S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/21/2016 - 22:48

శే్వతాబసు.. ఈ పేరు వినగానే ఆమె చేసిన సినిమాలకంటే కూడా వివాదాలతో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దాంతో ఆమెకు టాలీవుడ్‌లో సినిమాలు కరువయ్యాయి. ఓ కేసు విషయంలో ఆమె ఇమేజ్ డామేజ్ అయ్యింది. ఇక్కడ లాభంలేదని బాలీవుడ్‌లోకి వెళ్లి అక్కడ ఓ దర్శకుడి దగ్గర స్క్రిప్ట్ సహాయకురాలిగా పనిచేసింది. అయితే హిందీలో సినిమాల్లో చేయాలనీ అనుకున్న శే్వతాకు ఓ టీవి సీరియల్‌లో ఛాన్స్ దక్కింది.

09/21/2016 - 22:47

ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ సంగీతం అందిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్‌ను మిలియన్ క్లిక్స్ డిస్క్ వేడుకతో సత్కరించారు.

09/21/2016 - 22:47

నేచురల్ స్టార్ నాని హీరోగా వర్మ దర్శకత్వంలో కేవా మూవీస్ పతాకాలపై అందిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మజ్ను’. ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘యు/ఎ’ సర్ట్ఫికెట్ పొందింది. సెప్టెంబర్ 23న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ..

09/21/2016 - 22:45

గతంలో ‘అవును’ లాంటి హారర్ చిత్రాల్లో నటించిన పూర్ణ, మరోసారి ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తోంది. భీమవరం టాకీస్ పతాకంపై పూర్ణ, గీతాంజలి ప్రధాన తారాగణంగా శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ రూపొందిస్తున్న హారర్ ఎంటర్‌టైన్‌మెంట్ అవంతిక. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

09/21/2016 - 21:56

‘జిల్’, ‘సౌఖ్యం’ వంటి చిత్రాల తరువాత హీరో గోపీచంద్ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ‘ఆక్సిజన్’అనే చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీంతోపాటు గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్‌లో కూడా మరో చిత్రాన్ని ఖాయం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈనెల 22నుండి బ్యాంకాక్‌లో మొదలుకానుంది.

09/21/2016 - 21:55

పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా హైదరాబాద్‌లో రూపొందిస్తున్న కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 రోజులపాటు తొలి షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో అలీ, అభిమన్యుసింగ్, రావు రమేష్ పాల్గొననున్నారు.

09/20/2016 - 21:21

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరుగా మారిపోయిన కొరటాల శివ, తాజాగా ‘జనతా గ్యారేజ్’ సినిమాతో వరుసగా మూడో బ్లాక్‌బస్టర్ కొట్టి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ 5లో రెండు కొరటాల శివ సినిమాలే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారిపోయింది.

09/20/2016 - 21:19

వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జల హరికుమార్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టర్ 420’. ఈ సినిమా సెప్టెంబర్ 30న విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

09/20/2016 - 21:18

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు శంకర్‌ల కలయికలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రోబో 2.0’. 2010లో రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘రోబో’కు ఈ చిత్రం సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. భారతీయ సినీ రంగంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకూ షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. ఇక మిగిలిన షూటింగ్‌లో ఎక్కువ భాగం రజనీ మీదే షూట్ చేయాల్సి ఉంది.

09/20/2016 - 21:10

ఆమె లేకపోతే ఏం? ప్రభుదేవ, తమన్నా, సోనూసూద్ ప్రధాన తారాగణంగా వైవిధ్యమైన కథనం ఎంచుకుని దర్శకత్వం వహించే ఎ.ఎల్.విజయ్ నేతృత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అభినేత్రి’. ఇదే చిత్రాన్ని హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో అదే తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమం ముంబైలో జరిగింది.

Pages