S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/22/2015 - 21:56

ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాధ్ ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళుతుండగా, ఖమ్మం సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం యన మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారని తెలిసింది. దాదాపు 60 సినిమాలకుపైగా రచయితగా పనిచేశారాయన.

12/22/2015 - 21:33

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల వ్యాప్తి చేసి కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించిన దర్శకుడు ధీరుడు రాజవౌళి ప్రస్తుతం ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘బాహుబలి’ని మించిన విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు రాజవౌళి. ప్రస్తుతం మరో సినిమా చర్చలోకి వచ్చింది.

12/22/2015 - 21:29

ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్ ముఖ్యపాత్రల్లో మిల్క్ మూవీస్, మినర్వా టాకీస్ పతాకాలపై విజయశేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘7 టు 4’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

12/22/2015 - 08:02

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ హీరోయిన్ల ఎంట్రీ ఎప్పటినుండో నడుస్తున్న అంశమే. తెలుగు చిత్రాల్లో నటించేందుకు వారికి అమిత ఆసక్తి వుండడం చూస్తున్నదే. తాజాగా మరో బాలీవుడ్ భామ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఆమె ఎవరో కాదు ముంబాయి మోడల్ కామ్న. ఈ భామ హీరోయిన్‌గా నటించేది అల్లరి నరేష్ సరసన. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం ఈనెల 25న విడుదలవుతోంది.

12/22/2015 - 08:01

* దర్శకుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి

12/22/2015 - 08:01

* నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వంలో ఏరోస్ ఇంటర్నేషనల్, వేదస్వా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న డిక్టేటర్ చిత్రంలోని పాటలు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో విడుదలయ్యాయి.

12/22/2015 - 08:00

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం షూటింగ్ స్పెయిన్‌లో పూర్తిచేసుకుంది. మిగతా షూటింగ్‌ని హైదరాబాద్‌లో జరపనున్నారు. భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

12/22/2015 - 07:59

నేహ, రజత్‌కృష్ణన్, అరహాన్, రాజీవ్‌కనకాల ప్రధాన పాత్రల్లో ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘వల్లి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

12/22/2015 - 07:58

* నాగార్జున

12/22/2015 - 07:58

తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాల్లో నటిస్తూ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుంది గ్లామర్ భామ కాజల్. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ఇపుడు తమిళ పరిశ్రమపై దృష్టి సారించింది. కోలీవుడ్‌లో కూడా టాప్ హీరోయిన్‌గా వెలగాలనే ప్రయత్నాల్లో వుంది.

Pages