S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/03/2018 - 20:18

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రగా వస్తోన్న చిత్రం బేవర్స్. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లు. కాసం సమర్పణలో నిర్మాతలు పొన్నాల చందు, ఎంఎస్ మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రమిది. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ హర్షితతో మాటామంతీ.

10/03/2018 - 20:17

తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో రెండో సీజన్ విన్నర్ కౌశల్ సోషల్ మీడియా హీరో అయిపోయాడు. కౌశల్ ఆర్మీ గ్రూపులతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. 113 రోజుల షో టైంలో కౌశల్ అనూహ్య అభిమానం సంపాదించాడు. బిగ్‌బాస్ విన్నర్‌గా మంచి క్రేజ్‌లోవున్న కౌశల్‌ని హీరో చేయడానికీ సన్నాహాలు మొదలయ్యాయి. కౌశల్‌ని హీరో చేసేందుకు కౌశల్ ఆర్మీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

10/03/2018 - 20:16

ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఉత్తరాది, దక్షిణాది చిత్రాల్లో తన మధుర గాత్రంతో ప్రేక్షకుల్ని సంగీత స్వరసాగరంలో ఓలలాడించిన గాన కోవిదుడు కెజె ఏసుదాస్. ఈ జర్నీలో ఆయన కొన్ని కోట్లమంది సంగీత ప్రియులను అలరించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో తెలుగు ప్రేక్షకుల కోసం నవంబర్ 11న లైవ్ కానె్సర్ట్ చేయబోతున్నారు.

10/03/2018 - 20:14

వెంకటేష్ గౌడ్, ప్రాచీ అధికారి, అభయ్, కులకర్ణి మమత లీడ్ రోల్స్‌లో రమేష్ అంకం దర్శకత్వంలో వస్తోన్న చిత్రం సుడిగాలి. చెట్టుపల్లి వెంకటేష్, బిరాదర్ మల్లేష్ నిర్మిస్తున్న యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. చిత్రంలోని పాటలు మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్‌సి రాములు నాయక్ బిగ్ సీడీ విడుదల చేశారు.

10/03/2018 - 20:13

అనూష సినిమా పతాకంపై అనీల్ మొగిలి, సునీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం కోనాపురంలో జరిగిన కథ. చిత్రానికి కెబి కృష్ణ (బాలు) దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు పోషం మట్టారెడ్డి సమర్పకులు కాగా, మచ్చ వెంకట్‌రెడ్డి, భట్టు అంజిరెడ్డి, పల్లె వినయ్‌కుమార్ నిర్మాతలు. ఒక ఊరిలో వాస్తవంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చిత్రం తెరకెక్కింది.

10/02/2018 - 22:05

అమాంతంగా పెరిగి ‘విదే’ ఇమేజ్ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఆసక్తి రేకెత్తిస్తోన్న ‘నోటా’ విడుదలకు దగ్గరైంది. యంగ్ హీరోగా సెలెక్టెడ్ సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ (వి.దే), మెహ్రీన్ హీరో హీరోయిన్లు. జ్ఞానవేల్ రాజా నిర్మాత, ఆనంద్‌శంకర్ దర్శకుడు. చిత్రం రిలీజ్ టైం దగ్గరపడటంతో, ప్రమోషన్ పనులు వేగవంతం చేస్తోంది చిత్రబృందం.

10/02/2018 - 22:03

భారీ చిత్రాల దర్శకుడు శంకర్ సినిమా మొదలెట్టాడంటే దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఆసక్తి మొదలవుతుంది. అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించే శంకర్ తెరకెక్కించిన రోబో 2.0 సినిమా కోసం ఆత్రంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఆయన జాతీయ నటుడు కమల్‌హాసన్‌తో భారతీయుడు-2 ప్లాన్ చేస్తున్నాడు.

10/02/2018 - 22:02

లక్కీ మీడియా నిర్మిస్తున్న సినిమా ‘హుషారు’. తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్‌తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని కీలక పాత్రధారులు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ‘నానానా’ అనే పాటను సోమవారం విడుదల చేశారు. భాస్కరభట్ల సాహిత్యం అందించిన పాటను దిల్‌రాజు విడుదల చేశారు.

10/02/2018 - 22:00

చైతూ కొత్త సినిమా ‘సవ్యసాచి’ యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రంగా విడుదలైన టీజర్ చెప్పకనే చెబుతోంది. చైతూ పాత్రను భారతంలో అర్జునుడి పాత్ర స్ఫూర్తితో డిజైన్ చేశాడు దర్శకుడు చందూ మొండేటి. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ (గర్భంలోనే ఇద్దరు కవలలు ఒక్కటవ్వడం)తో తలెత్తే పరిణామాలే చిత్రం కానె్సప్ట్‌గా అర్థమవుతోంది. టీజర్ ఫ్రెష్‌గా, క్రియేటివ్‌గా ఉంది. ‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే అన్నదమ్ములంటారు.

10/02/2018 - 21:58

అలీ సమర్పణలో ఖయ్యూమ్, తనిష్క్, రాజన్, షానీ, పృధ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకంపై రూపొందింది. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకుడు. రమా గౌతమ్ నిర్మాత. ఫిలిం ఛాంబర్‌లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నటుడు అలీ మాట్లాడుతూ దేశంలో దొంగలు పడ్డారు సినిమా చూశా, నచ్చింది. దర్శకుడు గౌతమ్ వద్ద టాలెంట్ వుంది.

Pages