S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/02/2017 - 03:31

రాంకార్తీక్, భాను త్రిపాఠి జంటగా ఎస్.ఆర్.పి. విజువల్స్ పతాకంపై నాని ఆచార్య దర్శకత్వంలో శివరాజ్‌పాటిల్ రూపొందించిన చిత్రం ‘ఇద్దరిమధ్య 18’. బిత్తిరి సత్తి ఓ కీలకమైన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను తెలంగాణ మంత్రి టి.హరీశ్‌రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- రాజకీయాలలో అనుభవం వున్న శివరాజ్‌పాటిల్ సినిమా రంగంలో కూడా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

03/02/2017 - 03:31

విశ్వదేవ్ రాచకొండ, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా అమేజింగ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం.1గా కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మ్యూజిక్ డైరెక్టర్ కోటి క్లాప్ కొట్టగా, జెమిని కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి సన్నివేశానికి చంద్రబోస్ గౌరవ దర్శకత్వం వహించారు.

02/28/2017 - 21:01

అంటే అవుననే సమాధానం వస్తుంది! రీఎంట్రీ ఇస్తూ 150వ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నంబర్ 150వ సినిమాతో బాక్సాఫీసు వంద కోట్ల మార్క్ కొల్లగొట్టిన చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏమిటనే విషయంపై మెగా ఫాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పలు వార్తలు వచ్చినప్పటికీ 151వ సినిమా కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. ఎలాగంటారా..

02/28/2017 - 20:59

‘రా.రా..’ ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ద్వితీయ ప్రచార చిత్రం విడుదల వేడుక నరసరావుపేటలో జరిగింది. శ్రీకాంత్ కథానాయకునిగా ‘రా’ పేరుతో రూపొందుతున్న ఈ నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించిన విషయం విదితమే.

02/28/2017 - 20:56

ఈ ఏడాది చిరంజీవి తర్వాత మెగా కుటుంబం నుండి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ‘విన్నర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మొదటినుండి మంచి క్రేజ్‌ను బిల్డప్ చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రంతో తేజ్ తన కెరీర్లోనే ఉత్తమమైన ఓపెనింగ్స్ సాధించాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తేజ్ మాట్లాడారు.
* విడుదల తర్వాత ఎలా ఉంది?

02/28/2017 - 20:52

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమ మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్‌ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చిత్ర యూనిట్ సమక్షంలో లాంచ్ చేశారు.

02/28/2017 - 20:50

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘పెళ్లిచూపులు’ సినిమా సంచలన విజయం సాధించింది. ఆ సినిమాతో హీరోగా భారీ ఇమేజ్‌ని సొంతం చేసుకుని హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు హీరో విజయ్ దేవరకొండ. ఆయన నటిస్తున్న తదుపరి చిత్రం ‘ద్వారక’. శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 3న విడుదలవుతున్న సందర్భంగా హీరో విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు...
ద్వారక అంటే...

02/28/2017 - 20:47

నిఖిల్, రీతూవర్మ జంటగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా రూపొందిస్తున్న చిత్రం ‘కేశవ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు.

02/28/2017 - 20:45

బ్రిటీష్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సాల్‌తో ప్రేమ వ్యవహారం నడుపుతూనే మా ఇద్దరి మధ్యనా ఏమీలేదు అంటోంది శ్రుతిహాసన్. వారిద్దరి ప్రేమనీ ఎంతగా ఆమె దాచాలని చూసినా మీడియా ఇంటరాక్షన్ ఎక్కువగా ఉన్న ఈ కాలంలో అది బయటపడిపోతూ ఉండడం విశేషం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇద్దరూ ముంబైలో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు కూడా. ‘ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను.

02/28/2017 - 20:43

ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై రాజ్‌తరుణ్ కథానాయకుడిగా వంశీకృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం రూపొందిస్తున్న చిత్రం ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 3న విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Pages