S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర

01/19/2018 - 20:06

బాహుబలి-2 ఘనవిజయం తర్వాత అనేక బడా ప్రాజెక్టులకు సంబంధిచి పలు భాషల్లో ప్రకటనలు వచ్చాయి. తమిళ ఫిలింమేకర్ సి.సుందర్ కూడా ఓ భారీ చిత్రానికి సంబంధించి ప్రకటన చేశారు. సంఘమిత్ర అంటూ ఓ మహిళా ప్రాధాన్యం వున్న జానపద చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చెప్పారు. కానీ ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మొదటా సంఘమిత్ర పాత్ర కోసం శృతిహాసన్‌ను తీసుకోవడం..

01/18/2018 - 20:56

తెరవెనుక దాసరి
రచన: పసుపులేటి రామారావు
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ, హైదరాబాద్
ఫోన్: 040- 24652387
సెల్: 9247471361
పేజీలు: 246, వెల: రూ.300/-
*

01/18/2018 - 20:50

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత భారీ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా.. నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి రెండవ వారం నుండి కేరళలో ఈ షెడ్యూల్ మొదలుకానున్నదట.

01/18/2018 - 20:49

నటిగా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి మరోసారి సరికొత్త కానె్సప్టుతో తెరకెక్కుతున్న చిత్రంతో రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ‘వైఫ్ ఆఫ్ రామ్’గా ప్రకటించారు.

01/18/2018 - 20:48

మాస్ రాజా రవితేజ, రాశీఖన్నా, సీరత్‌కపూర్ హీరో హీరోయిన్లుగా విక్రం సిరికొండ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ- త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.

01/18/2018 - 20:46

తెలుగు భామ అంజలికి ఈమధ్య సినిమాలు బాగా తగ్గాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘చిత్రాంగద’ భారీ పరాజయాన్ని చవిచూడటంతో అంజలి కెరీర్ అయోమయంలో పడింది. ప్రస్తుతం తమిళంలో బెలూన్ చిత్రంలో నటిస్తున్న ఈమెకు కొత్తగా అవకాశాలు రావడంలేదు. దాంతో మళ్లీ అవకాశాల కోసం జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో నిర్మాతలకు బంపర్ ఆఫర్ ఇస్తుందట.

01/18/2018 - 20:44

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటలను ఈనెల 20న విడుదల చేయనున్నారు.

01/18/2018 - 20:43

రాఘవ్, కారుణ్య కత్రిన్, మీనాకుమారి ముఖ్యపాత్రల్లో కోటేంద్ర దుద్యాల దర్శకత్వంలో నంది క్రియేషన్స్ పతాకంపై ఎం.డి రఫీ మరియు రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేక సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోంది.

01/17/2018 - 21:09

త్వరలోనే మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. బాహుబలి తరువాత రాజవౌళి తెరెకెక్కించే సినిమా ఇదే. మెగా హీరో రామ్‌చరణ్, నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటించే ఈ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా దసరాకు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట రాజవౌళి. ప్రస్తుతం అటు చరణ్, ఇటు ఎన్టీఆర్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నారు.

01/17/2018 - 21:12

కొత్తదనాన్ని అందించడంలో నాగ్ స్టయలే వేరు. అందుకే చిన్నా పెద్దా తేడా లేకుండా భాషా భేదం లేకుండా ఎప్పటినుంచో మల్టీస్టారర్లు చేస్తున్నారు నాగ్. మల్టీస్టారర్లు పూర్తిగా మరుగునపడిపోయిన సమయంలో మోహన్‌బాబుతో అధిపతి, శ్రీకాంత్‌తో నినే్న ప్రేమిస్తా లాంటి సినిమాలు చేశాడు. నాగ్ హిందీ, తమిళ భాషల్లోనూ వేరే హీరోలతో కలిసి నటించాడు.

Pages