S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/01/2018 - 19:58

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతోంది. ఇప్పటికే ఈ తరహా సినిమాలపై హీరోలూ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఎఫ్ 2 చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. దాంతోపాటు ఇటీవలే నాగ్, నాని కాంబినేషన్‌లో వచ్చిన దేవదాస్ మంచి సక్సెస్ సాధించడంతో, మరింత ఊపు కనిపిస్తోంది. లేటెస్టుగా హీరో రామ్ ఓ మల్టీస్టారర్ సినిమాకు ఓకె చెప్పాడని టాక్.

10/01/2018 - 19:57

అభయ్ ప్రొడక్షన్స్ పతాకంపై విశాఖపట్నంలోని నూతన నటీనటులతో ధనుంజయ్, హృతిక సింగ్ హీరో హీరోయిన్‌గా దినేష్.పి దర్శకత్వంలో నిర్మించిన సినిమా ప్రయత్నం. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు దీక్షిత్ తెలియజేస్తూ- తన శిష్యుడైన ధనంజయ్ చేస్తున్న ప్రయత్నం విజయం సాధించాలని కోరుకున్నారు. సినిమాలో భాగమైన అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలన్నారు.

10/01/2018 - 19:56

వసంత్ సమీర్, నెహర్ హీరో హీరయిన్లుగా పరిచయమవుత్నున ‘కర్త కర్మ క్రియ’ టైటిల్, ఫస్ట్ టీజర్ విడుదలైంది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో వస్తోన్న చిత్రమిది. ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకుడు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ ‘మా సంస్థనుంచి వచ్చిన అన్ని సినిమాలకంటే ఇది వైవిధ్యం.

10/01/2018 - 19:55

మొన్న ‘ఆ నలుగురు’. నిన్న ‘మీ శ్రేయోభిలాషి’.. తాజాగా ‘బేవర్స్’. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రగా అక్టోబర్ 12న విడుదలవుతోన్న చిత్రం. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లు. కాసం సమర్పణలో ఎస్‌ఎస్‌కె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు పొన్నాల చందు, ఎంఎస్ మూర్తి, ఎమ్ అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం. రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తోన్న చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

10/01/2018 - 19:53

తెలుగు స్క్రీన్‌పై ప్రశంసాపూర్వక చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఒకప్పటి కథానాయకి పద్మశ్రీ శోభన. ఇప్పుడు మరోరూపంలో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న శోభన, తెలంగాణ ప్రభుత్వ టి.ఫైబర్‌తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరులో ‘జాదూజ్’ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు.

09/30/2018 - 22:15

క్వీన్ కంగనా రనౌత్ ఏం చేసినా -అటాకింగ్‌గానే ఉంటుంది. ఆమె నాలుక పదునుగురించి తెలిసినోళ్లెవ్వరూ ఆమె జోలికి వెళ్లరని బాలీవుడ్‌లో టాక్. నిజానికి అలాంటి అనుభవం ఎందరికో. స్టార్ హీరో హృతిక్ రోషనే కంగనతో తగవుపెట్టుకోలేక తప్పుకున్నాడు. ఇదంతా అటుంచితే, తాజాగా తనూశ్రీ దత్తాపై నానాపటేకర్ వేధింపుల వ్యవహారానికి సంబంధించి కంగన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

09/30/2018 - 22:13

పాతిక చిత్రాల ప్రయాణం ఎంతో థ్రిల్లునిస్తోందని, దసరాకు విడుదలయ్యే పందెంకోడి 2తో తన కెరీర్‌లో 25 సినిమాలు పూర్తి చేశానని హీరో విశాల్ పేర్కొన్నాడు. ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో 2005లో హిట్టుకొట్టిన పందెంకోడి చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 18న విడుదల కానుంది.

09/30/2018 - 22:11

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కెమిస్ట్రీ వర్కవుటైందని దర్శకుడు శీరామ్ ఆదిత్య అన్నాడు. భలే మంచిరోజు, శమంతకమణి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రమే -దేవదాస్. సినిమాకు ఇండస్ట్రీలో మంచి టాక్ నడుస్తున్న సందర్భంలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మీడియాతో మాట్లాడాడు.

09/30/2018 - 22:06

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అత్తారింటికి దారేది’ సూపర్‌హిట్ అయింది. ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో పవన్ పాత్రను శింబూ చేస్తున్నాడు. తెలుగులో నదియా పోషించిన ‘సునంద’ (అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషించనున్నారు. అలాగే సమంత పాత్రలో మేఘా ఆకాశ్ నటించనుంది. ఇక ప్రణీత చేసిన పాత్రకోసం ఎవరిని తీసుకోవాలా?

09/30/2018 - 22:03

సమాజంలో పెరుగుతున్న మోసాలనే కథావస్తువుగా చేసుకుని ‘బ్లఫ్ మాస్టర్’ తెరకెక్కిస్తున్నామని అంటున్నాడు దర్శకుడు గోపి గణేష్ పట్ట్భా. తమిళంలో ఘన విజయం సాధించిన ‘చతురంగ వేట్టై’ ఆధారంగా తెలుగులో తెరకెక్కిన చిత్రం బ్లఫ్ మాస్టర్.

Pages