S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రభూమి

10/05/2016 - 21:49

నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ జంటగా ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ‘జతగా’ చిత్రాన్ని నిర్మాత సురేష్ కొండేటి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సెన్సార్‌బోర్డు యు/ఎ సర్ట్ఫికెట్ అందించిందని, మలయాళంలో విజయవంతమైన ‘ఉస్తాద్ హోటల్’ను దర్శకుడు సందేశాత్మక కథనంతో అందమైన ప్రేమకథా చిత్రంగా మలిచారని అన్నారు.

10/05/2016 - 21:48

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

10/05/2016 - 21:47

అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు.

10/05/2016 - 21:45

మొత్తానికి కరీనాకపూర్ నిప్పులాంటి నిజం చెప్పింది. కథానాయికలు ఇంటర్వ్యూల్లో రకరకాల మాటలు చెబుతుంటారు. ఓ సిన్మాలో కథ నచ్చలేదని, డేట్లు కుదరలేదని సాకులు చెబుతారు. కొంతమంది కాల్షీట్లు అడ్జెస్టుకాక సినిమాలు వదిలేశామని ఏవేవో చెబుతారు. కరీనాకపూర్ మాత్రం ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టేట్టు చెప్పేస్తుంది. ఈ విషయంలో ఆమె డేర్ డెవిల్ అన్న పేరును సార్థకత చేసుకుంటోంది.

10/05/2016 - 21:44

రాబిన్‌సోహి, నవనీత్ కౌర్ థిల్లాన్ జంటగా సుమన్‌రెడ్డి దర్శకత్వంలో బి.ఎస్.ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఏక్త’. నిర్మాతలు భిక్షమయ్య సంగం, సుమన్‌రెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్తిచేశారు.

10/05/2016 - 21:43

రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రానికి 2.0 అన్న పేరును దర్శకుడు శంకర్ ఖరారు చేసిన మాట తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చెన్నైలో సాగుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఆ షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

10/05/2016 - 21:42

మేసా రాజేష్ ప్రధాన పాత్రలో రోహిణి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘కాపాలి’ (మిమ్మల్ని మీరే కాపాడుకోండి). ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మేసా రాజేష్ మాట్లాడుతూ- దాదాపు అనేక భాషల్లో చిత్రాలు చూసిన నేపథ్యంలో ఓ వైవిధ్యమైన చిత్రం తీయాలనే కోరికతో కాపాలి రూపొందించామని తెలిపారు.

10/05/2016 - 21:41

జనతాగ్యారేజ్ అందించిన కిక్‌తో జూ.ఎన్టీఆర్ వరుసగా చిత్రాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నాడు. రాఘవేంద్రరావు ప్రస్తుతం నాగార్జునతో ఓం నమో వేంకటేశాయ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

10/05/2016 - 21:37

‘ప్రేమమ్’ చిత్రం కథ ఒక్కటే అయినా మూడు వేరియేషన్స్‌లో కథానాయకుడి పాత్ర ఉంటుంది. కొత్తగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ మూడు పాత్రల్లో ఇప్పటివరకూ నా జీవితంలో జరిగిన దానినే గుర్తుచేసుకుంటూ నటించాను. అయితే టీచర్‌ను ప్రేమించే పాత్ర ఇంతవరకూ చేయలేదు. అది మాత్రం దర్శకుడు చెప్పినట్టు

10/05/2016 - 00:05

‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రానికి దర్శకుడే కర్త కర్మ క్రియలా నిలిచారు. అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో నటించా. కానీ వీరూ పోట్ల నాలోని కొత్త నటుణ్ణి బయటికి తీశాడు అని నటుడు సునీల్ తెలిపారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వీరూపోట్ల దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం రూపొందించిన చిత్రం ‘ఈడు గోల్డ్ ఏహే’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది.

Pages