S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/17/2018 - 20:08

రచయితగా మంచి పేరు సంపాదించుకున్న డైమండ్ రత్నబాబు తొలిసారి దర్శకుడిగా రాబోతున్నారు. శుక్రవారం ప్రారంభం అయిన ఈ సినిమాలో యంగ్ హీరో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్నారు. బుర్రకథ అనేది సినిమా టైటిల్. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సినిమాలోని హీరో ఫస్ట్ సీన్‌కి క్లాప్ అందించగా, లిరిసిస్ట్, రచయిత అయిన శివ శక్తి దత్తా కెమెరా స్విచ్చాన్ చేశారు.

08/17/2018 - 20:06

మళ్లీ రావా చిత్ర దర్శకుడు గౌతమ్ దర్శకత్వంలో నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘జెర్సీ’. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ కజిన్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే గతంలో నాని సరసన మజ్ను చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అను ఇమ్మాన్యుయేల్ కజిన్ రెబ్బ మోనికా జాన్ ఇపుడు నాని సరసన నటించబోతోంది.

08/17/2018 - 20:06

ప్రస్తుతం సినిమా పరిశ్రమవర్గాలను టెన్షన్ పెడుతున్న విషయం ఒక్కటే.. అదే లీకేజీల వ్యవహారం. పైరసీకంటే దారుణంగా తయారైన ఈ వ్యవహారంలో ఇప్పటికే టాలీవుడ్‌లో గీతగోవిందం, టాక్సీడ్రైవర్ సినిమాలు చిక్కుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్‌లోకూడా ముసురుకుంది. తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సర్కార్ సినిమాకు లీకేజీల టెన్షన్ పట్టుకుంది.

08/17/2018 - 20:04

యంగ్ హీరో సుధీర్‌బాబు కొత్త సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి అతిథులుగా నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు వి.వి.వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ హాజరయ్యారు. మొదటి సీన్ ఫస్ట్ షాట్‌కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, నిర్మాత దిల్‌రాజు క్లాప్‌కొట్టారు. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు.

08/17/2018 - 20:02

నిన్నుకోరి చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.

08/17/2018 - 20:02

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నూతన నిర్మాత గణేష్ కొల్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘హల్‌చల్’. శ్రీపతి కర్రి దర్శకుడు. రుద్రాక్ష్ హీరోగా, ధన్య బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం రాజ్ కందుకూరి, మధుర శ్రీ్ధర్, రఘు కుంచె, క్రాంతి మాధవ్‌ల చేతులమీదుగా విడుదల చేయించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ- ప్రతి దర్శకుడికి ఓ విజన్ ఉంటుంది.

08/16/2018 - 20:50

ఇద్దరు హీరోయిన్ల ముద్దుల కథానాయకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న జగపతిబాబుకు హీరోగా క్రేజ్ తగ్గడంతో కాస్త గ్యాప్ తీసుకుని వెంటనే నెగెటివ్ రోల్స్‌పై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం విలన్ పాత్రలతో తనదైన మార్క్‌ను సంపాదించుకున్న జగపతికి ఒక్క టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్‌లలో కూడా క్రేజ్ పెరిగింది. ఇప్పటికే కోలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించిన జగపతిబాబు ఇపుడు భోజపురిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు.

08/16/2018 - 20:49

విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా నటించిన ‘గీత గోవిందం’ ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడంలో హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక మండన్న టాలీవుడ్‌లోకి చలో అంటూ సూపర్‌హిట్ అందుకుని ఎంట్రీ ఇచ్చింది. తాజాగా గీత గోవిందంతో మరో హిట్‌ని తన అకౌంట్‌లో వేసుకున్న రష్మిక నటనకు మంచి స్పందన లభిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ -2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించారు.

08/16/2018 - 20:48

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గాచేస్తున్న బిగ్‌బాస్ టీవీషో ఇప్పటికే 11 సీజన్స్ పూర్తిచేసుకుని మంచి క్రేజ్‌తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 12వ సీజన్‌కు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ షోకు కూడా సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సీజన్‌కోసం ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన వసూలుచేస్తున్నది ఏకంగా 288 కోట్లు!! ఏంటి షాక్ అవుతున్నారా?

08/16/2018 - 20:45

పంద్రాగస్టు సందర్భంగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తిచేసుకుని విడుదలకు రెడీగా ఉంది. మణికర్ణికా (ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ) ఝాన్సీ లక్ష్మీబాయి బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బ్రిటీష్ సైన్యాన్ని గడగడలాడించిన వీరవనిత.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది.

Pages