S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/04/2018 - 19:54

ప్రముఖ నటుడు సోనూసూద్ జాతీయస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జీవితం ఆధారంగా ఒక బయోపిక్‌ను నిర్మించనున్నారని తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క స్క్రిప్ట్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో లేదా ఫిబ్రవరిలో కానీ ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు సోనూసూద్.

10/04/2018 - 19:53

భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, రీసెంట్‌గా శైలజారెడ్డి అల్లుడుతో హ్యాట్రిక్ హిట్స్ సాధించిన దర్శకుడు మారుతి. పెద్ద సినిమాలు చేస్తూనే.. చిన్న చిత్రాలకు కానె్సప్టులు ఇస్తూ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తున్నాడు. తాజాగా మారుతి కానె్సప్ట్ అందించిన చిత్రం ‘్భలే మంచి చౌకబేరమ్’.

10/04/2018 - 19:49

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ ఈనెల 11న విడుదలకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ వంద కోట్ల క్లబ్‌లోకి చేరతాని వాళ్ళ ఆశ. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

10/04/2018 - 19:46

అనగనగా ఓ ప్రేమకథ చిత్రంతో విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. టి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని కెఎల్‌ఎన్ రాజు నిర్మిస్తున్నారు. రిద్ధికుమార్, రాధా బంగారు హీరోయిన్లు. చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్‌ను దర్శకుడు శేఖర్ కమ్ముల గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -టైటిల్ సాంగ్‌లో సంగీతం, సాహిత్య మేళవింపు బావుంది.

10/04/2018 - 19:45

జాతీయ అవార్డు గ్రహీతగా, విలక్షణ నటుడిగా అన్ని భాషల్లోనూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న బహుభాషా నటుడు నాజర్. తమిళ, తెలుగు సినిమాల్లో ఇప్పటికీ ప్రధాన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న సీనియర్ ఆర్టిస్ట్. ఇపుడు నాజర్ వారసుడు తమిళంలో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. ఇప్పటికే ఆయన పెద్ద కుమారుడు కూడా సినిమాల్లోనే ఉన్నారు.

10/04/2018 - 19:43

ముళ్లగూరు అనంతరాముడు, రమేష్‌నాయుడు తెలుగు, కన్నడ భాషల్లో సంయుక్తగా నిర్మించిన చిత్రం -టు ఫ్రెండ్స్. ట్రూ లవ్ ట్యాగ్‌లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి శ్రీనివాస్ జిఎల్‌బి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో తమిళనాడు మాజీ గవర్నర్ కె రోశయ్య విడుదల చేశారు.

10/03/2018 - 20:23

ప్రస్తుతం స్టార్ హీరోలు కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. అప్‌కమింగ్ హీరోలు వైవిధ్యమైన కథలతో స్క్రీన్‌కు వస్తున్న తరుణంలో, భారీ బడ్జెట్‌తో సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలు రోటీన్ మూస కథలకే వెళ్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఎంచుకునే ప్రతి కథలోనూ ఏదోక కొత్తదనాన్ని స్టార్ హీరోలు వెతుక్కోక తప్పడం లేదు. తాజాగా అల్లు అర్జున్ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

10/03/2018 - 20:22

నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న బయోపిక్ శ్రీకాకుళంలో కీలక షెడ్యూల్‌ను జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో కీలక ఘట్టంగా నిలిచిన పార్టీ ప్రచారంలో భాగంగా చైతన్యరథం సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తుండగా, క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సినీవర్గాల్లో సంచలనం రేపుతోంది.

10/03/2018 - 20:21

హీరోగా తనకంటూ సెపరేట్ ట్రాక్ వేసుకున్న నారా రోహిత్, అదే పంథా కొనసాగిస్తున్నాడు. తాజాగా ఓ పీరియాడిక్ చిత్రం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని తెలుస్తోంది. 1971 యుద్ధ నేపథ్యంలో జరిగే కథతో చిత్రం ఉండొచ్చన్నది
ఇండస్ట్రీ టాక్. నారా రోహిత్‌ను బాణం చిత్రంతో హీరోగా పరిచయం చేసిన చైతన్య దంతులూరి

10/03/2018 - 20:20

పనె్నండేళ్ల కల సాకారమయ్యే సందర్భం వచ్చిందని జూ.ఎన్టీఆర్ మనసులో మాట బయటపెట్టాడు. 27 సినిమాలు పూర్తి చేసిన తనకు 28వ చిత్రం కొత్త విషయం నేర్పిందన్నాడు. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో చేసిన ‘అరవింద సమేత’ బతుకు ప్రాధాన్యం తెలిపిందన్నారు. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన చిత్రం ‘అరవింద సమేత’. వీర రాఘవ ట్యాగ్‌లైన్. పూజాహెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లు.

Pages