S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/02/2018 - 21:54

వరుణ్‌తేజ్, అదితిరావు హైదరి, లావణ్యత్రిపాఠి కలిసి నటిస్తున్న ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని సినిమా హీరో వరుణ్‌తేజ్ ట్విట్టర్‌లో వెల్లడించాడు. షూటింగ్ స్పాట్‌లోని ఫొటో యాడ్ చేస్తూ ‘ఈ చిత్రానికి పనిచేయడం అమేజింగ్ అనిపించింది’ అని పేర్కొన్నారు. మొదటి సినిమా ‘ఘాజి’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

10/02/2018 - 21:53

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారుల జీవితం ఆధారంగా బయోపిక్‌లను తెరకెక్కించడం ట్రెండ్‌గా మారుతోంది. ఇప్పటికే ఎంఎస్ ధోని, సచిన్, మిల్కాసింగ్ జీవిత చరిత్రల ఆధారంగా బయోపిక్స్ వచ్చాయి. అలాగే ప్రముఖ బాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు జీవితాధారంగా బయోపిక్ తెరకెక్కించనున్నట్టు సినీనటుడు సోనూ సూద్ గతంలో ప్రకటించాడు.

10/02/2018 - 21:51

బాలీవుడ్ నటి కంగనారనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. పోరాట యోధురాలు ‘రాణి లక్ష్మీభాయ్’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం. అయితే తాజాగా విడుదలైన టీజర్, చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచింది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌బచ్చన్ వాయిస్ ఓవర్‌తో మణికర్ణిక టీజర్ మొదలైంది. టీజర్‌లో ప్రధానంగా కంగనారనౌత్ హైలెట్ అవ్వగా..

10/02/2018 - 21:49

తెలుగు హీరోయిన్లకు తెలుగు పరిశ్రమలో అవకాశాలు రావా? అన్న ప్రశ్న ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలేలా ఉంది. టాలీవుడ్ సినిమాలో హీరోయిన్ అంటే, కచ్చితంగా ముంబైనుంచో, ఢిల్లీనుంచో, మరే ఇతర ప్రాంతంనుంచో తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రేక్షకులూ వాళ్లను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఒకరిద్దరు తెలుగు హీరోయిన్లు తప్ప, నిలదొక్కు కున్నవాళ్లంతా పరాయి భామలే.

10/02/2018 - 21:48

బాలీవుడ్‌లో ప్రేమాయణాలు మామూలే. ప్రాంతీయ పరిశ్రమతో పోల్చుకుంటే, అక్కడ ప్రేమజంటలు లెక్కలేనన్ని. ప్రేమ పెళ్లిళ్లూ అంతే. ఆ జాబితాలోకి అలియా భట్ కూడా చేరుతోంది. వచ్చే నవంబర్‌లో ప్రేమ పెళ్లికి బాలీవుడ్ క్రేజీ భామ దీపికా పదుకొనె, రణ్‌వీర్‌సింగ్‌లు సిద్ధమవుతుంటే, దీపిక ఎక్స్ లవర్ రణబీర్ కపూర్ సైతం పెళ్లికి సిద్ధమయ్యాడు.

10/01/2018 - 20:07

నందమూరి తారక రామారావు బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రం ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంది. తాజాగా తదుపరి షెడ్యూల్‌ను శ్రీకాకుళంలో ప్లాన్ చేస్తున్నారట. ఈనెల 4నుండి అక్కడ కొత్త షెడ్యూల్ మొదలు పెట్టనున్నారని వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తదుపరి షెడ్యూల్‌ను శ్రీకాకుళంలోనే జరపడానికి ప్రత్యేక కారణం ఉందన్నది యూనిట్ మాట.

10/01/2018 - 20:06

ఎన్టీఆర్- అట్లీ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించే భారీ ప్రయత్నాల్లో వైజయంతి మూవీస్ సంస్థ ఉంది. ఇప్పటికే అట్లీ స్క్రిప్టు సిద్ధం చేస్తున్నాడని వినికిడి. అయితే ‘అరవింద సమేత’తో బిజీగావున్న తారక్,
తదుపరి రాజవౌళి మల్టీస్టారర్‌లో నటిస్తాడు. ఆపై వైజయంతి ప్రాజెక్టుకు వచ్చే అవకాశం ఉంది. దేవదాస్

10/01/2018 - 20:03

మారుతి స్క్రిప్ట్‌గా తెరకెక్కిన భలే మంచి చౌక బేరమ్ అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తుంది. అరోళ్ల సతీష్‌కుమార్ నిర్మించిన చిత్రానికి మురళీకృష్ణ ముడిదాని దర్శకుడు. అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్, పంతంవంటి చిత్రాలను నిర్మించిన శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

10/01/2018 - 20:01

సామజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాలు అరుదు. ఆ కోవలో ‘మరో అడుగు..’. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ‘రిజర్వేషన్ల’పై చాలా రకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, కుల నిర్మూలన అలాంటి చర్చలకే పరిమితమవుతుంది. ఆ సమస్యకు పరిష్కారం చూపే ఆలోచనతో వస్తోన్న సినిమా ‘మరో అడుగు మార్పు కోసం’. నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రసన్నకుమార్ ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూ స్వీయ దర్శకత్వం నిర్వహించాడు.

10/01/2018 - 20:00

నంది క్రియేషన్స్ పతాకంపై రాఘవ్, కరోణ్య కత్రిన్‌ను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తున్న చిత్రం బంగారి బాలరాజు. కెఎండి రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలు. కోటేంద్ర దుద్యాల దర్శకుడు. ఈనెల 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ -చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 25న విడుదలకు సిద్ధమైంది.

Pages