S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/09/2018 - 21:51

యంగ్ హీరో నాగశౌర్య ‘ఛలో’తో గాడిన పడ్డట్టు అనిపించినా.. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు నిరాశపరచడంతో తన నెక్స్ట్ సినిమాల ఎంపికలో జాగ్రత్త పడుతున్నాడు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కాకుండా మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శౌర్య.

12/09/2018 - 21:49

‘పటాస్’ తర్వాత ఇప్పటివరకూ మళ్ళీ నందమూరి కళ్యాణ్‌రామ్‌కు బాక్స్‌ఆఫీస్ దగ్గర విజయం దక్కలేదు. అప్పటినుండి డిఫరెంట్ స్టోరీలతో కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నా ఎందుకో అవి ప్రేక్షకులను మెప్పించడం లేదు. అలా అని నిరాశ చెందకుండా కళ్యాణ్‌రామ్ మాత్రం తన వైపునుండి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెడుతూ ఆ సినిమాలపై పుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు.

12/07/2018 - 22:26

తమిళ స్టార్ హీరో విజయ్ నటించనున్న 63వ సినిమా సెట్స్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విజయ్‌కి ‘తెరి, మెర్సల్’ చిత్రాల రూపంలో బ్లాక్‌బ్లాస్టర్ విజయాలను అందించిన యువ దర్శకుడు అట్లీ ఈ సినిమా తెరకెక్కించనున్నాడు. ఇక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే చిత్రంలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించనున్నాడని చెన్నై సినీవర్గాల కథనం.

12/07/2018 - 22:25

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌కౌర్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్2’.. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ ట్యాగ్‌లైన్. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న ఎఫ్2ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ హ్యాట్రిక్ విజయాల తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న చిత్రమిది.

12/07/2018 - 22:38

‘ముందస్తు’ ఎన్నికలు ముగిసిపోయాయి. గద్దెపైకి ఎవరొస్తారన్న విషయాన్ని పక్కనపెడితే, ఎన్నికల పట్ల సమస్త ప్రజానీకం అనాసక్తతే చూపించారన్న విషయం పోలింగ్ శాతాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. గత నెల రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సమీకరణలు, అధికార తెరాస పాలనను అడ్డుకోడానికి వివిధ పార్టీలతో ఏర్పాటైన కూటమి, పరస్పర వాగ్బాణాలతో నిర్వహించిన ప్రచార పటాటోపం.. ఈ హడావుడి అంతా ఒక్కసారిగా చల్లారిపోయింది.

12/07/2018 - 22:15

తమిళ్ 96 మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విడుదలైన నాటి నుండి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన ఈ సినిమా దీపావళి సందర్భంగా టీవీల్లో ప్రదర్శించినా కూడా కొన్ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో ఈ సినిమాపై తెలుగు నిర్మాత కన్ను పడింది.

12/07/2018 - 22:13

రజనీ, శంకర్ కాంబోలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై 550 కోట్లతో సుభాస్కరన్ నిర్మించిన విజువల్ వండర్ ‘2.0’. నవంబర్ చివర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న 2.ఓ మొదటి 4 రోజుల్లో 400 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఉత్సాహంతో చైనాలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

12/07/2018 - 22:11

మహాముని ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్‌రెడ్డి సమర్పించు చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. బాహుబలిలో ప్రభాస్ చైల్డ్ యాక్టర్ నిఖిల్, సాహితి హీరో హీరోయిన్లు నీరజ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు దర్శకుడు అల్లాడి రవీందర్‌రెడ్డి, నిర్మాత లక్ష్మికాంత్‌రెడ్డి. ఈ చిత్ర ట్రైలర్‌ను సీనియర్ డైరెక్టర్ సముద్ర, ఆడియో బిగ్ సీడీని నటుడు నోయల్ విడుదల చేశారు.

12/07/2018 - 22:06

ప్రముఖ ఫైనాన్సియర్ కె.ఎల్.ఎన్.రాజు చాలాకాలం తరువాత థౌజండ్ లైట్స్ మీడియా ప్రై.లి. పతాకంపై నిర్మించిన ‘అనగనగా ఒక ప్రేమకథ’ డిసెంబర్ 14న విడుదలకు సిద్ధమైంది. గతంలో రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో ‘అనగనగా ఒక రోజు’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి’ చిత్రాలు నిర్మించారు. ఈ సందర్భంగా కె.ఎల్.ఎన్.రాజు చిత్ర నిర్మాణ విశేషాలను తెలుపుతూ- బేసికల్‌గా నాకు లవ్‌స్టోరీలు అంటే ఇష్టం.

12/07/2018 - 22:05

జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శక ధీరుడు రాజవౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ షూటింగ్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఈరోజుతో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుందని చిత్రబృందం ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలిపింది. కాగా మొదటి షెడ్యూల్‌లో రాజవౌళి ఎన్టీఆర్-రామ్‌చరణ్‌లపై కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

Pages