S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/10/2018 - 20:13

అరవింద సమేత వీర రాఘవ చిత్రం టీజర్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్ర టీజర్‌ని కూడా విడుదల చేసి తారక్ అభిమానులతోపాటు ప్రేక్షకులను కూడా అలరించడానికి టీజర్ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసింది చిత్ర బృందం.

08/09/2018 - 20:29

అడివి శేష్, శోభితా ధూళిపాళ జంటగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, విస్తా డ్రీం మర్చంట్స్, పీపుల్స్ మీడియా బ్యానర్లపై తెరకెక్కిన గూఢచారి చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- అందరూ అద్భుతంగా పనిచేశారు.

08/09/2018 - 20:28

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వరా క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి ‘మహర్షి’ టైటిల్‌ను ఖరారు చేశారు. సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ను విడుదలచేశారు.

08/09/2018 - 20:25

ఇండియన్ సింగర్స్ రైట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలు, ఇస్రో అడ్వైజర్ సంజయ్ టాండన్, ఆర్.పి.పట్నాయక్, శ్రీలేఖ, వేణు, కౌసల్య, రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ- నేను ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను.

08/09/2018 - 20:06

ప్రభాకర్, వర్షా బోల్‌మా ముఖ్యపాత్రల్లో ఎస్.వి.రమణ స్వీయ దర్శకత్వంలో సాయి సంహిత్ బ్యానర్‌పై తెరకెక్కిన మన్యం చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత రమణ మాట్లాడుతూ- గత పదేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. నాలుగైదు సంవత్సరాలుగా నా చిత్రాన్ని ప్రేక్షకులతో కూర్చుని చూడాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది.

08/09/2018 - 20:05

సంతోష్ శోభన్ హీరోగా జయశంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా పేపర్‌బాయ్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. రియాసుమన్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. అలాగే ఆయనే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు.. టీజర్‌కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

08/09/2018 - 20:30

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోయింది రకుల్‌ప్రీత్‌సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా సక్సెస్‌తో మంచి విజయాన్ని అందుకున్న ఈమె, యువ హీరోలతోపాటు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తాజాగా రెండు, మూడు వరుస పరాజయాలు పలకరించడంతో ఈమెకు కొత్త అవకాశాలు కరువయ్యాయి. అటు కోలీవుడ్‌లో కూడా రకుల్ మంచి పేరు తెచ్చుకుంది.

08/09/2018 - 20:37

ఎంఎస్‌కె ప్రమిద శ్రీ ఫిల్మ్స్ పతాకంపై కృష్ణ సాయి, జహీదా శామ్ జంటగా ఎంఎస్‌కె రాజు నిర్మిస్తోన్న చిత్రం ‘వీడు అసాధ్యుడు’ (ఆన్ అఛీవర్ ట్యాగ్ లైన్). పియస్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఫిలింనగర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా విచ్చేసిన మా అధ్యక్షుడు శివాజీరాజా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా ప్రముఖ నిర్మాత సీతారామరాజు కెమెరా స్విచాన్ చేశారు.

08/09/2018 - 20:02

ప్రేమకథలకు భాషాభేదం అవసరం లేదు. కానీ ప్రతి ప్రేమ కథ కొత్తగా వుండాల్సిందే. అందుకే కొత్తదనంతో నిండిన కథలకు ఎక్కువ ఆద

08/09/2018 - 20:32

నాగశౌర్య, యామినీ భాస్కర్, కశ్మీరా పరదేశి హీరో హీరోయిన్లుగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో ఛలో వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘నర్తనశాల’. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు వంశీ పైడిపల్లి టీజర్‌ను విడుదల చేశారు.

Pages