S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/24/2018 - 19:33

తెలుగు చిత్రసీమలో అందరి ఆసక్తిని తనవైపునకు తిప్పుకుంటున్న క్రేజీ మల్టీసారర్ ‘దేవదాస్’. నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులతో నిండిపోయింది. నాగార్జున డాన్.. నాని డాక్టర్‌గా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా దేవదాస్ షూటింగ్ అంతా పూర్తయింది. ఈ మధ్యే బ్యాంకాక్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుని వచ్చారు.

08/24/2018 - 19:32

ఎన్టీఆర్-పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెంపర్’ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. వరుసగా ఫ్లాప్‌లతో సతమతమవుతున్న ఎన్టీఆర్‌ను హిట్ ట్రాక్ ఎక్కించిన చిత్రం టెంపర్ కావడం విశేషం. అయితే ఈ చిత్రం తమిళ రీమేక్ అవ్వబోతోందన్నది తెలిసిన విషయమే. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విశాల్, రాశీఖన్నా హీరో హీరోయిన్ పాత్రలను పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ సిద్ధం అయింది.

08/24/2018 - 19:23

కన్నడ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణమ్ దేవరాజ్ కథానాయకుడిగా ‘వైరం’ చిత్రం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సాయి శివన్.జె దర్శకుడు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున పిక్చర్స్ పతాకంపై జె.ఎం.కె నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి దర్శకుడు వి.సాగర్ క్లాప్‌నిచ్చారు. వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీవాస్ గౌరవ దర్శకత్వం వహించారు.

08/24/2018 - 19:22

తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటిస్తున్న 62వ చిత్రం ‘సర్కార్’. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ చిత్రం టీజర్ వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 13న విడుదలవుతుండగా, చిత్ర ఆడియో విడుదల వేడుక అక్టోబర్ 2న చెన్నయ్‌లో గ్రాండ్‌గా జరుగనుంది. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

08/24/2018 - 19:20

అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్వకత్వంలో రూపొందిన చిత్రం ‘తారామణి’. ఈ చిత్రం తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెప్టెంబర్ 21న తారామణి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- తారామణి తమిళ్‌లో సెనే్సషనల్ సక్సెస్‌ను సాధించిన చిత్రం.

08/24/2018 - 19:19

ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా అయోధ్యకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘24 కిస్సెస్’. సిల్లీమాంక్స్ కంబైన్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంజయ్‌రెడ్డి, అనిల్ పిల్లాలా, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. చిత్ర ట్రైలర్ విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు అయోధ్యకుమార్ మాట్లాడుతూ, నేను రూపొందించిన ‘మిణుగురులు’చిత్రం ఎంతటి పేరు తెచ్చిందో తెలిసిందే.

08/24/2018 - 19:17

లేడీ సూపర్‌స్టార్ నయనతార టైటిల్ పాత్రధారిగా నెల్సన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘కో..కో..కోకిల’. ఇటీవల తమిళంలో ‘కోలమావుకోకిల’ పేరుతో విడుదలైన ఈ చిత్రం సెనే్సషనల్ హిట్‌టాక్‌తో అద్వితీయమైన కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘కో..కో...కోకిల’ పేరుతో ఈనెల 31న విడుదల చేస్తున్నాం.

08/24/2018 - 19:16

షఫీ ముఖ్య పాత్రలో ఆయుష్‌రామ్, శ్రావణి హీరోహీరోయిన్లుగా హార్ట్ బ్రేకర్ క్రియేషన్స్ పతాకంపై జాంబీ జానర్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి చిత్రం ‘విషపురం’. శ్రీనివాస్ సందిరి దర్శకత్వంలో పాతూరి బుచ్చిరెడ్డి, పాతూరి మాధవరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శ్రీనివాస్ సందిరి మాట్లాడుతూ..

08/23/2018 - 21:41

వైరం ధనుష్‌గా నెగెటివ్ షేడ్.. మరోవైపు కుమార్ బాబుగా ఊరికోసం పాటుపడే వ్యక్తి.. ఇలా భిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు భిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన సోలో హీరోగా నటిస్తున్న చిత్రం నీవెవరో. తాప్సీ, రితికాసింగ్ నాయికలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి.

08/23/2018 - 21:40

నారా రోహిత్ హీరోగా, దర్శన బానిక్ హీరోయిన్‌గా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ఆటగాళ్ళు. నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు (24న) విడుదవుతోంది.

Pages