S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2018 - 20:06

పదహారేళ్ల వయసులోనే అత్యాచారానికి గురయ్యానంటోంది ఇండో అమెరికన్ మోడల్ పద్మా లక్ష్మి. కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బటయపెట్టి సంచలనం సృష్టించింది. తన కుటుంబంతో లాస్ ఏంజిల్స్‌లో ఉన్నపుడు, పదహారేళ్ల వయసులో ఓ షాపింగ్ మాల్‌లో పార్ట్‌టైంగా ఉద్యోగం చేసేదాన్నని, ఆ సమయంలో పరిచయమైన 23 ఏళ్ళ వ్యక్తి ప్రేమపేరిట తనని లోబరచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడని బహిర్గతం చేసింది.

09/27/2018 - 20:04

తెలుగు పరిశ్రమలో చిన్న సినిమాకు మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. పెద్ద సినిమాలతో పోటీపడే స్థాయిలో చిన్న సినిమా బలమైన కంటెంట్‌తో వస్తున్నాయి. తాజాగా ఆ కోవలో ‘నాటకం’ ప్రస్తావించొచ్చన్నది అతిధుల మాట. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న ‘నాటకం’ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఆశిష్ గాంధి, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రలతో నిర్మించిన ఈ చిత్రానికి కళ్యాణ్ జి గోగన దర్శకుడు.

09/27/2018 - 20:03

తొలి చిత్రంతోనే ప్రేక్షకుడి మనసు దోచిన ఆర్‌ఎస్ నాయుడికి ఆఫర్లు వరుసపెడుతున్నాయట. సుధీర్‌బాబు, నభా నటేష్ జంటగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’తో దర్శకుడిగా పరిచయమయ్యాడు ఆర్‌ఎస్ నాయుడు. మొదటి సినిమాకే విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి టాక్ రావడంతో దర్శకుడు నాయుడికి మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపితున్నారన్నది పరిశ్రమలో వినిపిస్తోన్న మాట.

09/27/2018 - 20:01

ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను తారాగణంలో వస్తోన్న చిత్రం -ఐశ్యర్యాభిమస్తు. మతివరం మాధవి సమర్పణలో శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు ఎం రాజేష్, నిర్మాత వరం జయంత్‌కుమార్. ఈ చిత్రం కోసం డి.ఇమ్మాన్ డిజైన్ చేసిన సంగీత బాణీల పాటల సీడీని కెఇ జ్ఞానవేల్‌రాజా గురువారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో విడుదల చేశారు.

09/27/2018 - 19:59

జాతీయ నటుడు కమల్‌హాసన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న విశ్వరూపం 2 తీవ్ర నిరాశ మిగిల్చింది. సినిమాపై గట్టి నమ్మకంతో ఎంతో ఖర్చుపెట్టి తెరకెక్కించినా ఫలితం మాత్రం దక్కలేదు. విడుదలైన అన్ని భాషల్లో అదే ఫలితం ఎదురవ్వడంతో, తరువాతి చిత్రం విషయంలో కమల్ ఆలోచనలో పడ్డాడని అంటున్నారు. ఇప్పటికే తెరకెక్కించిన శభాష్ నాయుడు ఇంతవరకూ విడుదలకు నోచుకోలేదు.

09/26/2018 - 20:03

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ బాలీవుడ్ ఎంట్రీ దడక్’తో మంచి విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతో వరుస అవకాశాలు అందుకున్న జాహ్నవి, ఇటు దక్షిణాదినా పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కానున్నట్టు సమాచారం. ప్రస్తుతం హిందీలో ‘తక్త్’ అనే చారిత్రాత్మక చిత్రంలో నటిస్తోంది.

09/26/2018 - 20:02

టాలీవుడ్‌కు పరభాషా అందాలు కొత్తకాదు. వచ్చిన వాళ్లంతా తమదంటూ ఏదోక ముద్ర వేయకుండా వెళ్లిందీ లేదు. కానీ ఏ కొందరికో ఏదోక ప్రత్యేకత దక్కుతుంది. అలా చాలాకాలం తరువాత.. సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకుంటున్న కొత్తందమే -నభానటేష్. ఒక్క సినిమాతోనే చలాకీ పిల్ల, అల్లరి పిల్ల అంటూ ముద్దుపేరు సంపాదించుకుంది. అష్టాచెమ్మా సినిమాలో స్వాతి ఆకట్టుకున్నా..

09/26/2018 - 20:00

అతను -మన ఫ్రెండ్. అతను -మన ఫ్రెండ్స్‌లో హీరో. అతను -మనకు బాగా తెలిసిన ఆర్టిస్ట్. నానిని చూస్తే -ఆడియన్స్ ఫీలింగ్ ఇలాగే ఉండొచ్చు. నేచురల్ స్టార్ అన్న బరువు మోస్తున్న నాని ఇమేజ్‌కు ఈ వారం నిజంగానే ఓ పరీక్ష. ఓవైపు ఆయన నటించిన -దేవదాస్. మరోవైపు ఆయన హోస్ట్‌గా (రియాలిటీ షో) చేస్తున్న -బిగ్‌బాస్.

09/26/2018 - 19:58

రెహమాన్ -ఓ సెనే్సషన్. రెహమాన్ -ఓ స్పెషల్ నొటేషన్. రెహమాన్ -ట్రిమండస్ కంపోజిషన్. రెహమాన్... ఇలా ఆ పేరుకి చాలా క్వాలిటీస్ జోడించొచ్చు. ట్రాక్ ఏదైనా.. జానర్ ఎలాంటిదైనా.. డివోషనల్ టచ్ కమ్ సూఫీ సూదింగ్‌ను మిక్స్‌చేసి పరిపూర్ణత తెచ్చే సౌండింగ్ మాస్టర్. దాదాపు మూడు దశాబ్దాల క్రితం సంగీత ప్రపంచంలో ఓ ప్రకంపన -రెహమాన్. సినీ సంగీతానికి కొత్త కమర్షియల్ టచ్ ఇచ్చి అందరిచేతా ఔరా! అనిపించుకున్నాడు.

09/26/2018 - 19:56

రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూరె్తైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో హీరో హీరోయిన్లపై చివరి పాటను చిత్రీకరించారు. చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల, బుధావారం తన పుట్టినరోజు సందర్భంగా మీడియాకు అమర్, అక్బర్, ఆంటోనీ పాత్రల్ని పరిచయం చేశారు. ‘ఇదో కొత్త కానె్సప్ట్. మరింత ఆసక్తి పెంచడం ఖాయం.

Pages