S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/26/2015 - 22:32

శర్వానంద్, సురభి జంటగా యువి క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్స్‌ప్రెస్ రాజా’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

12/26/2015 - 22:29

మురళీకృష్ణ, భానుశ్రీ, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా లాస్ ఏంజిల్స్ టాకీస్, సంధ్యా సినీ స్టూడియోస్ సంయుక్తంగా కిషన్‌సాగర్ ఎస్. దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘వౌనం’ (వాయిస్ ఆఫ్ సైలెన్స్). అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యారవి రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టాకీపార్టు పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/26/2015 - 22:26

‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఈ జనరేషన్ ప్రేమకథలా వుంటుంది. ప్రేమకథలు చెప్పడంవల్ల ఇప్పటి తరం వారంతా తమను తాము ఆయా పాత్రల్లో చూసుకొని, కనెక్ట్ అవుతారు అని చెబుతున్నాడు యువ హీరో నాగశౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’,‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’.

12/26/2015 - 22:23

తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలను గడగడ లాడించిన గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌పై రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన బాలీవుడ్ స్టార్ అమితాబ్‌బచ్చన్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నమ్మశక్యం కాని విధంగా వుందని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

12/26/2015 - 22:21

అనేక చిత్రాల అనంతరం ‘లోఫర్’ చిత్రంలో మదర్ సెంటిమెంట్‌తో చేసిన కథంతా ప్రేక్షకులకు నచ్చిందని, ఏ ఊరికి వెళ్లినా ఆ ఊరి థియేటర్‌లో ఈ సెంటిమెంట్ పండి, ప్రేక్షకుల స్పందన అద్భుతంగా వచ్చిందని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. శ్రీ శుభశే్వత ఫిలిమ్స్ పతాకంపై వరుణ్‌తేజ్ కథానాయకుడుగా సి.కళ్యాణ్ రూపొందించిన ‘లోఫర్’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయ యాత్రలు నిర్వహించారు.

12/26/2015 - 22:20

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి ప్రధాన తారాగణంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందించిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించారు. సినిమా పాటల సీడీలను దర్శకుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేసి తొలి కాపీని నాగార్జునకు అందించారు.

12/25/2015 - 22:53

మిల్క్‌మూవీస్, మినర్వాటాకీస్ పతాకాలపై విజయ్‌శేఖర్ సంక్రాంతి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 7టు4. ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్‌బాల, పి.బి.శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు ముఖ్యపాత్రలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన

12/25/2015 - 22:51

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి పతాకంపై ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్‌లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి, జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ వచ్చేనెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించని పాటలను ఈనెల 27న విడుదల చేయనున్నామని తెలిపారు.

12/25/2015 - 22:49

మయూఖ క్రియేషన్స్ పతాకంపై జగదీష్ తలశిల దర్శకత్వంలో సాయిప్రసాద్ కామినేని రూపొందించిన చిత్రం ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’. నవీన్‌చంద్ర, లావణ్యత్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రం నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదలకు సిద్ధమైంది.

12/25/2015 - 22:46

తనీష్, మేఘశ్రీ, పావని ప్రధాన తారాగణంగా శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వి.శ్రీవాత్సవ్ దర్శకత్వంలో వేణు ముక్కపాటి రూపొందించిన చిత్రం ‘ఓ మైగాడ్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 8న విడుదలకు సిద్ధమైంది.

Pages