S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

10/26/2016 - 22:10

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లిన విషయం తెలిసిందే. చాలానెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

10/26/2016 - 22:05

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఫాన్స్‌లో కూడా భారీ క్రేజ్ నెలకొంది. ఇక మెగాస్టార్ సినిమాలంటే టాలీవుడ్‌లో అదో క్రేజ్. ఆయన సినిమాలకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి.. బిజినెస్, వసూళ్లు కూడా భారీగానే ఉంటాయి.

10/26/2016 - 22:04

తమిళ హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడం ఈరోజు కొత్తేమీ కాదు. నాటి కమల్, రజనికాంత్‌లనుండి వారు తెలుగులో కూడా తమ సినిమాలు విడుదల చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఈమధ్యకాలంలో ప్రతి తమిళ హీరో తెలుగులోకి సినిమా విడుదల చేస్తున్నాడు.

10/26/2016 - 22:03

శ్రీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనిల్, శృతిలయ హీరో హీరోయిన్లుగా, ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ప్రేమభిక్ష’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌లో శరవేగంగా జరుపుకుంటోంది.

10/26/2016 - 22:00

హెబ్బాపటేల్ కథానాయికగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందిస్తున్న చిత్రం ‘నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్’. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ పోస్టర్‌ను, ఓ పాటను బుధవారం ఉదయం రేడియో మిర్చిలో విడుదల చేశారు.

10/26/2016 - 21:59

హాలీవుడ్ స్టార్ జాకీచాన్ రూపొందించిన ‘ది లెజండరీ అమెజాన్స్’ చిత్రం తెలుగులో సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై విడుదలకు సిద్ధమైంది. జి.వంశీకృష్ణవర్మ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘అమెజాన్ యోధులు’ (మాహిష్మతి రాజ్యం) అనే పేరుతో విడుదల చేస్తున్నారు.

10/26/2016 - 21:58

సారా అర్జున్ ప్రధాన పాత్రలో శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి అందిస్తున్న చిత్రం ‘పిల్ల రాక్షసి’. మలయాళంలో విజయవంతమైన ‘ఆన్ మరియ కలిప్పిలాన్’ చిత్రాన్ని తెలుగులో పిల్ల రాక్షసిగా అనువదించారు. మిథున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించడంతో తెలుగులో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి నవంబర్ 4న విడుదల చేయనున్నారు.

10/26/2016 - 21:58

టాలీవుడ్‌లోనే పరిచయం అయింది ఇలియానా. ఇక్కడ పేరుతెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. బర్ఫీతో అక్కడ ఓ వెలుగు వెలిగింది. అయితే ఆ తర్వాత మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు ఆమెకి రాలేదు. దాంతో ఇలియానా తెలుగులోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తుందని భావించారంతా. ఇలియానా కూడా ఆ దిశగా ఆలోచనలు చేసింది. ఒకట్రెండు ఫంక్షన్‌లకు కూడా హాజరై అందరినీ పలకరించి వెళ్లింది.

10/25/2016 - 20:53

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం తన కొత్త సినిమాను శరవేగంగా పూర్తిచేస్తోన్న విషయం తెలిసిందే. రెండు వారాలుగా హైద్రాబాద్‌లో పలు యాక్షన్ సీన్స్ చిత్రీకరణతో హోరెత్తించిన టీమ్ తాజాగా అహ్మదాబాద్ షెడ్యూల్‌కోసం సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌తోపాటు గుజరాత్‌లోని కథకు అవసరమైన పలు లొకేషన్స్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారు.

10/25/2016 - 20:51

‘ముకుంద’ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆ తరువాత సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు శైలేష్ బొలిశెట్టి. కార్ రేసింగ్‌లో విన్నర్‌గా నిలిచిన శైలేష్, సినిమాలపై వున్న ఆసక్తితో హీరోగా మారాడు. ఆయన కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్

Pages