S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/30/2015 - 21:15

మధువర్మ, అంజలి హీరో హీరోయిన్‌గా కె.వెంకటేష్ దర్శకత్వంలో లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై మైల వీర్రాజు, తిరుమాని రాధాకృష్ణ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.2 చిత్రం జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ, ఇది తన రెండవ సినిమా అని, ఇదివరకే ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబూ అనే’ చిత్రాన్ని రూపొందించానని అన్నారు.

12/30/2015 - 21:13

శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై నూతన తారలు రాజేష్‌కుమార్, పావని, బొడ్డు వెంకి, లావణ్య, భరత్, నిషా ప్రధాన తారాగణంగా ఆనంద సుమన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ఆరుద్ర అనే పేరును ఖరారు చేశారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జనవరి మొదటివారంలో ప్రారంభం కానుంది.

12/30/2015 - 21:11

తెలుగు సినిమా అంటే ఎప్పుడూ ఫక్తు కమర్షియల్ ఫార్మెట్‌లో సినిమాలు చేస్తారు. కొత్తదనం జాడ కనిపించదనే అపవాదు ఉంది. అయితే ఇప్పుడు ఆ అపవాదును దూరం చేసే ప్రయత్నాలు ఈ ఏడాదిలో బాగా జరిగాయి. తెలుగు సినిమాలో ప్రయోగాలే కాదు కమర్షియల్ ఫార్ములాలో సంచలన చిత్రాలు తీయగలరంటూ నిరూపించారు. మొత్తానికి గడచిన ఈ ఏడాది తెలుగు సినిమా చరిత్రలో కాస్త కీలకమైన ఏడాదిగా పరిగణించాలి.

12/30/2015 - 04:37

వీడ్కోలు - 2015

12/30/2015 - 07:45

అమ్మాయి అబ్బాయి ప్రేమలో పడడానికి ఒక కారణం అంటూ వుండాలా? అసలేం అవసరం లేదు. ఒక్క తెలుగు సినిమా చూస్తే చాలు. ఇటువంటి నిర్ణయానికి వచ్చేస్తాం. ప్రేమకథా చిత్రాలు అపూర్వమైన విజయాలు పొంది, బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మాస్టర్ పీసెస్ అనేకం తెలుగులో ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకులు ప్రేమించిన చిత్రాలు. ఆయా కథలలో ఓ కొత్తదనం, అనుభూతి, ప్రేమికుల నిస్వార్థత ఉంటాయి. అందుకే ఆ చిత్రాలు అజరామరంగా నిలిచాయి.

12/29/2015 - 23:59

తెలుగు పరిశ్రమలో ఆకస్మిక మరణాలు ఎక్కువౌతున్నాయి. ఇటీవలికాలంలో వరుసగా సినీనటుల మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు రంగనాధ్ మృతి సంఘటనను మరువకుండానే మరో నటుడు ఆకస్మికంగా మృతి చెందాడు. ‘ఈశ్వర్’ సినిమాతో కమెడియన్‌గా తెలుగు తెరకు పరిచయమైన పొట్టి రాంబాబు, ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

12/29/2015 - 23:59

విజయ్, దీక్షాపంత్ జంటగా త్రిపురనేని విజయ్‌చౌదరి దర్శకత్వంలో అంజని మూవీస్ పతాకంపై పువ్వల శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘కవ్వింత’ అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని జనవరి 8న విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, ఫేక్ కరెన్సీ నేపథ్యంలో ఓ అందమైన విలేజ్‌లో జరిగే ప్రేమకథే ఈ సినిమా అని, ఫొటోగ్రఫి, మ్యూజిక్ ఇందులో హైలెట్‌గా నిలుస్తాయని, ఇప్

12/29/2015 - 23:58

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘అ..ఆ’ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జోరుగా జరుపుకుంటోంది. యువ హీరో నితిన్, క్రేజీ భామ సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ రూపొందించే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

12/29/2015 - 23:57

ఈమధ్య బాలీవుడ్ అందాల భామల క్రేజీ హాలీవుడ్‌లో ఎక్కువైంది? ఇప్పటికే పలువురు నటీమణులు హాలీవుడ్‌లో నటించి తమ సత్తాను ప్రూవ్ చేసుకుంటున్నారు. తాజాగా అందాల భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. లేటెస్టుగా మరో గ్లామర్ భామ హాలీవుడ్‌కి చెక్కేయనుంది. ఆమె ఎవరో కాదు నీతూచంద్ర. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ, తెలుగులో కూడా రెండు మూడు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.

12/29/2015 - 23:56

గత కొన్ని రోజులుగా ప్రముఖ నటుడు చిరంజీవి 150వ చిత్రం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు గుడ్‌న్యూస్ అందే సమయం దగ్గరలో వుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ రూపొందే 150వ సినిమాకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

Pages