S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2018 - 22:35

గీత గోవిందం సినిమాతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది కన్నడ నటి రష్మిక మండన్న. చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లోనే నటిస్తానంటోంది. నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన దేవదాస్‌లోనూ ప్రాధాన్యత కలిగిన పాత్ర చేస్తోన్న రష్మిక, ఇక్కడే మరో రెండు ప్రాజెక్టులకూ ఓకె చెప్పేసింది.

09/23/2018 - 22:33

అందాల భామ శృతిహాసన్ ఈమధ్య సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడంలేదు. ఆమె నటించిన చివరి చిత్రం కాటమరాయుడు. దాంతోపాటు కమల్‌హాసన్‌తో కలిసి శభాష్ నాయుడు సినిమాలో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలని తెగ ప్రయత్నాలు చేసింది కానీ వర్కవుట్ కాకపోవటంతో ఫీలైనట్టుంది. అందుకే సౌత్‌లో ఏ సినిమా చేయడానికి ఆసక్తి చూపడంలేదు.

09/23/2018 - 22:32

కోహ్లీ. వరల్డ్ క్రికెట్‌లో ఆ పేరే ఓ సెనే్సషన్. భారత జట్టులో తనదైన శైలి బ్యాటింగ్ స్టైల్‌తో కొన్ని కోట్లమందిని అభిమానులుగా మలుచుకున్న హీరో. కోహ్లీ క్రీజులో ఉంటే టీమిండియాదే గెలుపన్న భరోసా ప్రతి ఒక్క భారతీయుడికి. క్రికెటర్‌గా అరంగేట్రం చేసిన కొనే్నళ్లలోనే రికార్డులను తిరగరాశాడు. ఇప్పుడు వెండి తెర రికార్డుల మీద కనే్నశాడన్న సందేహం వస్తుంది.

09/23/2018 - 22:31

నోటా డేట్ కన్‌ఫర్మ్ అయింది. అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలకానుంది. విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాన్ని ఆనంద్‌శంకర్ తెరకెక్కిస్తున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న నోటాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండకు ఇది తొలి ద్విభాషా చిత్రం.

09/23/2018 - 22:29

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతూ రాము కొప్పుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ విడుదలై మంచి స్పందనే అందుకుంది. అన్ని వర్గాలనుంచి అభినందనలు వస్తుండడంతో ఆనందంలో వున్న చిత్ర బృందాన్ని కొన్ని ఇబ్బందులు చుట్టుముట్టాయ. ఈ చిత్రంలోని ఓ పాటలో జైన మతస్థులు ఆరాధించే మంత్రాన్ని కించపర్చేలా చేశారని ఆరోపిస్తూ పలువురు ఆందోళనకు దిగారు.

09/23/2018 - 22:29

సుధీర్‌బాబు, నభానటేశ్ జంటగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈనెల 21న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్ మీట్‌లో.. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ మాట్లాడుతూ ‘సినిమా సక్సెస్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. కిర్రాక్ పార్టీలో చేసిన మ్యూజిక్ నచ్చడంతో దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు అప్రోచ్ అయ్యారు. తన షార్ట్ఫిలిం చూశాను.

09/23/2018 - 22:28

అభిరుచి కలిగిన తెలుగు నిర్మాతల్లో అశోక్ వల్లభనేనినీ ప్రస్తావించాలి. నానితో సెగ, గౌతమ్ మీనన్‌తో ఎర్ర గులాబీలులాంటి మంచి చిత్రాలను ప్రేక్షకుడికి అందించిన నిర్మాత అశోక్. తాజాగా తమిళంలో మణిరత్నం తెరకెక్కించిన ‘చెక్క చివంత వాణం’ చిత్రాన్ని ‘నవాబ్’ పేరిట తెలుగు ప్రేక్షకుడి ముందుకు తెస్తున్నారు.

09/23/2018 - 22:27

ప్రస్తుతం భిన్నమైన సినిమాలతో పాటు భిన్నమైన పాత్రలపై దృష్టి పెట్టాడు విక్టరీ వెంకటేష్. ఆయన మల్టీస్టారర్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే వరుణ్‌తేజ్‌తో కలిసి ఎఫ్2 సినిమాలో నటిస్తున్న ఆయన, తాజాగా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో కలిసి మరో మల్టీస్టారర్‌కు ఓకె చెప్పిన విషయం తెలిసిందే. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో వెంకటేష్ ఆర్మీ కల్నల్‌గా కనిపిస్తాడట.

09/21/2018 - 20:43

బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజవౌళి తెరకెక్కించే భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలు ఊపందుకున్నాయి. ప్రముఖ నటులు ఎన్టీఆర్, రామ్‌చరణల కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాకు స్క్రిప్ట్‌వర్క్ జరుగుతోంది. తాజాగా ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా టీమ్‌లో జాయిన్ అయ్యాడు. బ్రిటీష్ కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కనుందట.

09/21/2018 - 20:41

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దకాలంపైగా దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ శ్రీయా నటిగానే కాకుండా గ్లామర్ గాళ్‌గానూ క్రేజ్ సంపాదించింది. ఈమధ్యే ఈమెకు సరైన విజయాలు లేక బ్రేకులు పడ్డాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకుని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.

Pages