S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/07/2016 - 21:02

సూర్య కథానాయకుడిగా గ్లోబల్ సినిమాస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్, స్టూడియో గ్రీన్ పతాకాలపై విక్రంకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘24’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 11న నిర్వహించనున్నారు.

04/07/2016 - 20:59

యశశ్విని ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో మంగమూరి శేషగిరిరావు రూపొందిస్తున్న చిత్రం ‘దండు’. నీరజ్ శ్యామ్, నేహ సక్సేనా, సాయికుమార్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/07/2016 - 00:38

తెలుగు టెలివిజన్ రంగంలో వీడియో జాకిగా కెరీర్ మొదలుపెట్టి తక్కువ సమయంలోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న జయతి, హీరోయిన్‌గా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం ‘లచ్చి’. హారర్, థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు. షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా జయతి చెప్పిన విశేషాలు...

04/07/2016 - 00:35

ఛార్మి.. ఈ పేరు వింటేనే ఓ ఐదారేళ్ల క్రితం టాలీవుడ్ వెర్రెత్తిపోయేది. అందుకు తగ్గట్టు ఆమె సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చేవి. ప్రెట్టీగాళ్‌గా అందరి మన్ననలు అందుకున్న ఛార్మి ఆ తరువాత అవకాశాల రేసులో వెనుకబడిపోయింది. ఆమె చివరిగా నటించిన పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన జ్యోతిలక్ష్మి సరైన విజయం అందుకోకపోవడంతో అసలు సున్నాలాగా మారిపోయింది.

04/07/2016 - 00:34

‘మనకు బాగా ముఖ్యమైన వాళ్ళను బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయాలంటే ఇతను మా చుట్టాలబ్బాయ్ అని పరిచయం చేస్తాం. అలా చుట్టాల తరఫునుండి వచ్చిన ఓ కుర్రాడు ఆ కుటుంబంలో అనుబంధాలను ఎలాంటి అర్థాన్ని ఇచ్చి కుటుంబాన్ని ఒకటిగా కలిపాడు అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుంది’ అని దర్శకుడు వీరభద్రమ్ తెలిపారు.

04/07/2016 - 00:32

తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి కాజల్ పదేళుల దాటింది. అయినా ఇప్పటికీ తెలుగును మాట్లాడలేకపోతోంది. ఆమెకన్నా వెనుక వచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ కూడా డబ్బింగ్ చెప్పేస్తోంది. తమన్నా కూడా అదే దారిలో ఇటీవల ‘ఊపిరి’ సినిమాలో తన డబ్బింగ్ తాను చెప్పుకుంది.

04/07/2016 - 00:29

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు నాగార్జున. ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’ చిత్రాలు మంచి విజయం సాధించడంతోపాటు నాగార్జునకు మరింత ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. ‘ఊపిరి’ సినిమాలో నటనకుగాను ఆయనకు మంచి అప్లాజ్ దక్కింది. ఈ సినిమా తరువాత నాగార్జున చేసే భక్తి సినిమాకు అప్పుడే సన్నాహాలు జోరందుకున్నాయి.

04/07/2016 - 00:28

ప్రపంచవ్యాప్తంగా చిన్నా పెద్దా తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటున్న ‘జంగిల్ బుక్’ తాజా చిత్రంలో ఓ తెలుగు కుర్రాడు తన ప్రతిభ చూపాడు. హైదరాబాద్‌కు చెందిన పదేళ్ల సంకల్ప్ సినిమాలోని ప్రధాన పాత్ర మోగ్లీకి డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలిసారి ఎలాంటి అనుభవం లేకుండా తెలుగు భాషలో చక్కగా మాట్లాడుతూ, వినేవారికి అతని వాక్పటిమ, శబ్దసంపద, అతని సంభాషణల శైలి వినేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

04/07/2016 - 00:26

జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందిన కంగనారనౌత్ త్వరలొ కొత్త లుక్‌లో కన్పించనున్నారు. 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ‘రాణి లక్ష్మిభాయ్’ జీవితకథ ఆధారంగా నిర్మిస్తున్న చారిత్రక చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్రకోసం ఆమె ఇప్పటికే కత్తియుద్ధం, గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్న కేతన్ మెహతా స్వయంగా ఈ విషయం వెల్లడించారు.

04/05/2016 - 23:51

మహేష్‌బాబు కథానాయకుడిగా పివిపి సినిమా పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే 6న విడుదలకు సిద్ధమవుతోంది. సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ప్రధాన తారాగణంతో పతాక సన్నివేశాలను ఆర్‌ఎఫ్‌సిలో చిత్రీకరిస్తున్నారు.

Pages