S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/17/2018 - 22:43

అరవిందను అదృష్టం తరుముతోంది. ఒక సెట్ నుంచి మరో సెట్‌కు పరుగులు పెట్టిస్తోంది. అటు హిందీ, ఇటు తెలుగులో పెద్ద హీరోల సరసన ఒక్కసారిగా అవకాశాలు ముప్పిరిగొనడంతో -పూజ కెరీర్ ఎక్కే ఫ్లైటు దిగే ఫ్లైటు అన్నట్టే ఉంది. రెండడుగులు వెనక్కి వేస్తే కెరీర్ ముగిసిపోయినట్టు కాదని ఈ స్కై బ్యూటీ నిరూపించే ప్రయత్నం చేస్తోంది.

10/17/2018 - 22:22

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో చాలాకాలంగా ఆగిపోయిన మల్టీస్టారర్ సినిమాలకు కొత్త ఉత్తేజాన్ని నింపాడు నిర్మాత దిల్‌రాజు. మహేష్, వెంకటేష్‌లాంటి హీరోలను పెట్టి తీసిన సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తెలుగులో మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి కూడా. తాజాగా ఆయన బ్యానర్‌లో మరో మల్టీస్టారర్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాడు.

10/16/2018 - 22:28

రామ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. దసరా సందర్భంగా అక్టోబర్ 18న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ..
సరికొత్త కోణంలో..

10/16/2018 - 22:27

వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తోన్న అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్ టీజర్ అక్టోబర్ 17న విడుదల కానుంది. తెలుగు ఇండస్ట్రీలో తొలి స్పేస్ నేపథ్యం వున్న సినిమా ఇదే కావడం విశేషం. వరుణ్‌తేజ్, అదితిరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఘాజీతో జాతీయ అవార్డు అందుకున్న సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

10/16/2018 - 22:25

అనగనగా ఓ ప్రేమకథ చిత్రానికి సంబంధించిన ‘ఒక తొలి ప్రేమ’ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేసి యూనిట్‌కు అభినందనలు తెలిపారు. పాటకు సమకూర్చిన సంగీతం, సాహిత్యం బాగున్నాయన్నారు. చిత్రం టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్ర నిర్మాత కెఎల్‌ఎన్ రాజు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశించారు.

10/16/2018 - 22:23

ఎన్‌ఎస్ మూర్తి స్వీయ దర్శకత్వంలో అల్లు వంశీ, షిప్రాగౌర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. చిత్రానికి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు.

10/16/2018 - 22:21

రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కోటేంద్ర దుద్యాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. కెయమ్‌డి రఫి, రెడ్డం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం 25న విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు కోడేంద్ర దుద్యాల మాట్లాడుతూ బంగారు బాలరాజు ఆలోచింపచేసే చిత్రమన్నారు. ఇప్పటికే చిన్నికృష్ణ- చిట్టిబాబు రెడ్డిపోగు సంగీతం అందించిన ఆరు పాటలకు మంచి స్పందన వచ్చిందన్నారు.

10/16/2018 - 22:20

విశాల్ హీరోగా ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి-2’. ఠాగూర్ మధు సమర్పణలో చిత్రాన్ని దసరా కానుకగా 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఠాగూర్ మధు మాట్లాడుతూ ‘ఇది పర్‌ఫెక్ట్ సీక్వెల్. తొలి భాగంలోని పాత్రల ఆధారంగానే సినిమా ట్రీట్‌మెంట్ రాశారు. పందెంకోడి తొలి భాగంలోని ఎమోషన్ క్యారీ అవుతుంది.

10/16/2018 - 22:18

ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తారు తమిళ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్. కమర్షియల్ అంశాలతోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్, సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. వైవిధ్యమైన కథలతో ట్రావెల్ చేసే విజయ్‌కు మురుగదాస్ లాంటి దర్శకుడు దొరికితే అభిమానులకు పండగే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో తుపాకి, కత్తి వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇప్పుడీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది.

10/16/2018 - 22:16

మహ్మద్ అస్లాం నిర్మిస్తున్న వినూత్న కథా చిత్రం ‘అంతా విచిత్రం’. చిత్రానికి జైరామ్‌కుమార్ దర్శకుడు. సాయి ప్రణీత్, లిఖిత్, బిట్టు, నీరజ్, రాజేంద్ర, విజయ్ భాస్కర్ ముఖ్య తారాగణం. చిత్రానికి భోలే షావలి సంగీతం సమకూర్చారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రానికి ఆడియో విడుదల ఘనంగా నిర్వహించారు.

Pages