S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/18/2015 - 21:45

ఈమధ్య టాలీవుడ్‌లో యంగ్ హీరోలు బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్న యువ హీరో ఆది దంపతులకు ఆడపిల్ల జన్మించింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ అందరి ఆశీస్సులు కావాలని కోరాడు. ‘ప్రేమకావాలి’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన ఆది పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ‘గరమ్’ చిత్రంలో నటిస్తున్నాడు.

12/18/2015 - 21:40

త్రినాథ్ పంపన, మనోజ్‌కృష్ణ, హర్ష, జర్సీ, పూజశ్రీ ముఖ్యపాత్రల్లో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై దగ్గుబాటు వరుణ్ నిర్మిస్తున్న చిత్రం ‘ముసుగు’. ఇటీవలే చివరి షెడ్యూల్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాత దగ్గుబాటి వరుణ్ వివరాలు తెలియజేస్తూ మా బ్యానర్‌లో వస్తున్న మొదటి చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నాం.

12/18/2015 - 21:37

శశి, చేతన్ ప్రధాన పాత్రధారులుగా నవీన్ సత్య దర్శకత్వంలో శ్రీ వైష్ణవి క్రియేషన్స్ పతాకంపై అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగసుశీల క్లాప్‌నివ్వగా నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం దర్శకుడు నవీన్ సత్య మాట్లాడుతూ, ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథ. రోడ్డు జర్నీ నేపథ్యంగా సాగుతుంది.

12/18/2015 - 21:33

మహానటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు పేరుపై వివిధ రంగాల్లోని ప్రముఖులకు అంతర్జాతీయ పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు అక్కినేని ఫౌండేషన్ అధ్యక్షులు తోటకూర ప్రసాద్.

12/16/2015 - 22:29

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఏకధాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్‌కళ్యాణ్ నటించే సినిమాపై అప్పుడే ఊహాగానాలు జోరందుకున్నాయి. పవన్‌కళ్యాణ్ తదుపరి చిత్రం తమిళ దర్శకుడితో వుంటుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.

12/16/2015 - 22:27

ఈమధ్య తెలుగులో ప్రత్యేక పాటలకు పెట్టింది పేరుగా మారింది అందాల భామ హంసానందిని. ఈమె చేస్తున్న పాటలు మంచి విజయం సాధిస్తుండడంతో ఇపుడు ఈమెతో ఐటెమ్ సాంగ్స్ చేయిస్తూ ఆ సినిమాలకు మరింత క్రేజ్‌ను తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇటీవలే రవితేజ నటించిన ‘బెంగాల్ టైగర్’లో ప్రత్యేక పాటలో నటించి మత్తెక్కించింది హంస.

12/16/2015 - 22:25

సునీల్-వీరుపోట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ఈడు గోల్డెహె టైటిల్‌ని నిర్ణయంచారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ బుధవారం విడుదలైంది.

12/16/2015 - 21:00

పావని రావంత్, సాగర్ రావంత్, పావని జంటగా ధనుంజయ్ దర్శకత్వంలో కార్తికేయ ప్రొడక్షన్స్ పతాకంపై పళ్లా రమణయాదవ్ నిర్మిస్తున్న ‘నా హృదయం ఊగిసలాడే’ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు సాగర్ క్లాప్‌నివ్వగా, రమేష్ యాదవ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆర్.పి.పట్నాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

12/16/2015 - 20:57

వి.సినీస్టుడియో పతాకంపై ‘జబర్దస్త్’ ఫేమ్ రేష్మి కథానాయికగా ఓ చిత్రం ప్రారంభమైంది. దివాకర్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.

12/16/2015 - 20:56

ఈమధ్యే ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు హీరో నాని. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న నాని లేటెస్టుగా నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తికావచ్చింది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రూపొందుతోంది. త్వరలోనే ఆడియో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రంలో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తాడట.

Pages