S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/16/2018 - 20:43

సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సినీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నియామకం జరిగింది. ప్రతిసారీ మూడేళ్లపాటు ఉండే ఈ కమిటీ చైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాష్ నారాయణ్ వల్లూరు నియమితులయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో కూడిన 20 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు.

08/16/2018 - 20:40

పూజ్యశ్రీత క్రియేటివ్స్ పతాకంపై విజయ్ అంబిటి నిర్మాతగా సాయి కె ప్రభాకర్ దర్శకత్వంలో అనిరుధ్ పవిత్రన్, అవంతిక జంటగా నిర్మించిన ‘అబ్బో నా పెళ్లంట’ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి హాలులో జరిగింది. ఇటీవల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులుగా ఎన్నికైన వి.వీరినాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.

08/16/2018 - 20:39

సమ్మోహనం సినిమాతో విజయం అందుకున్న సుధీర్‌బాబు కొత్త సినిమా నేడు (ఆగస్టు 17) రామానాయుడు స్టూడియోలో మొదలుకానుంది. పులి వాసు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సుధీర్‌బాబుతో మెహ్రీన్ కౌర్ నటించనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వి.వి.వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్నారు.

08/16/2018 - 20:37

అడివి శేష్ నటించిన గూఢచారి చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన నటనతో ఆకట్టుకుంటుంది. తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ. తెనాలి ప్రాంతానికి చెందిన శోభితకు తెలుగులో ఇదే మొదటి సినిమా. మాజీ మిస్ ఇండియా అయిన ఈ హీరోయిన్ ఇపుడు మలయాళం సినిమాలో నటించనుంది.

08/16/2018 - 20:35

నూతన నిర్మాణ సంస్థ అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిత దేవేందర్‌రెడ్డి, సురేష్ కేశవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం సమీరం. కొత్త హీరో హీరోయిన్‌లు యశ్వంత్, అమృత ఆచార్య నటిస్తుండగా, రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు.

08/15/2018 - 22:40

**పెళ్లిచూపులు.. అర్జున్‌రెడ్డి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎవ్వరూ ఊహించని క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. అర్జున్‌రెడ్డి సినిమా ఆయన స్టార్‌నే మార్చింది. ఈ ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ తాజాగా గీత గోవిందంగా మన ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్-2 బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన సందర్భంగా హీరో విజయ్ దేవరకొండతో ఇంటర్వ్యూ..

08/15/2018 - 22:46

పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి. ఆ నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిళ్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘శుభలేఖ+లు’. ఈ చిత్రం టైటిల్ నుంచి..విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియోసాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

08/15/2018 - 22:39

విజయ్‌దేవరకొండ ‘గీత గోవిందం’ విజయంతో ఉరకలు వేస్తున్నాడు. వరస చిత్రాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ మొదలుపెట్టేసిన విజయ్ సెప్టెంబరునుండి ‘మళ్ళీమళ్ళీ ఇది రాని రోజు’ దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకోసం డేట్లు కేటాయించనున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.

08/15/2018 - 22:38

యూత్‌స్టార్ నితిన్, రాశీఖన్నా, నందితా శే్వత హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- 15 సంవత్సరాలు..

08/15/2018 - 22:25

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాతగా ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లక్ష్మి’. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతోంది. డాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం.

Pages