S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/22/2018 - 20:23

సుజయ్, చంద్రకాంత్, తనిష్క, రష్మి, సోని ముఖ్యపాత్రల్లో రాజశేఖర్ దర్శకత్వంలో సాయిహాసిని ప్రొడక్షన్స్ పతాకంపై నానే్చరి దేవా శంకర్‌గౌడ్ నిర్మించిన ‘నాకు మనసున్నది’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో 25 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ వేడుకలు ఫిలిం ఛాంబర్‌లో జరిపింది. ఈ కార్యక్రమంలో నిర్మాత సాయి వెంకట్ చిత్ర యూనిట్‌కు షీల్డులు అందజేశారు.

08/22/2018 - 20:21

నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి హీరోహీరోయిన్‌లుగా సతీష్‌కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘4 ఇడియట్స్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలయింది. నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆడియోను విడుదలచేసారు. అనంతరం సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు.

08/22/2018 - 20:20

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ హీరో హీరోయిన్లుగా హరినాధ్ దర్శకత్వంలో కోనా ఫిలిం కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా బ్యానర్లపై తెరెకెక్కిన చిత్రం ‘నీవెవరో’ ఈ నెల 24న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్విహించారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ- కోన వెంకట్‌కు సినిమాలో ప్రత్యేకమైన స్కెచ్, గోల్ వుంటుంది.

08/22/2018 - 20:18

భరద్వాజ్ బంకుపల్లి, నవీన్‌బాబు, విశాల్ కురడా, స్వాతి భీమిరెడ్డి, సాహితి దాసరి, సుష్మా, జస్సీ, మెర్సీ ముఖ్యపాత్రల్లో శ్రీకర్‌బాబు దర్శకత్వంలో వేద ఎంటర్‌ప్రైజెస్ ప్రొ. నెం.3వ చిత్రం వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో ప్రారంభమైంది. దగ్గుబాటి వరుణ్ నిర్మాత. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి కొండా మురళీధర్‌రావు (వరంగల్ ఎంఎల్‌సి) క్లాప్ కొట్టగా, కొండా సురేఖ స్విచ్చాన్ చేశారు.

08/22/2018 - 20:17

సౌత్‌లో అప్పట్లో శృంగార తారగా స్టార్ ఇమేజ్ అందుకున్న సిల్క్ స్మిత అంటే ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలుసు. ఆమె కోసం స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో తప్పకుండా ఉండాల్సిందే అని పట్టుబట్టి నటింపజేసిన సందర్భాలు ఉన్నాయి. సంచలన తారగా మారిన సిల్క్‌స్మిత జీవిత కథతో వచ్చిన డర్టీ పిక్చర్ సంచలన విజయం అందుకుంది. తాజాగా సిల్క్ స్మిత జీవితంపై మరో సినిమా తెరకెక్కనుంది. అయితే ఈసారి సినిమా వచ్చేది తమిళంలో.

08/22/2018 - 20:16

బడ్జెట్ 4 కోట్లు లోపు నిర్మించే చిత్రాలకు టాక్స్ లేదు.
*ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మించు లొకేషన్స్‌కు ఉచితంగా పర్మిషన్.
*ఎఫ్‌డిసి ద్వారా షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతి.
*ఎఫ్‌డిసి పర్యవేక్షణలో ఉత్తమ చిత్రాలకు 10 లక్షలు సబ్సిడీ ఏడాదికి 15 చిత్రాలకు మాత్రమే.
*వైజాగ్ రామానాయుడు స్టూడియో సమీపంలో 316 ఎకరాలలో స్టూడియోలు నిర్మించడానికి అనుమతి.

08/21/2018 - 20:17

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకుడిగా అమితాబ్‌బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, జగపతిబాబు, సుధీప్ ప్రధాన తారాగణంగా మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఉదయం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో టీజర్‌ను విడుదలచేశారు.

08/21/2018 - 20:15

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవాసంస్థ వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలిచింది. తమవంతు సాయాన్ని ఆ రాష్ట్ర ప్రజలకు అందించాలని ముందడుగు వేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ ప్రాంగణంలో కేరళకు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మనం సైతం చేపట్టింది.

08/21/2018 - 20:13

సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’. కావ్యాథాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వి.ఎస్.వర్క్స్ బేనర్‌పై రాము కొప్పుల దర్శకత్వంలో దివ్యావిజయ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కోన వెంకట్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

08/21/2018 - 20:11

జై, రష్మీగౌతమ్ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘అంతకుమించి’. ఎస్‌జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం టైటిల్ లిరికల్ సాంగ్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు జానీ మాట్లాడుతూ.. సినిమాలో రష్మీ పెర్ఫార్మెన్స్ గురించే మాట్లాడతారు అంతా. 2 వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది తను.

Pages