S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/21/2015 - 22:25

ఇటీవల రూపొందించిన ‘అఖిల్’ అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో -వినాయక్ కాస్త వెనకబడినట్టే కనిపిస్తున్నాడు. ఇదివరకే ఆయన చిరంజీవి 150వ సినిమా చేస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ రిజల్ట్‌తో వినాయక్‌కు మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి పిలుపూ రాలేదు. దాంతో ఇప్పుడు వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

11/21/2015 - 22:22

తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది స్వాతి. కెరీర్ జెట్ స్పీడ్‌లోవున్న సమయంలోనే -ఇటీవలే ఎన్నో అంచనాలతో వచ్చిన త్రిపుర కమర్షియల్ హిట్‌కు దూరమై డీలాపడింది. అయినా ‘త్రిపుర’గా స్వాతికి మంచి మార్కులే పడ్డాయి. దాంతో ఇప్పుడు టాలీవుడ్‌లో స్వాతికి వరుస అవకాశాలు వస్తున్నాయట. లేటెస్ట్‌గా ఈ భామ ఓ ప్రముఖ నిర్మాత కొడుకు సినిమాలో హీరోయిన్‌గా చేస్తుందన్న టాక్ నడుస్తోంది.

11/21/2015 - 22:13

జాతీయ నటుడు కమల్‌హాసన్ హీరోగా త్రిష, మధుశాలిని హీరోయిన్లుగా రాజేష్ ఎం.శెల్వ దర్శకత్వంలో రూపొందిన ‘చీకటి రాజ్యం’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కమల్‌హాసన్ మాట్లాడుతూ.. ఇదొక విభిన్నమైన చిత్రం. అందరం కష్టపడి పనిచేశాం. ఇలాంటి చిత్రాల్ని ఆదరించకపోతే ఇలాంటి నేపథ్యంతో రూపొందే సినిమాలు రావడానికి మరో పదేళ్లు పట్టేది.

11/21/2015 - 22:18

అజయ్, భరత్, అర్జున్, వెంకటేష్, సుశ్మిత ప్రధాన పాత్రల్లో ఫిరోజ్‌రాజా దర్శకత్వంలో భరత్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై భరత్‌కుమార్ పీలం నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. కనిష్క్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సీడీని ఆవిష్కరించి, తొలి సీడీని హీరో తరుణ్‌కు అందజేశారు.

11/20/2015 - 23:21

నాగశౌర్య, పలక్ లల్వాని జంటగా రమేశ్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం -అబ్బాయితో అమ్మాయి. వందన అలేఖ్య జక్కం, శ్రీనివాస్ సమ్మెట, కిరీటి పోతిని నిర్మాతలు. చిత్రం కోసం స్వయంగా స్వరపర్చిన పాటల్ని హైదరాబాద్‌లో మాస్ట్రో ఇళయరాజా ఆవిష్కరించారు. ఈ సదర్భంగా మాట్లాడుతూ అందరూ ప్రేమికులే. నాకు సంగీతమంటే ప్రేమ. కొంతమందికి డబ్బంటే ప్రేమ. ప్రేమ లేకపోతే జీవితం లేదు.

11/20/2015 - 23:20

మంచు మనోజ్, రెజీనా జంటగా సుర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో శివకుమార్ మల్కాపురం రూపొందించిన ‘శౌర్య’ చిత్రానికి సంబంధించిన
ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.

11/20/2015 - 23:19

గోపీచంద్, రెజీనా జంటగా వస్తున్న చిత్రం సౌఖ్యం. ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడి గత చిత్రాలకన్నా మిన్నగా దీన్ని రూపొందించాడని, రెండు పాటల్ని సోమవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నట్టు చెప్పారు. 13న ఒంగోలులో ఆడియో విడుదల చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని అన్నారు.

11/20/2015 - 23:18

నాకు కథ నచ్చితేనే సినిమాకు ఓకె చెబుతా. అంతేగాని, చిన్న పెద్ద సినిమా అన్న ఆలోచనలు నాకు ఉండవు అంటున్నాడు కెమెరామెన్ రత్నవేలు. రోబోవంటి సంచలన చిత్రానికి పనిచేసిన రత్నవేలు, తాజాగా రాజ్‌తరుణ్, హెబాపటేల్ జంటగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో వస్తున్న ‘కుమారి 21 ఎఫ్’ సినిమాకు పనిచేశాడు. ఈ సందర్భంగా కెమెరామెన్ రత్నవేలుతో ఇంటర్వ్యూ...
సుక్కుకోసమే..

11/20/2015 - 23:16

శ్రుతిహసన్ మంచి జోరుమీదుంది. తమిళ, తెలుగు సినిమాల్లో జెట్ స్పీడ్‌తోవున్న శ్రుతికి అవకాశాలు లెక్కకుమించి అవుతున్నాయి. మెగా హీరో రామ్‌చరణ్ నెక్స్ట్ సినిమాలో జోడీ కట్టేందుకు రెడీ అయ్యింది శ్రుతి. గతంలో వీళ్లిద్దరు -ఎవడు చేశారు. తాజాగా రామ్‌చరణ్ నటిస్తున్న తమిళ రీమేక్ తనిఒరువన్ సినిమా వచ్చేనెలలో సెట్స్‌పైకి రానుంది. ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తాడు.

11/20/2015 - 23:14

అప్పట్లో వచ్చిన అష్టాచమ్మా సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు నాని. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న నాని, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో హీరోగా సెటిలయ్యాడు. ఇటీవలే భలేభలే మగాడివోయ్ హిట్టుతో మంచి ఊపుమీదున్న నాని, తదుపరి సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

Pages