S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/28/2015 - 21:08

రైజింగ్ సన్ ఫిలిమ్స్ పతాకంపై మానస్, హాషికాదత్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న చిత్రం ‘బేబీ డాల్.’ తాజ్‌మొహమ్మద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కథానాయిక హాషికాదత్ దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.

12/28/2015 - 21:06

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్‌లో కాకుండా టైటిల్‌నుండి ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని ప్రదర్శించామని అంటున్నాడు యువ హీరో రామ్. ఎనర్జిటిక్ హీరోగా తెలుగు తెరపై తనదైన ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు రామ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను.. శైలజ’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతున్న సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ...

12/28/2015 - 21:04

‘నా 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’లో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మా నాన్నకు ఈ చిత్రాన్ని నీరాజనంగా ఇస్తున్నా. నేను ఇన్ని సినిమాలు చేయడానికి కారణమైన దేవుళ్లు తాత, నాన్న. వారు మమ్మల్ని నిరంతరం పోరాడమని చెప్పారు. నాన్నకుప్రేమతో చిత్రానికి సంబంధించిన కథ పుట్టిందే దర్శకుడు సుకుమార్ తండ్రివల్ల. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కనపడడు.

12/28/2015 - 21:01

మధుమిత, శివ, వరుణ్ ముఖ్యపాత్రల్లో నరసింహనంది దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై బూచేపల్లి తిరుపతిరెడ్డి నిర్మిస్తున్న ‘లజ్జ’ చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రసన్నకుమార్ లోగోను ఆవిష్కరించారు.

12/28/2015 - 20:59

అజయ్, భరత్, అర్జున్, వెంకటేశ్, సుస్మిత ప్రధాన పాత్రల్లో భరత్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఫిరోజ్‌రాజ్ దర్శకత్వంలో భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న ‘రాజుగారింట్లో ఏడవ రోజు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఈమధ్యలో హారర్ సినిమాల జోరు ఎక్కువైందని, ముఖ్యంగా ఈ తరహా చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆద

12/27/2015 - 21:51

వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై నూతన నటీనటులతో విశాఖ థ్రిల్లర్ వెంకట్ దర్శకత్వంలో తేజ నిర్మిస్తోన్న మెసేజ్ ఓరియంటెడ్ ప్రేమకథా చిత్రం ‘వీలైతే ప్రేమిద్దాం’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జనవరి 8న విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు వెంకట్ మాట్లాడుతూ.. ‘ఇది నాలుగు జంటల మధ్య నడిచే ప్రేమకథ.

12/27/2015 - 21:48

అమెరికాలో స్థిరపడిన చైతు శాంతారామ్, శ్యాహేలరాణి జంటగా గణేష్ క్రియేషన్స్ పతాకంపై వంశీమునిగంటి దర్శకత్వంలో లండన్ గణేష్ రూపొందించిన చిత్రం ‘పడమటి సంధ్యారాగం’ (లండన్‌లో). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌సీడీని, ఆడియో సీడీని విడుదల చేశారు. దాసరి నారాయణరావు వీడియో ద్వారా సందేశం అందించారు.

12/27/2015 - 21:46

రషీద్ బాషా దర్శకత్వంలో తస్లీమ్, దివిజ, శ్రేష్ఠ, చరణ్, హర్ష, సోని, నిఖిత ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. ఇబ్రహీం షేక్, ఖాజాబీ షేక్, నజీమ్‌షేక్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు తొలి సీడీని విడుదల చేశారు.

12/27/2015 - 21:44

చాందిని ప్రధాన పాత్రలో భానుప్రకాష్ బులుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ రూపొందించిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. మనోజ్‌నందం, అనిల్‌కళ్యాణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు భానుప్రకాష్ మాట్లాడుతూ..

12/27/2015 - 21:42

తెలుగు, తమిళ చిత్రసీమలో మల్టిస్టారర్ సినిమాలకు మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. ఒకే భాషకు చెందిన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడమే కాకుండా ఇరు ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నాగార్జున-కార్తీ కలిసి ‘ఊపిరి’ సినిమా చేస్తున్నారు.

Pages