S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/01/2016 - 21:28

సౌత్ క్రేజీ గ్లామర్ సుందరి నయనతార ప్రస్తుతం సెలెక్టివ్‌గానే సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. వరుస విజయాలు అందుకుంటున్న నయనతార మరోసారి భయపెట్టే సినిమాల్లో నటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా హారర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె, మరో చిత్రంలో నటించడంలో విశేషమేముంది అనుకుంటే పొరపాటు. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హారర్‌తో నిండి వుంటుందట. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయి.

01/01/2016 - 21:26

మహేష్‌బాబు కథానాయకుడిగా పి.వి.పి పతాకంపై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ‘బ్రహ్మోత్సవం’ టీజర్‌ను శుక్రవారం మహేష్‌బాబు తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేశారు.

01/01/2016 - 21:23

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ఓ మంచి హిట్‌తో ముందుకు రావాలని పట్టుదలతో ఉన్నారు. పలు కథలు వింటున్న ఆయన, ఓ బాలీవుడ్ రీమేక్ సినిమాను తెలుగులో చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య బాలీవుడ్‌లో వచ్చిన ‘ఏ దివాని హై జవాని’ చిత్రాన్ని రీమేక్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

01/01/2016 - 21:22

విజయ్‌చందర్ సాయిబాబాగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాయే దైవం’. శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలింస్, జి.ఎల్.బి. మూవీ మేకర్స్ పతాకాలపై జి.ఎల్.బి.శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ఈవారంలో ప్రారంభం కానుంది.

01/01/2016 - 21:19

దక్షిణాదిన అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ఇసైజ్ఞాని, మేస్ట్రో ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘నిషాగాంధి’ పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. వేలాది పాటలకు బాణీలు కట్టి, వందల సంఖ్యలో చిత్రాలకు నేపథ్య సంగీతాన్ని అందించి, లక్షలాదిమంది మనసు రంజింపచేసిన ఆయనకు ఈ అవార్డు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

01/01/2016 - 21:17

నిషాంత్ దర్శకత్వంలో సూరి, రూపారెడ్డి ప్రధాన తారాగణంగా పుధారి అరుణ రూపొందిస్తున్న చిత్రం ‘బొమ్మల రామారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి సెన్సార్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం ఉదయం నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, రాజ్ కందుకూరి పోస్టర్‌ని విడుదల చేశారు.

12/30/2015 - 21:26

యువ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. సురభి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధి దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 14న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను నిర్మాతలు వివరించారు.

12/30/2015 - 21:24

ఈ ఏడాది మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ సంచలన విజయం సాధించడంతో ప్రస్తుతం తను నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమా తరువాత మహేష్ నటించే మరో చిత్రానికి అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయట.

12/30/2015 - 21:20

ఈమధ్య తెలుగులో వరుస సినిమాలతోపాటు వరుస విజయాలు అందుకుంటూ
దూసుకుపోతోంది గ్లామర్ భామ రెజీనా. ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న

12/30/2015 - 21:19

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో..’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఒక్క పాట మినహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించే చిత్రానికి స్క్రిప్ట్ వర్క్ జోరుగా జరుపుకుంటోంది.

Pages