S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/28/2018 - 19:52

లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్‌పై తనుశ్రీ దత్తా వరుస బాంబులు పేలుస్తోంది. గతంలో ఎదుర్కొన్న పరిస్థితులను బహిర్గతం చేస్తున్న ఆమెకు, తోటి ఆర్టిస్టుల నుంచి మద్దతు దొరుకుతోంది. ప్రముఖ నటుడు నానా పటేకర్, డ్యాన్స్‌మాస్టర్ గణేశ్ ఆచార్య తనను లైంగికంగా వేధించారని హీరోయిన్ తనుశ్రీ దత్తా మరో బాంబ పేల్చింది.

09/28/2018 - 19:50

గత 20 ఏళ్ళుగా సినీ, టీవీ, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్ అండ్ అప్రీసియేషన్ సొసైటీ (్ఫస్) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదీ ఫాస్ అక్కినేని 2018 అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు.

09/28/2018 - 19:49

విజయసిద్ధి పిక్చర్స్ పతాకంపై సూర్యన్ దర్శకత్వంలో కె సూరిబాబు, చలమళ్ల రామకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ హరర్ -గండభేరుండ. చైతన్యరామ్, పవన్‌కుమార్ హీరోలుగా, రాధిక హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం పాటలు ట్రెండ్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. అక్టోబర్ 5న చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలకానుంది.

09/28/2018 - 19:47

టాలీవుడ్‌లో సంచలనం రేపిన అర్జున్‌రెడ్డి సినిమా అటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోకి రీమేక్ కానున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం హిందీ సినిమా షూటింగ్ మొదలైంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ వంగ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. షాహిద్‌కపూర్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా మొదట సుతారియాను ఎంపిక చేశారు.

09/28/2018 - 19:46

ఒక సినిమా హిట్టు కొట్టిందంటే -తరువాత దానికి సీక్వెల్ వస్తుందనే అర్థం. అనేక చిత్రాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. టైం బావున్నపుడు పడిన హిట్టును టైంబాగలేని టైంలో -దానికి సీక్వెల్ చేసి మళ్లీ నిలబడిన హీరోలు ఎంతోమంది. ఇక మాస్ హీరో విశాల్‌ను హీరోగా నిలబెట్టిన చిత్రాల్లో పందెంకోడి ప్రధానమైంది.

09/28/2018 - 19:44

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో.. ఆయన తండ్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. చరిత్ర కలిగిన గొప్ప గొప్ప పాత్రలు ఉన్న చిత్రంలో, ఆ పాత్రల స్థాయికి తగ్గట్టుగానే ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రంలో ఆ కాలం లెజండరీ దర్శకుల పాత్రలనూ చూపించనున్నారు.

09/27/2018 - 20:13

ఇటీవలఎన్టీఆర్ బయోపిక్ వార్తల్లోకి వచ్చిన ప్రతిసారీ సంచలనం సృష్టిస్తోంది. నందమూరి బాలకృష్ణ ఆసక్తిగా చేస్తోన్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది కూడా. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రోజురోజుకూ సినీవర్గాల్లో ఓ రేంజ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ తరువాత బాలయ్య మరోసారి బోయపాటితో సినిమా చేయడానికి ఓకె చెప్పిన విషయం తెలిసిందే.

09/27/2018 - 20:11

1939నాటి ప్రఖ్యాత నవల కనె్ఫషన్స్ ఆఫ్ థగ్స్ బాలీవుడ్ స్క్రీన్‌పై థగ్స్ ఆఫ్ హిందూస్థాన్‌గా రూపుదిద్దుకుంటూ నిర్మాణ దశలోనే సెనే్సషన్ సృష్టిస్తోంది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో బాలీవుడ్ స్టార్‌వాల్ట్స్ ముఖ్య పాత్రలు పోషిస్తుండటమే దీనికి కారణం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతూ ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రానికి సంబంధించి ఇప్పటికే వరుసపెట్టి వదిలిన ఫస్ట్‌లుక్‌లు ఆసక్తిని రేకెత్తించాయ.

09/27/2018 - 20:09

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఒక తమిళ సినిమాపై మనసు పారేసుకుని రీమేక్ హక్కులు దక్కించుకోవడం తెలిసిందే. అదే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న ‘96’. ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చడంతో సుమారు కోటి పెట్టి రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. తాజాగా చిత్రాన్ని నానికి చూపెట్టాడట దిల్‌రాజు. నానికీ సినిమా నచ్చిందని సమాచారం. కానీ, చేయడానికి ఒప్పుకుంటాడా? లేదా? అన్నదే సందిగ్దం.

09/27/2018 - 20:07

గత కొన్ని రోజులుగా ‘ప్రభాస్ పెళ్లి’ కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అలా ఓ తాజా కథనం మరింత వైరల్ అవుతోంది. ప్రభాస్ పుట్టిన రోజునాడు ఆయన కుటుంబం పెళ్లికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆ కథనం. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఆ రోజునే ప్రభ పెళ్లి వివరాలు కుటుంబ సభ్యులు ప్రకటించొచ్చని తెలుస్తోంది.

Pages