S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/24/2015 - 05:21

మాస్టర్ ధరణ్ ప్రధాన పాత్రలో డాడి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మట్టిలో మాణిక్యాలు’. ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పూసల బుజ్జి తొలి సీడీని ఆవిష్కరించి ప్రతాని రామకృష్ణగౌడ్‌కు అందజేశారు.

11/24/2015 - 05:20

సాయికృప, రామకృష్ణ, వంశి ప్రధాన పాత్రల్లో సాయిరామ్ దాసరి దర్శకత్వంలో అమృతసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ‘మిత్రవింద’ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, ఈమధ్య ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులనుండి ఆదరణ లభిస్తోంది. టైటిల్ బాగుంది.

11/24/2015 - 05:19

తెలుగుతోపాటు తమిళంలో కూడా రాకింగ్ సంగీతంతో సంగీతప్రియులను అలరిస్తూ దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్. తను చేసిన సినిమాల పాటలన్నీ మ్యూజికల్ హిట్లుగా నిలిచేందుకు తపనపడే దేవి, చేసిన కుమారి 21 ఎఫ్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా దేవిశ్రీప్రసాద్ చెప్పిన విశేషాలు..
కుమారి రెస్పాన్స్ ఎలా వుంది?

11/24/2015 - 05:19

అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పి.వి.పి. సినిమా పతాకంపై పరమ్ వి.పొట్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘సైజ్ జీరో’.

11/23/2015 - 05:44

తమిళ, తెలుగు భాషల్లో గ్లామర్ తారగా, టాప్‌రేంజ్‌లో వెలుగొందుతోంది అందాల భామ కాజల్. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న కాజల్, పవన్ సరసన ‘సర్దార్ గబ్బర్‌సింగ్’, మహేష్ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు తమిళ్‌లో సూర్య, విక్రమ్‌ల సరసన నటిస్తున్న ఈమె ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలతో ఆకట్టుకున్న కాజల్ ఇప్పుడు నటిగా పేరుతెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

11/23/2015 - 05:43

సిద్ధాంశ్, రాహుల్, తేజశ్విని హీరోహీరోయిన్లుగా లక్ష్మణ్‌వర్మ దర్శకత్వంలో కళానిలయ క్రియేషన్స్ పతాకంపై బి.రమేష్ నిర్మించిన ‘సినీ మహల్’ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో శనివారం విడుదలయ్యాయి. శేఖర్‌చంద్ర సంగీతం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న దర్శకుడు మారుతి సీడీని విడుదల చేశారు.

11/23/2015 - 05:42

‘ముకుంద’, ‘కంచె’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్‌తేజ్, దిశాపటానీ జంటగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘లోఫర్’.

11/23/2015 - 05:39

అక్కినేని నాగచైతన్య
విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగచైతన్య. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. దీంతోపాటు చందు మొండేటి దర్శకత్వంలో ప్రేమమ్ సినిమా డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు.

11/23/2015 - 05:38

ముంబైలో అట్టహాసంగా జరిగిన అజింక్య డివైపాటిల్ ఫిల్మ్‌ఫేర్ (మరాఠి) అవార్డుల ప్రదానోత్సవంలో బాలీవుడ్ తారలు మిలమిల మెరిసారు. సంప్రదాయ దుస్తులు ధరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రముఖ తారలు విద్యాబాలన్, టబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

11/23/2015 - 05:37

ఈ ఏడాది ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత ఇంతవరకూ మరే చిత్రంలో నటించలేదు వెంకటేష్. ప్రస్తుతం చాలా కథలు వింటున్న ఆయన ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. ఇప్పటికే కథా చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందట.

Pages