S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/04/2016 - 21:47

తెలుగు ప్రజల గుండెల్లో నిత్యం తన పాట ద్వారా పలకరించే సినీ నేపథ్య గాయని పి.సుశీల హైదరాబాద్‌లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఐదురోజులపాటు ప్రపంచ శాంతికై ముఖ్యమంత్రి అయుత చండీ మహాయాగాన్ని విజయవంతంగా పూర్తిచేసినందుకు అభినందించారు. ప్రజలకోసం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె సిఎంను కోరారు.

01/04/2016 - 21:46

దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన ‘బాహుబలి’ సినిమాకు సీక్వెల్ ‘బాహుబలి-2’

01/04/2016 - 21:45

శర్వానంద్, సురభి జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వంశీ ప్రమోద్ రూపొందించిన చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

01/04/2016 - 21:44

శే్వతామీనన్, మహత్ రాఘవేంద్ర, చేతన ఉత్తేజ్, సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రల్లో పర్సా రమేష్ మహేంద్ర దర్శకత్వంలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై కల్వకుంట్ల తేజేశ్వరరావు నిర్మిస్తున్న ‘షి’ చిత్రం హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సోమవారం లొకేషన్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత తేజేశ్వరరావు మాట్లాడుతూ- అన్నిరకాల కమర్షియల్ అంశాలుండే సినిమా ఇది.

01/04/2016 - 21:42

హనీ, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో ఎ.వి.ఆర్. నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘వేటపాలెం’. ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో బేబి శ్లోక విడుదల చేశారు.

01/04/2016 - 21:30

నాగశౌర్య, పలక్ లల్వాని జంటగా రమేష్ వర్మ దర్శకత్వంలో జె.జె. సినిమాస్, కిరణ్ స్టూడియోస్ పతాకంపై శ్రీనివాస్, వందనా అలేఖ్య నిర్మించిన అబ్బాయితో అమ్మాయి చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సక్సెస్‌మీట్‌లో దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ- జనవరి 1న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్లతో నడుస్తోంది.

01/04/2016 - 21:28

రామ్, కీర్తి సురేష్ జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మించిన ‘నేను శైలజ’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో హీరో రామ్ మాట్లాడుతూ- దేవదాసు సినిమా తప్పించి మిగతా నా సినిమాల్లో అన్ని కామెడీకి పెద్దపీట వేసిన సినిమాలే. సాఫ్ట్ కేరెక్టర్‌తో చేసిన గణేష్ మంచి విజయాన్ని అందుకోలేదు.

01/04/2016 - 21:27

నివాస్ క్రియేషన్స్ పతాకంపై అనురాగ్, తనూజ, మనోజ్, మోహన్ ప్రధాన తారాగణంగా రవి వీడే దర్శకత్వంలో జి.నివాస్ రూపొందించిన చిత్రం ‘సంజీవని’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజ్‌కందుకూరి మాట్లాడుతూ హాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రం అందరికీ నచ్చేలా రూపొందిందన్నారు.

01/04/2016 - 21:23

సంజయ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య హీరో హీరోయిన్లుగా శశిభూషణ్ దర్శకత్వంలో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్.రామారావు క్లాప్‌నివ్వగా, తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు శశిభూషణ్ మాట్లాడుతూ- ప్రేమ అనేది యూనివర్సల్.

01/03/2016 - 21:53

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న గబ్బర్‌సింగ్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నేటినుండి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దాదాపు చాలా భాగం షూట్ చేశారు. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్‌గా 25 రోజులు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్ ముగిసేసరికి దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తికానుంది.

Pages