S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/25/2018 - 19:49

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు సినిమా ‘కొబ్బరి మట్ట’. రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకుడు. ఆది కుంభగిరి, సాయిరాజేష్ నీలం నిర్మాతలు. నవంబర్ 14న విడుదలకానున్న చిత్రానికి సాంగ్ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో ముమైత్‌ఖాన్ మాట్లాడుతూ సంపూ, అతని టీంకి పెద్ద సక్సెస్ లభించాలన్నారు. డైరెక్టర్ రూపక్ రొనాల్డ్‌సన్ మాట్లాడుతూ సినిమా ఆలస్యమైంది కానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎలాంటి లోటూ ఉండదన్నాడు.

09/24/2018 - 20:50

రంగస్థలం సంచలన విజయం తరువాత రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానుంది. ప్రస్తుతం యూరప్‌లోని అజర్‌బైజాన్ ప్రాంతంలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. చరణ్‌తోపాటు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ పాల్గొంటున్నట్టు సమాచారం.

09/24/2018 - 20:49

దేవదాస్ అంటే -ఓ అక్కినేని. దేవదాస్ అంటే -ఓ విషాదం. దేవదాస్ అంటే -్భగ్న ప్రేమ. దేవదాస్ అంటే -మనదికాని మనదైన తెలుగు కథ. ఇదీ క్లుప్తంగా -దేవదాస్ అన్న నాలుగక్షరాలు వినిపిస్తే కలిగే భావన. నిజానికి అదో మాస్టర్ పీస్. తాజాగా మరో దేవ-దాస్‌లు వస్తున్నారు. వీళ్లు నవ్విస్తారు. కవ్విస్తారు. గుండె చెదిరే విషాదం నుంచి ఒకింత ఉపశమనం కలిగిస్తారు. వాళ్లే -నాని, నాగార్జున.

09/24/2018 - 20:47

తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హిందీలో షాహిద్‌కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కైరా అద్వానీని ఎంపిక చేసినట్టు సమాచారం. కైరా అద్వానీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమై ఇటీవలే తెలుగులోకి మహేష్ సరసన భరత్ అనే నేను సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

09/24/2018 - 20:46

అనుపమ ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి రామకృష్ణ నిర్మిస్తోన్న చిత్రం -నువ్వెందుకు నచ్చావే శైలజ. రోషన్, అనూష జంటగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ మొదలైంది. ముహూర్తపు షాట్‌కు సి కళ్యాణ్ క్లాప్‌నివ్వగా, కొమర వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.

09/24/2018 - 20:44

పెళ్లంటే -నూరేళ్ల పంట. ఇద్దరి మధ్యా అన్నీ నిజాలే ఉండాలి. అరమరికలు, అబద్ధాలు ఉండకూడదన్నది నేటి యుతవ థియరీ. ఈ కంటెంట్‌తో తెరకెక్కిన చిత్రం -శుభలేఖ+లు. శరత్ నర్వాడేను దర్శకుడిగా పరిచయం చేస్తూ హనుమా తెలుగు మూవీస్ పతాకంపై సి విద్యాసాగర్, జనార్ధన్ ఆర్‌ఆర్ నిర్మిస్తోన్న చిత్రమిది. శ్రీనివాస సాయి, దీక్ష శర్మ రైనా హీరో హీరోయిన్లు.

09/24/2018 - 20:43

మనం సైతం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతున్నాయి. ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న మనం సైతం.. సేవా సంస్థ శనివారం మరికొందరు పేదలకు ఆర్థిక సాయం అందించింది.

09/24/2018 - 20:41

తెలుగులో ఆర్‌ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకుంది. దీంతో చిత్రాన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే తమిళంలో ఆది పినిశెట్టి రీమేక్ చేస్తుంటే, తాజాగా కన్నడలో చిత్రాన్ని రీమేక్ చేసేందుకు నిర్మాత డిఎస్ రావు ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

09/24/2018 - 20:39

మొన్నటికి మొన్న మెంటల్ కృష్ణ. ఇప్పుడు -బిల్డప్ కృష్ణ. రెండు సినిమాల్లో కామన్ కృష్ణ మాత్రం పోసాని కృష్ణమురళి. శ్రావ్య మూవీస్ బ్యానర్‌పై లక్ష్మీ టాకీస్ సమర్పిస్తోన్న చిత్రమిది. సరీష్, గీత హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రంలో ప్రధాన పాత్ర మాత్రం పోసానిదే. వినె్సంట్ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.

09/23/2018 - 22:39

సాధారణంగా ఓ సూపర్ చిత్రానికి సీక్వెల్ చేసి.. ఆ సినిమా క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ ఈ దర్శకుడు మాత్రం భారీ ఫ్లాప్ అయిన సినిమాకు సీక్వెల్ చేస్తానని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమా కథ అంటే.. ఈమధ్యే మిల్కీ భామ తమన్నా కీ రోల్‌లో, ప్రభుదేవా హీరోగా వచ్చిన అభినేత్రి చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

Pages