S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/27/2015 - 21:48

అమెరికాలో స్థిరపడిన చైతు శాంతారామ్, శ్యాహేలరాణి జంటగా గణేష్ క్రియేషన్స్ పతాకంపై వంశీమునిగంటి దర్శకత్వంలో లండన్ గణేష్ రూపొందించిన చిత్రం ‘పడమటి సంధ్యారాగం’ (లండన్‌లో). ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన తమ్మారెడ్డి భరద్వాజ బిగ్‌సీడీని, ఆడియో సీడీని విడుదల చేశారు. దాసరి నారాయణరావు వీడియో ద్వారా సందేశం అందించారు.

12/27/2015 - 21:46

రషీద్ బాషా దర్శకత్వంలో తస్లీమ్, దివిజ, శ్రేష్ఠ, చరణ్, హర్ష, సోని, నిఖిత ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. ఇబ్రహీం షేక్, ఖాజాబీ షేక్, నజీమ్‌షేక్ సంయుక్తంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకుడు రేలంగి నరసింహారావు తొలి సీడీని విడుదల చేశారు.

12/27/2015 - 21:44

చాందిని ప్రధాన పాత్రలో భానుప్రకాష్ బులుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ రూపొందించిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. మనోజ్‌నందం, అనిల్‌కళ్యాణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు భానుప్రకాష్ మాట్లాడుతూ..

12/27/2015 - 21:42

తెలుగు, తమిళ చిత్రసీమలో మల్టిస్టారర్ సినిమాలకు మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. ఒకే భాషకు చెందిన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడమే కాకుండా ఇరు ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలు కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే నాగార్జున-కార్తీ కలిసి ‘ఊపిరి’ సినిమా చేస్తున్నారు.

12/27/2015 - 21:41

టాలీవుడ్‌లో దర్శకుడు సుకుమార్ అంటే ఓ ప్రత్యేక క్రేజ్. మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో తెలుగులో టాప్ డైరెక్టర్‌లలో ఒకరుగా పేరుతెచ్చుకున్న సుకుమార్ నిర్మాతగా వినూత్న సినిమాలను తెరకెక్కించే పనిని కూడా చేపట్టిన విషయం తెలిసిందే. ఆ కోవలోనే సుకుమార్ రైటింగ్స్ అన్న బ్యానర్‌ను స్థాపించి మొదటి సినిమాగా ‘కుమారి 21ఎఫ్’ను రూపొందించారు.

12/27/2015 - 21:40

విభిన్న కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆయన, సుధీర్‌బాబు కథానాయకుడుగా ‘్భలేమంచి రోజు’ క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తోందని, సినిమాకు ఆదరణ బాగుందని దర్శకుడు తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన విశేషాలు..

12/27/2015 - 21:38

వర్మ... ఈ పేరు ఓ పక్క క్రియేటివిటికి, మరోపక్క సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పుడు వర్మ అంటేనే సంచలనం. ఎప్పుడూ ఏదో ఓ వివాదంతో ఆయన వార్తల్లోకి వస్తూంటాడు. ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’కూడా అంతే సంచలనం సృష్టించనుంది. వీరప్పన్‌ను చంపడం ఎలా? అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ జనవరి 1న విడుదల కానుంది. శివరాజ్‌కుమార్, పరుల్‌యాదవ్, యజ్ఞశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు.

12/26/2015 - 22:39

దీపక్‌సరోజ్, మాళవికామీనన్ జంటగా కందిమళ్ల మూవీ మేకర్స్ పతాకంపై కోటపాటి శ్రీను దర్శకత్వంలో వెంకట చంద్రశేఖర్ రూపొందిస్తున్న చిత్రం ‘వందనం’ (సేవ్ లవ్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ కథే హీరోగా ఈ చిత్రాన్ని రూపొందించామని, మంచి సంగీతంతోపాటుగా ప్రేమ కథకు అవసరమైన రీతిలో పాటలు కుదిరాయని తెలిపారు.

12/26/2015 - 22:37

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రల్లో పి.వి.పి పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది.

12/26/2015 - 22:35

తెలుగు సినిమాల్లో నటించడానికి సవాలక్ష అభ్యంతరాలు తెలిపే కాజల్ బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఒక్క చిన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేయదట. ఇక్కడ చిన్న హీరోలతో నటించమంటే లేదు అనే ఆమె, బాలీవుడ్‌కి వెళ్లేసరికి ఓకే అనేస్తోంది. తాజాగా నూతన నటుడు రణదీప్‌హుడాతో ‘దోలబ్జోంగికహాని’లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా నటించేసిందట! అభ్యంతరాలంటే ఇక్కడ లిప్‌లాక్‌లు, ఫ్రెంచ్‌కిస్‌లు అన్నమాట.

Pages