S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/25/2016 - 21:36

సంజీవ్ జాదవ్, పవిత్ర, బ్రమిని ప్రధాన తారాగణంగా ఎస్.జె.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ దర్శకత్వంలో దీపక్, సోహైల్ జిలాని రూపొందిస్తున్న చిత్రం ‘జానూ నువ్వు ఎక్కడ’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

03/24/2016 - 22:38

ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమా కోసం జోరుగా సన్నాహాలు మొదలయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో సెట్స్‌పైకి తీసుకురావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందనుంది. ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా నయనతార నటిస్తుందంటూ వార్తలొస్తున్నాయి.

03/24/2016 - 22:36

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలోని ట్రైలర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ట్రైలర్‌ను తెలుగు సంవత్సరాది రోజున విడుదల చేస్తారని తెలిసింది. పివిపి బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు.

03/24/2016 - 22:32

పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ‘దండుపాళ్యం’ చిత్రం సంచలనం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రం గురువారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి కర్నాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ హెచ్.డి.గంగరాజు, ఎం.ఎన్.సురేష్‌లు పాల్గొన్నారు.

03/24/2016 - 22:30

ఆర్తీ అగర్వాల్ ప్రధాన పాత్రలో రమేష్ ముగడ దర్శకత్వంలో శ్రీ బాలగణపతి ప్రొడక్షన్స్, శ్రీ సాయిదుర్గ చిత్రాలయ పతాకంపై వీర గణేష్ కర్రి, లక్ష్మీ సరోజ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఆమె ఎవరు?’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. సీనియర్ జర్నలిస్టు పసుపులేటి రామారావు సీడీని ఆవిష్కరించారు.

03/24/2016 - 22:26

ధనుంజయ్, పరుల్ యాదవ్ జంటగా పవన్ వడయార్ దర్శకత్వంలో వైవిధ్యభరిత ప్రేమకథతో రూపొందుతున్న చిత్రం ‘జెస్సీ’. ఆర్.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై గతంలో సుబ్బు, మహానంది వంటి చిత్రాలను నిర్మించిన ఆర్.శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలో విడుదల కానున్నాయి.

03/24/2016 - 22:24

ప్రముఖ నటుడు చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం ఈనెల 28న జరుగుతున్న సందర్భంగా పెళ్లికూతురిని చేయడంతో పెళ్లిసందడి మొదలైంది. ఈ సందర్భంగా తన ముద్దుల చెల్లితో సెల్ఫీ తీసి సోషల్ మీడియాలో పెట్టాడు హీరో వరుణ్‌తేజ్. బ్యూటిఫుల్ బ్రైడ్ సిస్టర్ వెడ్డింగ్, లెట్ ద సెలెబ్రేషన్స్ బిగిన్ అంటూ కామెంట్ పెట్టాడు.

03/24/2016 - 22:22

బొద్దుగుమ్మ నమిత ఈమధ్య ఏ కార్యక్రమంలోనూ, ఏ సినిమాలోనూ కనిపించడంలేదు. ప్రస్తుతానికి ఆమెకు చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా వున్న ఈ హాట్ భామ బాగా స్లిమ్‌గా మారి షాక్ ఇచ్చింది. భారీ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టే నమిత ఇంత స్లిమ్‌గా మారడానికి కారణం ఓ సినిమా కోసమేనట.

03/24/2016 - 22:20

మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం కోసం సినీ తారలు రకరకాల పనుల్లో కనపడి మరింత క్రేజ్‌ను స్వంతం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంకోసం ఇప్పటికే రకుల్‌ప్రీత్‌సింగ్ రైతుబజార్‌లో కూరగాయలు అమ్మగా, రానా కూలీగా పనిచేశాడు. అఖిల్ ఆటో డ్రైవర్‌గా కనిపిస్తే, శ్రీయ సూపర్ మార్కెట్‌లో సేల్స్‌గర్ల్ అవతారం ఎత్తింది. ఇప్పుడు తాజాగా మోహన్‌బాబు ఇడ్లీలు అమ్మే వ్యక్తిగా మారాడు.

03/23/2016 - 22:29

ప్రముఖ నటుడు రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో 2.0 చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లమధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ఫినిష్ చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు శంకర్.

Pages