేదని, ఇప్పుడు తన వందోచిత్రంగా ‘శాతకర్ణి’ రూపుదిద్దుకోనుందని ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

04/08/2016 - 21:22

మహేష్‌బాబు కథానాయకుడిగా పి.వి.పి. సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరం వి.పొట్లూరి రూపొందిస్తున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఉగాదికి సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, జనవరి 1న విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని, అదే రోజు విడుదలైన ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని తెలిపారు.

04/08/2016 - 21:17

గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ’. యువ జంటగా బాబ్త్రన్, బిందు బార్బి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఉగాది సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

04/08/2016 - 21:11

శ్రీ బుజ్జిమేక ఫిలింస్ పతాకంపై కోటి కిరణ్, ఆశ జంటగా పాండాల మహేష్‌కుమార్ గౌడ్ దర్శకత్వంలో పాండాల బుజ్జి రూపొందిస్తున్న చిత్రం ‘వేటాడే పులి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా రూపొందించామని తెలిపారు.

04/08/2016 - 21:09

యువ కథానాయకుడు నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో అభినయ్, మధుర శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఒక మనసు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని, ఓ అందమైన మనసు కథగా ఈ చిత్రం అద్భుతంగా రూపొందిందని అన్నారు. ఈనెల చివరివారంలో ఆడియో విడుదల చేసి మే మూడవ వారంలో

04/08/2016 - 21:08

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు అబ్బాస్ తెలుగు తెరపై హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకంపై నిర్మాత కె.సురేష్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/08/2016 - 21:06

అనేకమంది హీరో హీరోయిన్లు డేటింగ్ అంటే ముద్దని ప్రకటనలిస్తుంటే, త్రిష మాత్రం ఆ మాటని తన వద్ద ప్రస్తావించవద్దని కరాఖండీగా చెబుతోంది. తెలుగులో టాప్ హీరోల సరసన నటించిన త్రిష, ప్రస్తుతం స్లో అండ్ స్టడీగా కెరీర్‌ను సాగిస్తోంది. గత సంవత్సరం పెళ్లిపీటలవరకు వెళ్లిన ఆమె అక్కడే ఆగిపోయింది. పెళ్లి తప్పిపోవడంతో కెరీర్‌పై దృష్టిపెట్టి వరుసగా అవకాశాలు పొందుతోంది.

Pages