S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/26/2018 - 20:05

ప్రముఖ నటుడు కాందబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది. నిన్న కేరళ తుపాన్, తిత్లీ తుపాన్ బాధితులకు సాయం అందించిన మనం సైతం నేడు భూదాన్ పోచంపల్లి నేతన్నలకు అండగా నిలబడింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో పేదలకు ఆర్థిక సాయం అందజేశారు.

11/26/2018 - 20:04

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా, సుధాకర్ ఇంప్లెక్స్ ఐపియల్ బ్యానర్‌పై బీరం సుధాకర్‌రెడ్డి నిర్మాణంలో నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్‌తో డిసెంబర్ 7న అత్యధిక థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

11/26/2018 - 20:03

జంతువుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాలంటే -హాలీవుడ్‌కు హాలీవుడ్డే సాటి. పిల్లలకోసం పుట్టుకొచ్చే పిట్ట కథలనుంచి, జంతు పరిణామక్రమం ఆధారంగా తెరకెక్కే చారిత్రక చిత్రాల వరకూ హాలీవుడ్‌ది ఓ ప్రత్యేక శైలి. అలా హాలీవుడ్ నుంచి వస్తోన్న మరో జంతు నేపథ్య చిత్రం కోసం ప్రపంచం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి మోషన్ పిక్చర్ సినిమానే -మోగ్లీ: ది లెజెండ్ ఆఫ్ జంగిల్.

11/26/2018 - 20:01

వరుస సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరితో జతకట్టేసింది త్రిష. దశాబ్దంపాటు స్టార్ హీరోయిన్ హోదాలో వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. కొత్త కథానాయికలు ఎంతమంది వచ్చినా త్రిష మాత్రం ఇంకా అవకాశాలు అందుకుంటూనే ఉంది. తెలుగు, తమిళ, కన్నడం, మలయాళం అనే తేడాలేకుండా అన్ని ఇండస్ట్రీలనుండి అవకాశాలు వస్తూనే ఉన్నాయ.

11/26/2018 - 20:00

అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ని ప్రియాంక పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఐదురోజుల పాటు సాగే వేడుక సమయం దగ్గర పడటంతో -ప్రియాంక ఇల్లు విద్యుద్దీపాలతో కళకళలాడుతోంది. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్‌లో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహ వేడుక నిర్వహించనున్నారు. పెళ్లి తరువాత ముంబయి, ఢిల్లీలో విందు నిర్వహిస్తారు. ఢిల్లీ విందుకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం లేకపోలేదు.

11/26/2018 - 19:58

సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న వర్మ.. ఈమధ్య వరుస పరాజయాలే చవిచూస్తున్నాడు. హిట్ ప్లాప్ అన్నది పెద్దగా పట్టించుకోనని చెప్పే వర్మ, నచ్చిన సినిమాలను తీసి వదలడం ఆయన స్టయల్. కథ నచ్చడంతో మరో దర్శకుడు సిద్ధార్థ తాతోలుకు అవకాశమిచ్చి నిర్మిస్తున్న చిత్రమే భైరవగీత. ధనుంజయ్, ఇర్రామోర్ జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌వర్మతో ఇంటర్వ్యూ...

11/26/2018 - 19:57

అలివేలమ్మ ప్రొడక్షన్స్ సమర్పించు టి.అలివేలు నిర్మించిన కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆపరేషన్ 2019. శ్రీకాంత్, మంచు మనోజ్, సునీల్ నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకుంది. ఈ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అంతా కలిసి ప్రముఖుల సమక్షంలో ఆడియో సీడీని, టీజర్‌ను మా అధ్యక్షులు మురళీమోహన్, హీరో గోపీచంద్ కలిసి విడుదల చేశారు.

11/25/2018 - 23:12

ధనుంజయ్, ఐరామోర్ హీరో హీరోయన్లుగా సిద్ధార్థ తాతోలు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భైరవగీత. రామ్‌గోపాల్‌వర్మ సమర్పణలో అభిషేక్‌నామ, భాస్కర్ రాశి నిర్మించారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం నవంబర్ 30న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్ హైలైఫ్ పబ్‌లో ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘్భరవగీత నాకు చాలా స్పెషల్ మూవీ.

11/25/2018 - 23:14

టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్‌సింగ్ తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత రకుల్ నటించిన తెలుగు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో రకుల్‌కి టెన్షన్ పట్టుకుంది. దీంతో చెన్నై చెక్కేసిన రకుల్ కోలీవుడ్‌లో రెండుమూడు చిత్రాల్లో నటిస్తోంది. ఇక కార్తీతో నటించిన ఖాకీ చిత్రం ఇప్పటికే విడుదలై పర్వాలేదనిపించగా, అతనితోనే దేవ్ చిత్రంలో నటిస్తోంది.

11/25/2018 - 22:27

సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక భారీ సెట్‌లో జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు సాయికుమార్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారని సమాచారం. గతంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘ఎవడు’ చిత్రంలో విలన్‌గా నటించి ఆ పాత్రను రక్తికట్టించారు సాయికుమార్. దాంతో వంశీ మళ్ళీ ఈ చిత్రానికి కూడా ప్రతినాయకుడిగా ఆయనే్న తీసుకున్నారట.

Pages